రాజన్న సిరిసిల్ల ఆగస్టు 27 పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్, ఆగస్టు 27: ముస్తాబాద్ మండలంలోని గోపాల్‌పల్లి గ్రామంలో బంజారా సోదరులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన తీజ్ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు సారుగు రాకేశ్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మిడిదొడ్డి భాను, గూడూరు గ్రామ శాఖ అధ్యక్షులు బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారా సోదరులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.


