Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

కన్నుల పండుగగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కన్నుల పండుగగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వే కోడూరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను రైల్వే కోడూరులో ప్రతి సంవత్సరం రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
  • ఈ ఏడాది కూడా వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు.ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పర్యవేక్షణలో జన్మదిన వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
  • ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి పగడాల వరలక్ష్మి, మాజీ సర్పంచ్ కారుమంచి సంయుక్త, శ్రీమతి తాతంశెట్టి తులసి స్థానిక మండల నాయకులతో కలిసి ఆహ్వాన సంచికను ప్రారంభించారు.

రైల్వే కోడూరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను రైల్వే కోడూరులో ప్రతి సంవత్సరం రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు.ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పర్యవేక్షణలో జన్మదిన వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి పగడాల వరలక్ష్మి, మాజీ సర్పంచ్ కారుమంచి సంయుక్త, శ్రీమతి తాతంశెట్టి తులసి స్థానిక మండల నాయకులతో కలిసి ఆహ్వాన సంచికను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మండలంలోని ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని, వేడుకలకు సవినయంగా హాజరుకావాలని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మాదాసు నరసింహ, మద్దూరి మన్మధ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తుపాకుల పెంచలయ్య, పురం సురేష్, షేక్ రియాజ్, ఆనందలతేజ, మలిశెట్టి రమేష్, రాగిపాటి విజయ్, సువారపు హరిప్రసాద్, మహంకాళి నాగేంద్ర, పొన్నారెడ్డి, తుపాకుల శంకర్, తుపాకుల రవి, చరణ్‌తో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *