“ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సిన భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించడం దారుణం”
అమలాపురం పట్టణంలోని విలువైన మున్సిపల్ భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడాన్ని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ తీవ్రంగా ఖండించారు.
ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన సుమారు రెండు ఎకరాల భూమిని పార్టీ కార్యాలయానికి కేటాయించడం ఎంతవరకు సమంజసం? అని ఆమె ప్రశ్నించారు.
జిల్లా ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వసతి సదుపాయాలు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత కోసం స్టడీ సర్కిల్ వంటి అవసరాలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని అన్నారు.
ప్రజల ఆస్తులు ఏ రాజకీయ పార్టీకి సొంతం కావని, అవి ప్రజా ప్రయోజనాలకే ఉపయోగపడాలని చింతా అనురాధ స్పష్టం చేశారు.
భూ కేటాయింపును ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలించి, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించాలని ఆమె డిమాండ్ చేశారు.


