Tuesday, 25 August 2026
  • Home  
  • మానసిక ఆరోగ్యం పై ఆరోగ్య సిబ్బందికి అవగాహన శిక్షణ కార్యక్రమం
- విశాఖపట్నం

మానసిక ఆరోగ్యం పై ఆరోగ్య సిబ్బందికి అవగాహన శిక్షణ కార్యక్రమం

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 25: మానసిక ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, బాధితులకు సకాలంలో తగిన వైద్య సేవలు, కౌన్సెలింగ్ అందించేందుకు ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించడం ఎంతో అవసరమని ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. ఎస్.కె. షహనాజ్ సాదియా అన్నారు. వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న “సాంత్వన” మానసిక ఆరోగ్య ప్రాజెక్టులో భాగంగా మంగళవారం ఆనందపురం పీహెచ్‌సీలో ఆరోగ్య సిబ్బందికి ఒకరోజు మానసిక ఆరోగ్య అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డా. ఎస్.కె. షహనాజ్ సాదియా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమని తెలిపారు. మానసిక సమస్యలను తొలిదశలోనే గుర్తించి వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందించడం ద్వారా సమస్యలు తీవ్రతరం కాకుండా చూడవచ్చన్నారు. మానసిక అనారోగ్యంపై సమాజంలో ఉన్న అపోహలు, వివక్షను తొలగించేందుకు ఆరోగ్య సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వాసవ్య మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ డా. ఎం. అబ్రహాం మాట్లాడుతూ వివిధ రకాల మానసిక అనారోగ్యాలు, వాటి లక్షణాలు, ప్రారంభ హెచ్చరిక సంకేతాలు, చికిత్సా విధానాలు, సమాజంలో ఉన్న అపోహలపై అవగాహన కల్పించారు. మానసిక సమస్యలతో జీవిస్తున్న వారిని నిర్లక్ష్యం చేయకుండా కుటుంబ సభ్యులు, ఆరోగ్య సిబ్బంది, సమాజం కలిసి అవసరమైన సహకారం అందించాలని కోరారు. ఆనందపురం మండలంలో సాంత్వన ప్రాజెక్టు ద్వారా ప్రజలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన, కౌన్సెలింగ్, ఇంటి సందర్శనలు, అవసరమైన వారిని ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రులకు అనుసంధానం చేయడం, చికిత్స కొనసాగేందుకు సహకారం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డా. ఎం. అబ్రహాం తెలిపారు. ప్రాజెక్టు కోఆర్డినేటర్ హేమ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆర్ఎంపీలు, ఆరోగ్య విద్యావేత్తలు, ఇతర కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలన్నారు. బాధితులను గుర్తించి సరైన మార్గదర్శకత్వం అందించడం, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం, అవసరమైనప్పుడు వైద్య సేవలకు అనుసంధానం చేయడం వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ శిక్షణలో 42 మంది ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆర్ఎంపీలు, ఆరోగ్య విద్యావేత్తలు, కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. మానసిక ఆరోగ్య సమస్యల గుర్తింపు, ప్రారంభ సంకేతాలు, చికిత్స, కుటుంబ సహకారం, రిఫరల్ సేవలపై వారు అవగాహన పొందారు. కార్యక్రమాన్ని సాంత్వన ప్రాజెక్టు సూపర్వైజర్ ఎం. నాగరాజు సమన్వయం చేశారు. ప్రాజెక్టు కౌన్సెలర్ రూప, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసరావు, హెల్త్ విజిటర్ పార్వతమ్మ, విజయ్ కుమార్ (IGNOU MSW విద్యార్థి) తదితరులు కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు. హైలైట్ మానసిక ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి, బాధితులకు సరైన వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా ఆనందపురం పీహెచ్‌సీలో సాంత్వన ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 25: మానసిక ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, బాధితులకు సకాలంలో తగిన వైద్య సేవలు, కౌన్సెలింగ్ అందించేందుకు ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించడం ఎంతో అవసరమని ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. ఎస్.కె. షహనాజ్ సాదియా అన్నారు.

వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న “సాంత్వన” మానసిక ఆరోగ్య ప్రాజెక్టులో భాగంగా మంగళవారం ఆనందపురం పీహెచ్‌సీలో ఆరోగ్య సిబ్బందికి ఒకరోజు మానసిక ఆరోగ్య అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డా. ఎస్.కె. షహనాజ్ సాదియా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమని తెలిపారు. మానసిక సమస్యలను తొలిదశలోనే గుర్తించి వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందించడం ద్వారా సమస్యలు తీవ్రతరం కాకుండా చూడవచ్చన్నారు. మానసిక అనారోగ్యంపై సమాజంలో ఉన్న అపోహలు, వివక్షను తొలగించేందుకు ఆరోగ్య సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

వాసవ్య మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ డా. ఎం. అబ్రహాం మాట్లాడుతూ వివిధ రకాల మానసిక అనారోగ్యాలు, వాటి లక్షణాలు, ప్రారంభ హెచ్చరిక సంకేతాలు, చికిత్సా విధానాలు, సమాజంలో ఉన్న అపోహలపై అవగాహన కల్పించారు. మానసిక సమస్యలతో జీవిస్తున్న వారిని నిర్లక్ష్యం చేయకుండా కుటుంబ సభ్యులు, ఆరోగ్య సిబ్బంది, సమాజం కలిసి అవసరమైన సహకారం అందించాలని కోరారు.

ఆనందపురం మండలంలో సాంత్వన ప్రాజెక్టు ద్వారా ప్రజలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన, కౌన్సెలింగ్, ఇంటి సందర్శనలు, అవసరమైన వారిని ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రులకు అనుసంధానం చేయడం, చికిత్స కొనసాగేందుకు సహకారం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డా. ఎం. అబ్రహాం తెలిపారు.

ప్రాజెక్టు కోఆర్డినేటర్ హేమ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆర్ఎంపీలు, ఆరోగ్య విద్యావేత్తలు, ఇతర కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలన్నారు. బాధితులను గుర్తించి సరైన మార్గదర్శకత్వం అందించడం, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం, అవసరమైనప్పుడు వైద్య సేవలకు అనుసంధానం చేయడం వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

ఈ శిక్షణలో 42 మంది ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆర్ఎంపీలు, ఆరోగ్య విద్యావేత్తలు, కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. మానసిక ఆరోగ్య సమస్యల గుర్తింపు, ప్రారంభ సంకేతాలు, చికిత్స, కుటుంబ సహకారం, రిఫరల్ సేవలపై వారు అవగాహన పొందారు.

కార్యక్రమాన్ని సాంత్వన ప్రాజెక్టు సూపర్వైజర్ ఎం. నాగరాజు సమన్వయం చేశారు. ప్రాజెక్టు కౌన్సెలర్ రూప, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసరావు, హెల్త్ విజిటర్ పార్వతమ్మ, విజయ్ కుమార్ (IGNOU MSW విద్యార్థి) తదితరులు కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు.

హైలైట్

మానసిక ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి, బాధితులకు సరైన వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా ఆనందపురం పీహెచ్‌సీలో సాంత్వన ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.