వార్త ముఖ్యాంశాలు
- 🚆 సిరిసిల్ల జిల్లాలో మోగిన రైలు కూత!
- రాజన్న సిరిసిల్ల ఆగస్టు 30 ( పున్నమి ప్రతినిధి) బస్వాపూర్ వరకు విజయవంతమైన ట్రయల్ రన్..
- రైలు రాకతో ప్రజల్లో హర్షం రాజన్న సిరిసిల్ల: దశాబ్దాల నిరీక్షణకు తెరపడే దిశగా సిరిసిల్ల జిల్లాలో రైల్వే పనులు వేగం పుంజుకున్నాయి.
🚆 సిరిసిల్ల జిల్లాలో మోగిన రైలు కూత!
రాజన్న సిరిసిల్ల ఆగస్టు 30 ( పున్నమి ప్రతినిధి)
బస్వాపూర్ వరకు విజయవంతమైన ట్రయల్ రన్.. రైలు రాకతో ప్రజల్లో హర్షం
రాజన్న సిరిసిల్ల: దశాబ్దాల నిరీక్షణకు తెరపడే దిశగా సిరిసిల్ల జిల్లాలో రైల్వే పనులు వేగం పుంజుకున్నాయి. కొత్తపల్లి–మనోహరాబాద్ నూతన రైల్వే లైన్‌లో భాగంగా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ రైల్వే స్టేషన్ వరకు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. తొలిసారిగా జిల్లా సరిహద్దులోకి రైలు రావడంతో స్థానికులు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు పట్టాలు, సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించారు. రైల్వే మార్గం పూర్తయితే సిరిసిల్ల చేనేత, జౌళి ఉత్పత్తుల రవాణాతో పాటు వేములవాడకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది.