గాజువాక: 87వ వార్డు పరిధిలో పారిశుధ్య కార్మికులకు వార్షిక ప్రయోజన కార్యక్రమం కింద సబ్బులు, కొబ్బరి నూనె పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోనల్ కమిషనర్ బి. శేషాద్రి మాజీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం (జగన్) పాల్గొన్నారు.
ప్రజారోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం కోసమే ఈ సామగ్రిని అందిస్తున్నట్లు వారు తెలిపారు. విధులతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు, శిరసపల్లి అప్పలరాజు, కనక సత్యం, సుందర్ సునీల్, శానిటరీ సూపర్‌వైజర్ ఎం. కోటేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బి. అనిల్ కుమార్, వార్డు శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు.


