ముస్తాబాద్ లో నిర్వహిస్తున్న ఆదివారం సంత లో
లారీ బంపర్ తగిలి ద్విచక్ర వాహనదారుడికి గాయాలు.. అధికారుల తక్షణ చర్యలు అవసరం
ముస్తాబాద్: ముస్తాబాద్ ప్రధాన చౌక్ పరిసరాల్లో రోడ్డుపైనే కూరగాయల సంత నిర్వహించడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు, ప్రమాదాల ముప్పు నెలకొంది. ఆదివారం సంతకు వెళ్తున్న మంది దబ్బేడ రాములు ద్విచక్ర వాహనాన్ని లారీ బంపర్ ఢీకొనడంతో గాయపడ్డారు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రధాన రహదారిపై వ్యాపారులు, కొనుగోలుదారులు చేరడంతో తరచూ ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించకముందే అధికారులు స్పందించి, సంతను రహదారికి దూరంగా సురక్షిత ప్రాంతంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


