Tuesday, 22 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

పలువురు విద్యార్థులకు గాయాలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కొత్త బస్టాండ్ సమీపంలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళుతున్న ప్రైవేట్ స్కూల్ బస్సును అప్పరల్ పార్క్ బస్సు ఢీ కొట్టింది ఈ ఘటనలో స్కూల్ బస్సు అద్దాలు ధ్వంసమై పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి సమాచారం అందుకున్న సిబ్బంది గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు దర్యాప్తు చేపట్టారు

రాజన్న సిరిసిల్ల

యూరియా పంపిణి పై రైతుల ఆందోళన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కోనరావుపేట రహదారిపై నిజామాబాదుకు చెందిన రైతులు యూరియా కోసం ధర్నా చేపట్టారు యాప్ బుకింగ్ సర్వర్ ఓటిపి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు యాప్ బుకింగ్ కు బదులుగా నేరుగా ఎరువుల దుకాణాల్లో యూరియా అందించాలని కొరతను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు

రాజన్న సిరిసిల్ల

వివరాల మార్పులకు దరఖాస్తులు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణకు దరఖాస్తులు స్వీకరించారు పేర్లు వివరాల్లో తప్పులు చిరునామా మార్పులు కుటుంబ సభ్యుల వివరాల్లో సవరణల కోసం ఓటర్లు ఆధారాలతో దరఖాస్తులు సమర్పించారు జాబితాలో పేర్లు కనిపించకపోవడం వివరాలు సరిగా నమోదు కాకపోవడం పై అధికారులకు వివరించారు

రాజన్న సిరిసిల్ల

పోలీసులకు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం చేసిన బి ఆర్ ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్ నాయకులు ఎస్ కే సాహెబ్ మర్రి శ్రీనివాసరెడ్డి లింగం గౌడ్ సాదిక్ రవి ఇమామ్ షకీల్ ఇలియాస్ కలసి ఎస్ఐ రమేష్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు

రాజన్న సిరిసిల్ల

గ్రామాల నుంచి థియేటర్లకు ప్రేక్షకులు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుమూ డి చిత్రం థియేటర్లో మంచి స్పందన అందుకుంటుంది పండుగ సీజన్ కాకపోయినా మూడో వారంలోని గ్రామాల నుంచి ప్రేక్షకులు థియేటర్లకు తరలి వస్తున్నారు ఇప్పటికే రూ 200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం వారంతరంలోనూ జోరు కొనసాగించే దిశగా దూసుకెళ్తుంది

రాజన్న సిరిసిల్ల

కూలి పెంపుపై కార్మికుల ఆందోళన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో కాటన్ చీరల కార్మికులు ఆసాముల సమ్మె ఐదో రోజుకు చేరింది నెహ్రూ నగర్ లో అంబా భవాని ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో కూలి పెంపుపై యజమాన్యాల వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు సిఐటియు పవర్ లూమ్ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొండం రమణ మాట్లాడుతూ ఒప్పందం ముగిసి రెండేళ్లు గడిచిన కూలి పెంచలేదని ఆరోపించారు

రాజన్న సిరిసిల్ల

అగ్ని ప్రమాదాలపై సిబ్బందికి శిక్షణ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అగ్ని ప్రమాదాల నివారణపై అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మా క్ డిల్ నిర్వహించారు భీమేశ్వర స్వామి వసతి గృహం వద్ద సిబ్బందికి అగ్నిమాపక అధికారి రామ్ కిషన్ రావు ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు లడ్డు తయారీ కేంద్రం నిత్య అన్నదాన సత్రం విద్యుత్ విభాగం ఎస్పీఎఫ్ భద్రత సిబ్బంది పాల్గొన్నారు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు

రాజన్న సిరిసిల్ల

హామీల అమలకు డిమాండ్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ టిఆర్ఎస్ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో పెద్దూరులోని తొమ్మిదో వార్డులో నిరసన చేపట్టారు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ కేటీఆర్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలో భాగంగా రైతులతో కలిసి ఆందోళన నిర్వహించినట్లు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

పోలీస్ యాక్ట్ ఉల్లంఘన పై చర్యలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం చేసిన టిఆర్ఎస్ నాయకుల పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్ రమేష్ తెలిపారు పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు అనుమతి లేకుండా నిరసనలు ధర్నాలు ర్యాలీలు సభలు నిర్వహించరాదన్నారు నిబంధనలు పాటించాలని ప్రజలను కోరారు

రాజన్న సిరిసిల్ల

సీఎం రేవంత్ రెడ్డి పై బిఆర్ఎస్ ఆందోళన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో టిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ పాలన నిరసిస్తూ రెండో రోజు ఆందోళన చేపట్టారు వంట వార్పు నిర్వహించి రోడ్డుపై భోజనం చేశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్యక్రమంలో ఇల్లందుల శ్రీనివాస్ రెడ్డి పందిర్ల పరుశురాం గౌడ్ టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.