Friday, 2 October 2026

Tag: సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల

జీవన్ రెడ్డికి ఘన సన్మానం

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డిని మండల నాయకులు ఘనంగా ఆహ్వానించి సన్మానించారు. మండల బీఆర్‌ఎస్ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఏనుగు తిరుపతిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఏద్దండి నర్సింహారెడ్డి పాల్గొన్నారు. సీనియర్ నాయకులు చెవుల మల్లేశం, నల్ల నర్సయ్య, శీలం స్వామి, ఎండీ నవాజ్, గూడూరి భరత్, ప్రశాంత్, గొండయ్య, తాళ్ల రాజు తదితరులు పాల్గొని జీవన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో వృద్ధులకు అన్నదానం

పుట్టినరోజు వేడుకల్లో వృద్ధులకు అన్నదానం రాజన్న సిరిసిల్ల ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ లోని అన్నపూర్ణమ్మ ఫౌండేషన్‌కు శనివారం బైరి నరేష్ భార్య సుజాత, వారి పిల్లలు వచ్చారు. వారి కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఫౌండేషన్‌లోని వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు భోజనం వడ్డించి, వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంతో జరుపుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. చిన్నారుల పుట్టినరోజులను సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా సమాజంలో సేవాభావం, మానవత్వం మరింత పెంపొందుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు బైరి నరేష్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

హమాలి కార్మికుల కర్షకుల సమస్యలపై 24న కలెక్టరేట్ ఎదుట ధర్నా

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 21 ( పున్నమి ప్రతినిధి) రాజన్న సిరిసిల్ల: దుమ్ము, దూళి, మట్టి, భవన నిర్మాణ కార్యక్రమాల్లో పనిచేస్తున్న హమాలి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సీఐటీయూ, సీడబ్ల్యూఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి తెలిపారు. అన్ని రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు ఇవ్వాలని కోరారు. లేబర్‌ కార్డులు అర్హులైన హమాలి కార్మిక కర్షకులకు భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే అందించాలని, వారికి సంక్షేమ బోర్డు ప్రయోజనాలు, ఆరోగ్య బీమా, ఇతర ప్రభుత్వ సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందించాలని డిమాండ్‌ చేశారు.

రాజన్న సిరిసిల్ల

వీర్నపల్లి మోడల్ స్కూల్లో పలు అంశాలపై ఆరోపణలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆగస్టు 21 ( పున్నమి ప్రతినిధి) వీర్నపల్లి: మండలంలోని మోడల్‌ స్కూల్‌లో పలు అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. టీసీ కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. టీసీ ఇష్యూ బుక్‌, అడ్మిషన్‌ రిజిస్టర్‌ నిర్వహణపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూల్‌ ఆవరణలోని చెట్లను తొలగించి, వాటిని మిడ్‌డే మీల్స్‌ కార్మికులకు అప్పగించి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

రాజన్న సిరిసిల్ల

వీర్నపల్లి మోడల్ స్కూల్లో పలు అంశాలపై ఆరోపణలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆగస్టు 21 ( పున్నమి ప్రతినిధి) వీర్నపల్లి: మండలంలోని మోడల్‌ స్కూల్‌లో పలు అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. టీసీ కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. టీసీ ఇష్యూ బుక్‌, అడ్మిషన్‌ రిజిస్టర్‌ నిర్వహణపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూల్‌ ఆవరణలోని చెట్లను తొలగించి, వాటిని మిడ్‌డే మీల్స్‌ కార్మికులకు అప్పగించి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

రాజన్న సిరిసిల్ల

వ్యాసరచన, డిబేట్లో సత్తా చాటిన ముస్తాబాద్ విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 21 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్: మండలంలోని ఆవునూరు జడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన వ్యాసరచన, డిబేట్ పోటీల్లో ముస్తాబాద్ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 10వ తరగతి రచన, 9వ తరగతి స్వాతి, 8వ తరగతి వంశిక మండల స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించారు. దీంతో వారు ఈ నెల 24న సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు

రాజన్న సిరిసిల్ల

షాట్ పుట్ లో ప్రతిభ కనబరిచిన బదనకల్ విద్యార్థిని

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 20 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండలం బదనకల్ జడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతున్న బుచ్చెల్లి కృతిక ప్రియదర్శిని అండర్-16 షాట్‌పుట్ పోటీల్లో ప్రతిభ చాటింది. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలతో పాటు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సర్పంచ్ చిగురు నరేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఆకాంక్షించారు.

రాజన్న సిరిసిల్ల

నామాపూర్‌లో 1,350 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ సర్పంచ్ మాదాసు అనిల్

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 20 ( పున్నమి ప్రతినిధి) నామాపూర్ గ్రామంలో అర్హులైన 1,350 పైచిలుకు కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మాదాసు అనిల్, ఉపసర్పంచ్, జీపీఓ, రేషన్ డీలర్లు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో 400కు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ తెలిపారు. సన్నబియ్యం పథకం దుర్వినియోగం కాకుండా ప్రజలు సహకరించాలని కోరారు.

రాజన్న సిరిసిల్ల

రాజీవ్ గాంధీ ఆశయాలే నేటి తరానికి మార్గదర్శకం గజ్జెల రాజు

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 29. (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్‌లో స్వర్గీయ మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జెల రాజు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. యువతకు అవకాశాలు, సాంకేతిక విప్లవం, గ్రామీణాభివృద్ధి, ప్రజాస్వామ్య బలోపేతానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లా బాల్రెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

సర్పంచ్ భూక్య రాజునాయక్ చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ

మోర్రపూర్ గ్రామంలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సర్పంచ్ భూక్య రాజునాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వార్డు సభ్యులు బాధవత్ నర్సింహా, జెల్ల మానస నరేష్, కుల సంఘం అధ్యక్షుడు సూర్య నాయక్, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు బాధవత్ గోవర్ధన్ నాయక్, GPO, కార్యదర్శి, సీనియర్ మేట్ రమేష్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.