రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
రాజన్న సిరిసిల్ల ఆగస్టు 25 (పున్నమి ప్రతినిధి)
సిరిసిల్ల, ఆగస్టు 25: రాజన్న సిరిసిల్ల జిల్లా జర్నలిస్టుల ఐక్య వేదిక రాజన్న ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు కొంపల్లి మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిరిసిల్లలో జరిగిన ప్రత్యేక సమావేశంలో జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా కుమారస్వామి రాయనపట్ల, ప్రధాన కార్యదర్శిగా కర్రల రాజు, జనరల్ సెక్రెటరీగా శ్రీగాద గణేష్, కోశాధికారిగా మహమ్మద్ షఫీ ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణ, సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని మహేష్ తెలిపారు. ఆయన ఎన్నికపై జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు.

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక రాజన్న సిరిసిల్ల ఆగస్టు 25 (పున్నమి ప్రతినిధి) సిరిసిల్ల, ఆగస్టు 25: రాజన్న సిరిసిల్ల జిల్లా జర్నలిస్టుల ఐక్య వేదిక రాజన్న ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు కొంపల్లి మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిరిసిల్లలో జరిగిన ప్రత్యేక సమావేశంలో జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా కుమారస్వామి రాయనపట్ల, ప్రధాన కార్యదర్శిగా కర్రల రాజు, జనరల్ సెక్రెటరీగా శ్రీగాద గణేష్, కోశాధికారిగా మహమ్మద్ షఫీ ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణ, సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని మహేష్ తెలిపారు. ఆయన ఎన్నికపై జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు.

