Monday, 21 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

స్వల్పంగా తగ్గిన ఎగువ మానేరు నీటిమట్టం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం నీటిమట్టం రోజురోజుకు స్వల్పంగా తగ్గుతుంది గురువారం 1.944 టీఎంసీల నీరు నిలువ ఉంది జలాశయం సామర్థ్యం రెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం వరద ప్రవాహం లేదని అధికారులు తెలిపారు కుడి ఎడమ కాలువల నుంచి నీటిని విడుదల చేయడం లేదన్నారు పూర్తిస్థాయి నీటిమట్టం 1482 .50 అడుగులకు గాను ప్రస్తుతం 1482 అడుగులుగా నమోదయింది

రాజన్న సిరిసిల్ల

హామీల అమలుపై బి ఆర్ ఎస్ ఆందోళన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పై నిరసనగా బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో వేములవాడ సిరిసిల్ల పట్టణాల్లో బుధవారం ర్యాలీలు చేపట్టారు ఎన్నికల హామీలను ప్రస్తావిస్తూ ప్లెక్సీలతో ప్రదర్శన నిర్వహించారు 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్రజలకు బాకీ కార్డులు పంపిణీ చేశారు హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని టిఆర్ఎస్ నాయకులు విమర్శించారు

రాజన్న సిరిసిల్ల

రాజన్న ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారం కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస తెలిపారు మండపం ధర్మగుండం నిత్యాదాన సత్రం తో పాటు గోపురాల అభివృద్ధి చేపడుతున్నట్లు చెప్పారు భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం మెరుగైన క్యూ లైన్లు అభిషేకం అన్న పూజ వసతి సదుపాయాలు కల్పించడమే లక్ష్యమన్నారు

రాజన్న సిరిసిల్ల

వైఎస్ఆర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పేదల సంక్షేమం రైతుల అభివృద్ధితో పాటు విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లాలని అన్నారు

రాజన్న సిరిసిల్ల

ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు రైతులకు పంట ప్రయోజనాలు ప్రభుత్వ రాయితీలపై అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు జిల్లాలో 2958 ఎకరాల్లో సాగు కొనసాగుతుందని అధికారులు తెలిపారు దిగుబడుల విక్రయంతో రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది అన్నారు

రాజన్న సిరిసిల్ల

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ బైపాస్ లో పేకాట ఆడుతున్న స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి తొమ్మిది వేల నాలుగు వందలు రూపాయల నగదు ఐదు మొబైల్ ఫోన్లో ఒక ఆటో 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు మరో ముగ్గురు పరారైనట్లు సిఐ నటేష్ తెలిపారు పట్టుబడిన వారిని సిరిసిల్ల పట్టణ పోలీసులకు అప్పగించారు

రాజన్న సిరిసిల్ల

భూముల రీ సర్వేకు కలెక్టర్ ఆదేశం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామాల్లో భూముల రీ సర్వే ప్రక్రియ కొనసాగుతుంది సర్వే ల్యాండ్ రికార్డ్స్ రెవెన్యూ అటవీ శాఖల సమన్వయంతో భూముల వివరాలు పక్కాగా సేకరించి నమోదు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు లైసెన్సుడ్ సర్వేయర్ల సంఖ్య పెంచడంతోపాటు అవసరమైన రోవర్ యంత్రాలను సమకూర్చుకోవాలని సూచించారు

రాజన్న సిరిసిల్ల

ఆర్టీసీలో కొత్త నియామకాలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 తెలంగాణ ఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు విచారణ అనంతరం గతంలో విధుల నుంచి తొలగించిన 244 మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నామన్నారు సంస్థలు కొత్తగా 2932 బస్సులు అందుబాటులోకి రాగా ప్రస్తుతం 1024 ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు

రాజన్న సిరిసిల్ల

మహిళా సంఘాలకు వైద్య పరీక్షలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మహిళా సంఘాల సభ్యులకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు చేపట్టి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మీరా ఏఎంసి వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగేల రాజు డాక్టర్ స్నేహ ఏ పీ ఎం చంద్రయ్యతో పాటు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

యూనిఫామ్ కుట్టు పనితో మహిళలకు ఉపాధి

పున్నమి ప్రతినిధి సెప్టెంబరు ఒకటి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాముల కుట్టు పనిని మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా వారికి ఉపాధి లభిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు మంగళవారము తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని శ్రీ రేణుక మాత మహిళా శక్తి టైలరింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు మహిళా సంఘాలు సభ్యులు యూనిఫాములు కుట్టే విధానాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.