Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2026 కు సర్వం సిద్ధం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2026 కు సర్వం సిద్ధం

*తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2026కు సర్వం సిద్ధం*
——————————————————————–
*డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహణ*
*ప్రపంచ స్థాయి పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి అంతర్జాతీయ వేదిక*
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా, సాంకేతిక ఆవిష్కరణలకు వేదికగా తీర్చిదిద్దే లక్ష్యంతో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2026 నిర్వహించనున్నారు.
‘రైజింగ్ టుగెదర్’ నినాదంతో మూడు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేయనుంది.
దేశంలోనే అతిపెద్ద బహుళ రంగాల ఎక్స్‌పోగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు సంబంధించిన ప్రత్యేక ప్రదర్శనలకు ప్రాధాన్యత కల్పించారు. రక్షణ రంగంలో దేశ సంకల్పాన్ని చాటిచెప్పే రక్షా ఎక్స్‌పో – 2026, వాతావరణ మార్పులపై చర్చించేందుకు క్లైమేట్ చేంజ్ కాన్‌క్లేవ్, నూతన ఆవిష్కరణలకు వేదికగా స్టార్టప్ షోకేస్, విద్యా రంగ భవిష్యత్తును ప్రతిబింబించే ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్, వినోద రంగంలో సృజనాత్మకతను ప్రదర్శించే ఇండియా జాయ్ వంటి కార్యక్రమాలను ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCC) కేంద్రంగా, ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో కీలక కేంద్రంగా, ఏరోస్పేస్, తయారీ రంగాలకు ప్రధాన గమ్యస్థానంగా ప్రదర్శించనున్నారు. అంతరిక్ష రంగంలో తెలంగాణ పాత్ర, రక్షణ రంగానికి అవసరమైన విమానాలు, విడిభాగాల తయారీ, సెమీకండక్టర్ల ఉత్పత్తి, డ్రోన్లు, జెట్ ఇంజిన్లు, సముద్ర నిఘా, సరిహద్దు రక్షణ వంటి అంశాలను కూడా ఈ ప్రచార చిత్రాల్లో పొందుపరిచారు.
అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం, స్కైరూట్ సంస్థకు చెందిన విక్రమ్ రాకెట్, ఏరోస్పేస్ తయారీ రంగంలో ఉన్న అవకాశాలు, రక్షణ రంగానికి అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. అదే విధంగా తెలంగాణ గిరిజన సంస్కృతి, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర విశిష్టతను కూడా ఈ ప్రచార శ్రేణిలో ప్రతిబింబించారు.
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, నూతన ఆవిష్కరణలకు ఉన్న అవకాశాలు, వివిధ రంగాల్లో సాధిస్తున్న ప్రగతిని అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడం ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం.
‘రైజింగ్ టుగెదర్’ స్ఫూర్తితో నిర్వహించనున్న ఈ సదస్సు తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, ఆవిష్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి కీలక కేంద్రంగా నిలిపే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలవనుంది.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2026 కు సర్వం సిద్ధం

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2026 కు సర్వం సిద్ధం

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2026 కు సర్వం సిద్ధం

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2026 కు సర్వం సిద్ధం

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2026 కు సర్వం సిద్ధం

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2026 కు సర్వం సిద్ధం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *