రామగుండం, సెప్టెంబర్ 05:
రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసు శాఖలో గత 35 సంవత్సరాలుగా హోం గార్డులుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న జె. రామయ్య (హోం గార్డు నంబర్: 256), మంచిర్యాల జిల్లా పరిధిలో,పి. సత్తయ్య (హోం గార్డు నంబర్: 249), గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా పరిధిలో సేవలందించిన సందర్భంగా ఇద్దరికీ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వారికి పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఉద్యోగ విరమణ అనంతరం వారి జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్,హోం గార్డ్స్ ఆర్‌ఐ పెద్దన్న, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు ఎన్. శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ ఎం. తిరుపతి, ప్రధాన కార్యదర్శి జె. అంజనేయులు, సంయుక్త కార్యదర్శి కె. ఓంకార్, సభ్యులు, హోం గార్డ్స్ ఇన్‌చార్జీలు, తదితరులు పాల్గొన్నారు.


