Friday, 2 October 2026

Tag: సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల

బి ఆర్ ఎస్ నిరసనలకు ముస్తాబాద్ లో సన్నహాక సమావేశం

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరశంఖం రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 1 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని . B R S ఆరోపించింది ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలపై ముస్తాబాద్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు.B R S మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో ప్రజలను చైతన్యం చేసి నిరసనలు చేపట్టి ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

రాజన్న సిరిసిల్ల

వికలాంగుల హక్కులు అమలు చేయాలి

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 31 (పున్నమి ప్రతినిధి) చలో ఖమ్మం సభను విజయవంతం చేయాలని పిలుపు సిరిసిల్ల: సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వికలాంగుల కన్వీనర్‌ శోభారాణి మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్‌ పెంచాలని, ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు 5 శాతం కేటాయింపు అమలు చేయడంతో పాటు బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయాలని, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్‌ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వికలాంగుల హక్కులు, సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్‌ 5న జరగనున్న చలో ఖమ్మం కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పంగ శిరీష, ఆవునూరి ప్రభాకర్, లావుడియా వాలియా, ఆవునూరి లచ్చయ్య, సునీత, జ్యోత్స్న, రేణుక తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

ప్రకృతిని ప్రేమిద్దాం. పల్ల గుట్టను కాపాడుదాం

ప్రకృతిని ప్రేమిద్దాం.. పల్లగుట్టను కాపాడుదాం గూడూరు పల్లగుట్ట మైనింగ్‌ను ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలి రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్‌ 1 (పున్నమి ప్రతినిధి): ముస్తాబాద్‌ మండలం గూడూరు గ్రామ సరిహద్దులోని పల్లగుట్టపై జరుగుతున్న మైనింగ్‌ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. పల్లగుట్ట అనేక జీవరాశులకు ఆవాసంగా ఉండటంతో పాటు వర్షపు నీటిని ఒడిసి పట్టి గ్రామానికి సాగు, తాగునీటిని అందిస్తున్న సహజ వనరుగా ఉందన్నారు. గుట్టపై దర్గా, ముస్లింల సమాధులు ఉండటంతో పవిత్ర స్థలంగా భావిస్తున్నామని తెలిపారు. మాజీ సర్పంచ్‌ చాకలి రమేష్‌ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో AIFB రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోజి రెడ్డి, దళిత్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్‌, సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గీస బిక్షపతి, CPI మాజీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, AISF జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేష్‌ పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే కేటీఆర్‌, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి స్పందించి మైనింగ్‌ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. యాదవ సంఘం అధ్యక్షుడు చెరుకు ఎల్లం, యూత్‌ అధ్యక్షుడు కాసులవాడ శ్రీకాంత్‌, గౌడ సంఘం అధ్యక్షుడు బత్తిని సంతోష్‌, కే.రాజు, షేక్‌ అబ్బాస్‌తో పాటు వివిధ కుల సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన పై ముస్తాబాద్ లో ఇద్దరు పై సస్పెన్షన్ వేటు

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 31 ( పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్: కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఫిర్యాదులు, సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని తోట ధర్మేందర్, జంగ రాజులను పార్టీ కార్యకలాపాల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని వెల్లడించారు. సంబంధిత పార్టీ నియమావళి ప్రకారం క్రమశిక్షణ చర్యల ప్రక్రియ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్ల

రైతులకు యూరియా కొడత లేకుండా చూడాలి BRS

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండలంలో రైతులకు యూరియా కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. యూరియా యాప్‌లో సరిపడా నిల్వలు కనిపించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మండలంలోని ఫర్టిలైజర్, మందుల దుకాణాలతో పాటు కో-ఆపరేటివ్ సొసైటీలు, సహకార సంఘాల ద్వారా కూడా యూరియా అందించాలని కోరారు. మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏద్దండీ నర్సింహారెడ్డి, బత్తుల అంజయ్య, నల్ల నర్సయ్య, శీలం స్వామి తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

నామాపూర్ పల్లగుట్ట తవ్వకాలు నిలిపివేయాలని ప్రజావాణిలో వినతి

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ గ్రామ పరిధిలోని పల్లగుట్ట తవ్వకాలను నిలిపివేయాలని గ్రామసభలో గ్రామ ప్రజల సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ తీర్మాన ప్రతిని సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. పల్లగుట్టను పరిరక్షించి, ప్రకృతి సంపదను కాపాడాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాదాసు అనిల్, ఉపసర్పంచ్ తాడేపు కొమరయ్య, వార్డు సభ్యులు తాడేపు అనిల్, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ మెరుగు అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

బిల్లు కలెక్టర్ అనుమానస్పద మృతి ఎల్లారెడ్డిపేటలో విషాదం

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 30 (పున్నమి ప్రతినిధి) ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న నవీన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ముస్తాబాద్ మండలం గోపాల్‌పల్లి గ్రామపంచాయతీలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సవీన్‌ ఎల్లారెడ్డిపేటలోని తన నివాసంలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాఘి పండుగ సందర్భంగా భార్య పుట్టింటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల

కూరగాయల సంతతో ట్రాఫిక్‌ తంటాలు.. ప్రమాదాల భయాలు!

ముస్తాబాద్ లో నిర్వహిస్తున్న ఆదివారం సంత లో లారీ బంపర్‌ తగిలి ద్విచక్ర వాహనదారుడికి గాయాలు.. అధికారుల తక్షణ చర్యలు అవసరం ముస్తాబాద్: ముస్తాబాద్ ప్రధాన చౌక్‌ పరిసరాల్లో రోడ్డుపైనే కూరగాయల సంత నిర్వహించడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు, ప్రమాదాల ముప్పు నెలకొంది. ఆదివారం సంతకు వెళ్తున్న మంది దబ్బేడ రాములు ద్విచక్ర వాహనాన్ని లారీ బంపర్‌ ఢీకొనడంతో గాయపడ్డారు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రధాన రహదారిపై వ్యాపారులు, కొనుగోలుదారులు చేరడంతో తరచూ ట్రాఫిక్‌ జామ్‌లు, ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించకముందే అధికారులు స్పందించి, సంతను రహదారికి దూరంగా సురక్షిత ప్రాంతంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రాజన్న సిరిసిల్ల

రైలు కూతతో సిరిసిల్లలో కొత్త ఆశలు

🚆 సిరిసిల్ల జిల్లాలో మోగిన రైలు కూత! రాజన్న సిరిసిల్ల ఆగస్టు 30 ( పున్నమి ప్రతినిధి) బస్వాపూర్ వరకు విజయవంతమైన ట్రయల్ రన్.. రైలు రాకతో ప్రజల్లో హర్షం రాజన్న సిరిసిల్ల: దశాబ్దాల నిరీక్షణకు తెరపడే దిశగా సిరిసిల్ల జిల్లాలో రైల్వే పనులు వేగం పుంజుకున్నాయి. కొత్తపల్లి–మనోహరాబాద్ నూతన రైల్వే లైన్‌లో భాగంగా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ రైల్వే స్టేషన్ వరకు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. తొలిసారిగా జిల్లా సరిహద్దులోకి రైలు రావడంతో స్థానికులు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు పట్టాలు, సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించారు. రైల్వే మార్గం పూర్తయితే సిరిసిల్ల చేనేత, జౌళి ఉత్పత్తుల రవాణాతో పాటు వేములవాడకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది.

రాజన్న సిరిసిల్ల

తాళ్ల విజయ రెడ్డి వివాహ వేడుకలకు ప్రముఖుల హాజరు

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని దత్త సాయి గార్డెన్‌లో ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్, మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు తాళ్ల విజయ్ రెడ్డి వివాహ వేడుకకు ప్రముఖ మండల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.