రాజన్న సిరిసిల్ల ఆగస్టు 23(పున్నమి ప్రతినిధి)
సిద్దిపేట కమిషనరేట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గూడూరు గ్రామానికి చెందిన సిద్ధుల అశోక్ నేరాల ఛేదనలో ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. దుబ్బాక, భూంపల్లి పోలీస్ పరిధిలో చోటుచేసుకున్న హత్య కేసులను సమర్థవంతంగా ఛేదించడంలో కీలకంగా వ్యవహరించినందుకు సిద్దిపేట సీపీ మేడమ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతిని అందుకున్నారు. విధి నిర్వహణలో అశోక్ కనబరిచిన ప్రతిభను ఉన్నతాధికారులు అభినందించారు. వారి తల్లిదండ్రులు మరియు పలువురు గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.



