Tuesday, 25 August 2026
  • Home  
  • తాజుద్దీన్ భౌతికకాయానికి కాంగ్రెస్ నేతల నివాళులు
- ఖమ్మం

తాజుద్దీన్ భౌతికకాయానికి కాంగ్రెస్ నేతల నివాళులు

ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు తాజుద్దీన్ భౌతికకాయానికి కాంగ్రెస్ పార్టీ నేతలు నివాళులు అర్పించారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సూడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ తాజుద్దీన్ భౌతికకాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. తాజుద్దీన్ మృతి పార్టీకి, మైనారిటీ వర్గాలకు తీరని లోటని వారు పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న నేతలు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.