Saturday, 5 September 2026
  • Home  
  • ప్రజల వద్దకు పాలన తీసుకెళుతున్న నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య పున్నమి న్యూస్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ
- ఎన్ టి ఆర్ జిల్లా

ప్రజల వద్దకు పాలన తీసుకెళుతున్న నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య పున్నమి న్యూస్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ

ప్రజల చెంతకే పాలన.. సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. నందిగామలో ప్రజా దర్బార్ నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు – ప్రజల నుంచి నేరుగా వినతుల స్వీకరణ.. నందిగామ: ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు అన్నారు. నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బారులో ఆమె ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వివిధ సమస్యలను ఎమ్మెల్యే సౌమ్య గారి దృష్టికి తీసుకురాగా, ప్రతి వినతిని ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా సమస్యలకు సంబంధించి సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి, ప్రజలకు సత్వర పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, నిబంధనల మేరకు వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య గారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు దూరంగా ఉండే పాలనకు స్వస్తి పలికి, ప్రజల వద్దకే నేరుగా పాలనను తీసుకువచ్చిందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన అజెండా అని పేర్కొన్న ఆమె.. నందిగామ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజా దర్బార్‌ల ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే సౌమ్య గారు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారం చూపుతున్న ప్రజా దర్బార్‌కు స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

ప్రజల చెంతకే పాలన.. సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..

నందిగామలో ప్రజా దర్బార్ నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు – ప్రజల నుంచి నేరుగా వినతుల స్వీకరణ..

నందిగామ: ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు అన్నారు. నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బారులో ఆమె ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు వివిధ సమస్యలను ఎమ్మెల్యే సౌమ్య గారి దృష్టికి తీసుకురాగా, ప్రతి వినతిని ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా సమస్యలకు సంబంధించి సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి, ప్రజలకు సత్వర పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, నిబంధనల మేరకు వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య గారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు దూరంగా ఉండే పాలనకు స్వస్తి పలికి, ప్రజల వద్దకే నేరుగా పాలనను తీసుకువచ్చిందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన అజెండా అని పేర్కొన్న ఆమె.. నందిగామ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజా దర్బార్‌ల ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే సౌమ్య గారు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారం చూపుతున్న ప్రజా దర్బార్‌కు స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.