Friday, 2 October 2026

Tag: సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల

గోపాలపల్లి లో తీజ్ మహోత్వవం లొ పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 27 పున్నమి ప్రతినిధి ముస్తాబాద్, ఆగస్టు 27: ముస్తాబాద్ మండలంలోని గోపాల్‌పల్లి గ్రామంలో బంజారా సోదరులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన తీజ్‌ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు సారుగు రాకేశ్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మిడిదొడ్డి భాను, గూడూరు గ్రామ శాఖ అధ్యక్షులు బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారా సోదరులకు తీజ్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

గూడూరు కు హర్ గర్ జల్ హోదా

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 27 (పున్నమి ప్రతినిధి): గూడూరు గ్రామానికి ‘హర్ ఘర్ జల్’ హోదా లభించింది. గ్రామంలోని అన్ని కుటుంబాలకు ఇంటింటా కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు ధృవీకరణ పత్రం జారీ చేశారు. గ్రామసభలో ‘హర్ ఘర్ జల్’, ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ చీటీ సునీత వెంకట నరసింహారావు, ఉప సర్పంచ్ తాటకర్ల ప్రభాకర్ RWS AE ప్రవీణ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. బీఎల్‌ఓ మంజుల ఎస్‌ఐఆర్ నోటీసులపై ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో 180 మందికి పైగా ఓటర్లకు నోటీసులు అందిన నేపథ్యంలో, ఓటు హక్కు కోల్పోకుండా అవసరమైన పత్రాలను బీఎల్‌ఓకు సమర్పించాలని సర్పంచ్ సూచించారు.

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్ కాంగ్రెస్ లో 21 మందితో కొత్త కమిటీ

ముస్తాబాద్ కాంగ్రెస్‌లో 21 మందితో కొత్త కమిటీ రాజన్న సిరిసిల్ల ఆగస్టు 27 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ కమిటీని 21 మందితో ఏర్పాటు చేస్తూ డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, మండల అధ్యక్షులు గజ్జెల రాజు ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ జెండా, ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంతో పాటు క్రమశిక్షణతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని గజ్జెల రాజు సూచించారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభిస్తుందని, ఆశావహులకు భవిష్యత్తులో అధిష్టానం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. కమిటీలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులుగా 21 మందిని నియమించారు. కమిటీ ఏర్పాటుకు సహకరించిన జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేకే మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

గూడూరు పల్లగుట్టను కాపాడుకుందాం ప్రకృతి సంపదగా భావితరాలకు అందిద్దాం

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 26 ( పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండలంలోని గూడూరు: గ్రామానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన పల్లగుట్ట పరిరక్షణ కోసం గూడూరు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఐక్యంగా కదిలారు. యువకులు, మహిళలు, పెద్దలు ఒకే వేదికపై నిలిచి “పల్లగుట్టను కాపాడుకుందాం.. భావితరాలకు అందిద్దాం” అంటూ నినదించారు. సర్వే నంబర్‌ 410లో, నామాపూర్‌ సరిహద్దుగా ఉన్న పల్లగుట్ట వర్షపు నీటిని ఒడిసిపట్టి తాగునీరు, సాగునీటి అవసరాలకు ఉపయోగపడే ప్రకృతి సంపదగా నిలిచిందని ప్రజలు తెలిపారు. గతంలో సుమారు 60 ఎకరాలకు మైనింగ్‌ అనుమతులు వచ్చినప్పుడు గ్రామస్తులంతా ఏకమై తవ్వకాలను అడ్డుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం 11 ఎకరాలకు అనుమతులు పొందిన నేపథ్యంలో పల్లగుట్టను ధ్వంసం చేసే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పల్లగుట్ట కేవలం మట్టి, రాళ్ల గుట్ట కాదని, జీవరాశులకు ఆవాసంగా, భూగర్భజలాల పరిరక్షణకు ఆధారంగా ఉన్న ప్రకృతి వరమని పేర్కొన్నారు. ఈ సంపదను కాపాడటం నేటి తరానికి ఉన్న సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. నామాపూర్‌ ప్రజలు కూడా పరిరక్షణ ఉద్యమానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ చీటి వెంకట నరసింహారావు, సిహెచ్‌. రమేష్‌, ఉపసర్పంచ్‌ తాటకార్ల ప్రభాకర్‌తో పాటు గ్రామ వార్డు సభ్యులు గ్రామ యువకులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

గూడూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

గూడూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రాజన్న సిరిసిల్ల ఆగస్టు 25 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీటి సునీత వెంకటనర్సింగరావు, ఉపసర్పంచ్ తాటకర్ల ప్రభాకర్, జిపిఓ రాజేశం c h అరుణ అంగన్వాడీ టీచర్ మంజుల ఆశా వర్కర్ విజయ తదితరులు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. కార్డులు పొందిన గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. .

రాజన్న సిరిసిల్ల

🌱 నేడు నాటిన మొక్క.. రేపటి తరాలకు ఊపిరి అంటూ మొక్కలు నాటిన సర్పంచ్ చీటి సునీత వేంకట నర్సింగరావు

🌱 నేడు నాటిన మొక్క.. రేపటి తరాలకు ఊపిరి అంటూ మొక్కలు నాటిన సర్పంచ్ చీటి సునీత వేంకట నర్సింగరావు రాజన్న సిరిసిల్ల ఆగస్టు 25 (పున్నమి ప్రతినిధి ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చీటి సునీత వెంకటనర్సింగరావు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మొక్కలను సంరక్షిస్తేనే భావితరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని ప్రకృతి అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తాటాకర్ల ప్రభాకర్, కార్యదర్శి రత్నకుమారి, వార్డు సభ్యురాలు ఎదునూరి శ్రీలత శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రవణ్ కుమార్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక రాజన్న సిరిసిల్ల ఆగస్టు 25 (పున్నమి ప్రతినిధి) సిరిసిల్ల, ఆగస్టు 25: రాజన్న సిరిసిల్ల జిల్లా జర్నలిస్టుల ఐక్య వేదిక రాజన్న ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు కొంపల్లి మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిరిసిల్లలో జరిగిన ప్రత్యేక సమావేశంలో జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా కుమారస్వామి రాయనపట్ల, ప్రధాన కార్యదర్శిగా కర్రల రాజు, జనరల్ సెక్రెటరీగా శ్రీగాద గణేష్, కోశాధికారిగా మహమ్మద్ షఫీ ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణ, సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని మహేష్ తెలిపారు. ఆయన ఎన్నికపై జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

హత్య కేసుల చేతులలో ప్రతిభ కానిస్టేబుల్ అశోక్ కు ప్రశంసలు నగదు బహుమతి

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 23(పున్నమి ప్రతినిధి) సిద్దిపేట కమిషనరేట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గూడూరు గ్రామానికి చెందిన సిద్ధుల అశోక్ నేరాల ఛేదనలో ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. దుబ్బాక, భూంపల్లి పోలీస్ పరిధిలో చోటుచేసుకున్న హత్య కేసులను సమర్థవంతంగా ఛేదించడంలో కీలకంగా వ్యవహరించినందుకు సిద్దిపేట సీపీ మేడమ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతిని అందుకున్నారు. విధి నిర్వహణలో అశోక్ కనబరిచిన ప్రతిభను ఉన్నతాధికారులు అభినందించారు. వారి తల్లిదండ్రులు మరియు పలువురు గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

వధూవరులకు ఆశీస్సులు అందించిన బి ఆర్ఎస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 23( పున్నమి ప్రతినిధి ) రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట మాజీ ఉపసర్పంచ్ కదిరే భూమయ్య కుమార్తె వివాహ వేడుకకు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఏద్దండి నర్సింహారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మెంగని మనోహర్, మండల యువజన అధ్యక్షులు శీలం స్వామి తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

వధూవరులకు ఆశీస్సులు అందించిన బి ఆర్ఎస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 23( పున్నమి ప్రతినిధి ) రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట మాజీ ఉపసర్పంచ్ కదిరే భూమయ్య కుమార్తె వివాహ వేడుకకు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఏద్దండి నర్సింహారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మెంగని మనోహర్, మండల యువజన అధ్యక్షులు శీలం స్వామి తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.