పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పేదల సంక్షేమం రైతుల అభివృద్ధితో పాటు విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లాలని అన్నారు



