Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Jangaon

పాటల పల్లకి కన్వీనర్ గా అయిలా సోమ నరసింహ చారి

Punnami Newsroom Published:
పాటల పల్లకి కన్వీనర్ గా అయిలా సోమ నరసింహ చారి

Story highlights

  • *పాటల పల్లకి కన్వీనర్‌గా అయిలా సోమనర్సింహాచారి నియామకం* ------------------------------------------------------------------- కవులు కళాకారుల ఐక్యవేదిక జనగామ ఆధ్వర్యంలో ప్రతినెలా నిర్వహించనున్న 'పాటల పల్లకి' సంగీత గానలహరి విభాగానికి కన్వీనర్‌గా అయిలా సోమనర్సింహాచారిని ఐక్యవేదిక అధ్యక్షుడు జి.
  • కృష్ణ నియమించారు.
  • మంగళవారం జనగామలో నెల్లుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాలు, ఐక్యవేదిక 'పాటల పల్లకి' కార్యక్రమంలో సభికుల హర్షధ్వానాల మధ్య చారి నియామకాన్ని ప్రకటించారు.

*పాటల పల్లకి కన్వీనర్‌గా అయిలా సోమనర్సింహాచారి నియామకం*
——————————————————————-
కవులు కళాకారుల ఐక్యవేదిక జనగామ ఆధ్వర్యంలో ప్రతినెలా నిర్వహించనున్న ‘పాటల పల్లకి’ సంగీత గానలహరి విభాగానికి కన్వీనర్‌గా అయిలా సోమనర్సింహాచారిని ఐక్యవేదిక అధ్యక్షుడు జి. కృష్ణ నియమించారు.
మంగళవారం జనగామలో నెల్లుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాలు, ఐక్యవేదిక ‘పాటల పల్లకి’ కార్యక్రమంలో సభికుల హర్షధ్వానాల మధ్య చారి నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జి. కృష్ణ మాట్లాడుతూ అభ్యుదయ, సామాజిక, ఆధ్యాత్మిక,సినీ గీతాలతో ఈ ‘పాటల పల్లకి’ సంగీత గానలహరి కార్యక్రమాన్ని ఐక్యవేదిక రూపకల్పన చేసిందని తెలిపారు. స్థానికంగా ఉన్న ఔత్సాహిక గాయనీ గాయకులను ప్రోత్సహించడం, వారికి పాటలు పాడే అవకాశం కల్పించడం కోసం ప్రతినెలా ఒక కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన వివరించారు.
అనంతరం అయిలా సోమనర్సింహాచారి మాట్లాడుతూ.. ఐక్యవేదిక తనను కన్వీనర్‌గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వేదిక ఆశయ సాధనను నిరంతరం ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. జనగామ వేదికగా కార్యక్రమాలు నిర్వహిస్తూనే హైదరాబాద్ రవీంద్రభారతి లాంటి వేదికపై జిల్లా గాయకులను పరిచయం చేయసంకల్పించినట్లు తెలిపారు. పాటల పల్లకి కార్యక్రమాలకు స్పూర్తినిచ్చి ఆతిథ్యం కల్పిస్తున్న నెల్లుట్ల ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ రావుకు ఈ సందర్బంగా చారి కృతజ్ఞతలు తెలిపారు. సోమనర్సింహాచారి నియామకం పట్ల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సహాయ కార్యదర్శి బేతి వీరారెడ్డి, నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెల్లుట్ల రవీందర్ రావు, కల్నల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి, ఐక్యవేదిక భాగస్వామ్య కళా,సాహితి సంస్థల ఆదినేతలు పెట్లోజు సోమేశ్వరాచారి, లగిశెట్టి ప్రభాకర్, చిలుమోజు సాయికిరణ్, డాక్టర్ వేముల సదానందం, గడ్డం మనోజ్ కుమార్ గౌడ్, తాళ్లపల్లి‌ లక్ష్మణ్ గౌడ్, రంగరాజు ప్రసాద్, మసురం రాజేంద్రప్రసాద్ హర్షం ప్రకటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *