🌱 నేడు నాటిన మొక్క.. రేపటి తరాలకు ఊపిరి అంటూ మొక్కలు నాటిన సర్పంచ్ చీటి సునీత వేంకట నర్సింగరావు
రాజన్న సిరిసిల్ల ఆగస్టు 25 (పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చీటి సునీత వెంకటనర్సింగరావు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మొక్కలను సంరక్షిస్తేనే భావితరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని ప్రకృతి అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తాటాకర్ల ప్రభాకర్, కార్యదర్శి రత్నకుమారి, వార్డు సభ్యురాలు ఎదునూరి శ్రీలత శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రవణ్ కుమార్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.


