Saturday, 8 August 2026
  • Home  
  • ప్లీస్.. మమ్మల్ని ఇండియాకు రప్పించండి ప్రాణాలతో బిడ్డలను చూసుకోనివ్వండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఇద్దరు మహిళల కన్నీటి వేడుకలు
- కడప

ప్లీస్.. మమ్మల్ని ఇండియాకు రప్పించండి ప్రాణాలతో బిడ్డలను చూసుకోనివ్వండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఇద్దరు మహిళల కన్నీటి వేడుకలు

బతుకు తెరువు కోసం ఇతరదేశానికి వెళ్లిన ఇద్దరు మహిళలు సొంతూరుకు వస్తామో రాలేమో అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆంధ్ర రాష్ట్రం ప్రొద్దుటూరు ఉయ్యూరు నుంచి శిరోమణి పద్మ అనే మహిళలు కొన్ని నెలల క్రితం మస్కట్ ప్రాంతానికి వెళ్లారు. గల్ఫ్ ఏజెంట్ల మాటలు విని ఇక్కడి నుంచి మంచి జీతం వస్తుందని ఆశతో అక్కడికెళ్లారు. అయితే అక్కడి పరిస్థితులు వాళ్ళను ఇబ్బందిలోకి నెట్టేశాయి. ప్రొద్దుటూరు కు చెందిన శిరోమణి కడుపు నొప్పి.. ఉయ్యూరు కు చెందిన పద్మ గుండె సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ఇద్దరు ప్రస్తుతం అక్కడి అరబ్ షేక్ ల ఇంటి నుంచి ఇండియన్ ఎంబసీ కి చేరుకున్నారు. అయితే పాస్పోర్ట్ లు అరబ్ షేక్ ల వద్ద ఉండిపోయాయి. ప్రొద్దుటూరు కు చెందిన శిరోమణి సొంతూరికి రావడం కోసం కుటుంబ సభ్యులు విమాన చార్జీలు కూడా పంపించారు. అయితే మరో రెండు లక్షలు ఇస్తే తప్ప పంపేది లేదంటూ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నొప్పి అధికమై ఇండియాకు చేరుకుంటామో లేదో అన్న భయంతో అక్కడ బతుకీడుస్తున్నారు ఇద్దరు మహిళలు. రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేసుకుంటున్నారు Uploaded Video:

బతుకు తెరువు కోసం ఇతరదేశానికి వెళ్లిన ఇద్దరు మహిళలు సొంతూరుకు వస్తామో రాలేమో అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆంధ్ర రాష్ట్రం ప్రొద్దుటూరు ఉయ్యూరు నుంచి శిరోమణి పద్మ అనే మహిళలు కొన్ని నెలల క్రితం మస్కట్ ప్రాంతానికి వెళ్లారు. గల్ఫ్ ఏజెంట్ల మాటలు విని ఇక్కడి నుంచి మంచి జీతం వస్తుందని ఆశతో అక్కడికెళ్లారు. అయితే అక్కడి పరిస్థితులు వాళ్ళను ఇబ్బందిలోకి నెట్టేశాయి. ప్రొద్దుటూరు కు చెందిన శిరోమణి కడుపు నొప్పి.. ఉయ్యూరు కు చెందిన పద్మ గుండె సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ఇద్దరు ప్రస్తుతం అక్కడి అరబ్ షేక్ ల ఇంటి నుంచి ఇండియన్ ఎంబసీ కి చేరుకున్నారు. అయితే పాస్పోర్ట్ లు అరబ్ షేక్ ల వద్ద ఉండిపోయాయి. ప్రొద్దుటూరు కు చెందిన శిరోమణి సొంతూరికి రావడం కోసం కుటుంబ సభ్యులు విమాన చార్జీలు కూడా పంపించారు. అయితే మరో రెండు లక్షలు ఇస్తే తప్ప పంపేది లేదంటూ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నొప్పి అధికమై ఇండియాకు చేరుకుంటామో లేదో అన్న భయంతో అక్కడ బతుకీడుస్తున్నారు ఇద్దరు మహిళలు. రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేసుకుంటున్నారు

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.