Tuesday, 12 May 2026

Blog

తిరుపతి

ఘనంగా గ్రామ దేవత శ్రీ గొల్లపల్లెమ్మ ఉత్సవాలు

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం ఉదయమాణిక్యం గ్రామపంచాయతీ పుట్టావాండ్లపల్లి సమీపంలో ఉన్న గ్రామ దేవత అయిన శ్రీ గొల్లపల్లెమ్మ అమ్మవారి తిరునాళ్లు గత మూడు రోజులుగా ఘనంగా జరిగినాయి ఉదయ మాణిక్యం గ్రామానికి చెందిన కోరవాండ్లపల్లి పుట్టవాండ్లపల్లి కాల్వకాడ తొప్పి రెడ్డి గారి పల్లి మర్రిపాటి వారి పల్లి గ్రామస్తులు సంయుక్తంగా కలిసి మూడు రోజుల ఈ జాతరను ఘనంగా నిర్వహించినారు ఈరోజు చివరి రోజు అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకొని ఘనంగా పూజ చేసి భక్తులు వారి మొక్కులు తీర్చుకొని ఘనంగా జాతరను ముగించారు

హనుమకొండ

పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి సహకారంతో మన వార్డును అభివృద్ధి చేసుకుందాం*

* *ఈరోజు పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశానుసారం 7వ వార్డులో బుర్ర సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు ఇన్చార్జి దుబాసి వెంకటస్వామి గారు పాల్గొని వారు మాట్లాడుతూ మన శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారితోనే వార్డును అభివృద్ధి చేసుకుందాం ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి AMC చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి గారు సమన్వయ కమిటీ సభ్యులు నల్లెల్ల అనిల్ కుమార్, సీనియర్ నాయకులు వెల్దండి విజయ్ భాస్కర్, మార్కెట్ డైరెక్టర్ నల్లెల్ల కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉడుత సంపత్, మార్క రజనీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు. పులి రాజు, గోపు సంజీవ్, గోపు కొమురయ్య. పంచగిరి భాస్కర్. రాగుల నాగరాజు. వార్డు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*

ఖమ్మం

గ్రామీణ వికాసం బిజెపి తోనే సాధ్యం

సత్తుపల్లి (ఖమ్మం పున్నమి ప్రతినిధి) ఆగష్టు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో బేతుపల్లి లో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ ప్రచారం చేపట్టాలని ఇచ్చిన పిలుపుమేరకు బీజేపీ మాజీ మండల అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ అధ్యక్షులు పాలకొల్లు రోజా రాణి, పాకనాటి హరిబాబు, మునుగొండ స్రవంతి “ఘర్ ఘర్ బీజేపీ” కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభలు శ్రీమతి కరణం పరిణిత తో కలిసి పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరు రామలింగేశ్వర రావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుబిజెపి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కన్వీనర్ శ్రీ e.v రమేష్ ఒక్కదాని పుల్లారావు యాదవ్, బిజెపి జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి బిజెపి కార్యకర్త వెళ్లి గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపడుతున్నటువంటి విషయాన్ని ప్రజలకు వివరించి కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రతి ఇంటికి తెలియచేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు.. ➡️ మోదీ పాలనలో దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ➡️ ప్రతి బూత్ అధ్యక్షుడు కనీసం 100 ఇండ్లను సందర్శించి మోదీ సందేశం చెప్పాలన్నారు. ➡️ ఇది కేవలం ప్రచారం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్యమమని తెలిపారు. ➡️ గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతిలో మునిగిపోయాయని విమర్శించారు. ➡️ బీసీలకు న్యాయం చేయాలని, 42% రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ➡️ మోదీ నాయకత్వంలో అభివృద్ధి, గ్రామీణ సంక్షేమం జరుగుతోందని వివరించారు. ➡️ రేషన్, రోడ్లు, మొక్కలు నాటడం, పీఎం కిసాన్ నిధులు వంటి పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. “ప్రతి ఇంటికీ బీజేపీ సందేశం – ప్రతి గ్రామానికి అభివృద్ధి” ఈ కార్యక్రమంలో మంద శివ యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆచంట నాగ స్వామి, మాజీ కౌన్సిల్ సభ్యులు మట్ట ప్రసాద్, శివ, సాయి, బండి ఆంజనేయులు, ప్రసాద్, వేంసూర్ మాజీ మండల అధ్యక్షులు పరసా రాంబాబు,పట్టణ అధ్యక్షులు బానోతు విజయ్,తల్లాడ మండల అధ్యక్షులు నాగులు, ఉబ్బల కృష్ణ, పాల నాగ సురేంద్ర రెడ్డి, వేంసూర్ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మెరుగు శేషగిరిరావు, కార్తీక్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, వెంకట రెడ్డి, శ్రీనివాస్, అశోక్, ఈడ గణేష్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు

యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై

యాదాద్రి భువనగిరి జిల్లా. ఆగస్టు (పున్నమి ప్రతినిధి) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి ఫవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ను వీక్షించిన మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి *గొంగిడి సునీత మహేందర్ రెడ్డి* మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి గారు , బూడిద బిక్షమయ్య గౌడ్ గారు, మాజీ డిసిసిబి చైర్మన్ టెస్కబ్ మాజీ వైస్ చైర్మన్ *గొంగిడి మహేందర్ రెడ్డి* గారు, మాజీ జెడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్ గారు, రైతు బంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ గారు మరియు BRS జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

యాదాద్రి భువనగిరి

విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి) – *యు.ఎస్.పి.సి యాదాద్రి జిల్లా కమిటీ* విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ లో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్ పీసీ) ఆధ్వర్యంలో దశలు వారి పోరాటాల్లో బాగంగా ఈ రోజు ముక్కెర్ల యాదయ్య, టి వీరభద్రం, జి లక్ష్మీనరసింహారెడ్డి అధ్యక్ష వర్గంగా ధర్నా నిర్వహించాము. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని, 5571 పిఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి, పీఆర్సీని ప్రకటించి 1/7/2023 నుండి అమలు చేయాలన్నారు. పెండింగ్ డీఏ లను వెంటనే చెల్లించాలని, సీ పీఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 317 జీ ఓ వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులందరినీ వారి సొంత జిల్లాలకు పంపించాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులందరికీ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓ 25 ను సవరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలనీ, టైం స్కేల్ ఇవ్వాలని, వివిధ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్, పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇవ్వాలని, నూతన జిల్లాలకు డీఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్ కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించ నట్లైతే ఆగష్టు 23 న హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి మహా ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ధర్నా తదనంతరము జిల్లా కలెక్టర్ కు గారికి మెమొరాండం ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు మెతుకు సైదులు , మైలారం సత్తయ్య, ఎస్ భాస్కర్, సి హెచ్ లక్ష్మి, ఎ వెంకటా చారి, శ్రీనివాసు, పొన్నాల సత్తయ్య, బి లింగయ్య, కె రాజగోపాల్, వెంకట్ రెడ్డి, జి లింగయ్య , సైదా రెడ్డి, ఎన్ వెంకటేశ్వర్లు, జనార్ధన్, బిక్షపతి,దశరథ, కె వెంకన్న తదితరులు పాల్గొన్నారు. *USPC యాదాద్రి జిల్లా కమిటీ*

జాతీయ అంతర్జాతీయ

*”ప్రపంచ మహిళా చదరంగ చరిత్రలో కొత్త కిరీటధారి – దివ్య దేశ్‌ముఖ్* *”*

జూలై 5 నుండి జూలై 28, 2025 వరకు జార్జియాలోని బటుమిలోని గ్రాండ్ బెల్లాజియో హోటల్‌లో జరిగిన FIDE మహిళల చదరంగ ప్రపంచకప్ ను మన భారత్ లోని నాగపూర్ కు చెందిన 19 ఏళ్ల దివ్య దేశముఖ్ గె లుచుకొని, భారత దేశం నుంచి మొట్టమొదటి ప్రపంచ మహిళా చదరంగ ఛాంపియన్ గా చరిత్ర సృష్టించారు. కాగా, ఈ పోటీలలో 46 దేశాలకు చెందిన 107 మంది పాల్గొన్నారు, ప్రపంచంలోని టాప్ 20 మహిళా క్రీడాకారులలో 17 మంది పాల్గొనడం విశేషం. ప్రతి రౌండ్‌లో రెండు క్లాసికల్ గేమ్‌లు జరిగాయి – అవసరమైన సందర్భాలలో టైబ్రేక్‌లు నిర్వహించబడ్డాయి. మొత్తం బహుమతి నిధి US$691,250 కాగా, ఛాంపియన్‌కు US$50,000, రన్నరప్‌కు $35,000 మరియు మూడవ స్థానంలో నిలిచిన క్రీడాకారిణికి $25,000 ఇవ్వబడ్డాయి. అలాగే, మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారు 2026 ఉమెన్స్ క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించారు. సెమీఫైనల్స్ లో * **కోనేరూ హంపీ (భారతదేశం)** vs **లెయ్ టింగ్జీ (చైనా) మధ్య జరిగిన పోరులో, హంపీ టైబ్రేక్‌లో విజయం సాధించి ఫైనల్‌కి చేరగా, **దివ్య దేశ్‌ముఖ్ (భారతదేశం)** vs **తాన్ జోంగియి (చైనా) మధ్య జరిగిన టైబ్రేక్‌లో దివ్య విజయం సాధించి తన మొదటి ప్రపంచ ఫైనల్‌కి చేరింది. మూడవ స్థానం కోసం జరిగిన పోరులో తాన్ జోంగియి,లెయ్ టింగ్జీని ఓడించి మూడవ స్థానం దక్కించుకుంది. *ఫైనల్ కు చేరిన కోనేరూ హంపి మరియు దివ్య దేశ్‌ముఖ్* ఇద్దరూ మన భారత్ కు చెందినవారే కావడం గర్వకారణం. వీరి మధ్య జరిగిన మొదటి రెండు క్లాసికల్ గేమ్స్ కూడా డ్రాగా ముగియటంతో టై బ్రేక్ ల ద్వారా విజేత ను నిర్ణయించాల్సి వచ్చింది. టైబ్రేక్‌లలో దివ్య అసాధారణంగా ఆడి, రెండవ గేమ్‌లో విజయంతో *1.5–0.5 పాయింట్ల తేడాతో ఫైనల్ లో గెలవడం ద్వారా మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచి, భారత్ నుంచి మొట్టమొదటి ప్రపంచ మహిళా చెస్ ఛాంపియన్ గా చరిత్ర సృష్టించింది*. ఈ విజయాన్ని అందుకోవడం ద్వారా దివ్య దేశముఖ్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ కూడా గెలవడం మరో విశేషం.

తిరుపతి

అర్హులైన జర్నలిస్టుల కు అక్రిడేషన్లు ఇవ్వాలి.ఏపీయూడబ్ల్యూజే

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు మంజూరు చేయాలని,జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం మరియు హెల్త్ కార్డుల లోని లోటుపాట్లను సవరించి ప్రయోజనకరంగా ఉండేలా చేయాలని కోరుతూ శ్రీకాళహస్తి ఆర్డిఓ కార్యాలయంలోని ఏవో కి వినతి పత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ యల్లంపాటి కోటేశ్వర బాబు, శ్రీకాళహస్తి పాత్రికేయులు, కోట చంద్రశేఖర్, బాలసుబ్రమణ్యం, అలీమ్, ఈశ్వర్, వినయ్, వెంకటేష్, హిమబిందు, పురుషోత్తం, ఎమ్మార్ మునిరత్నం, చైతన్య, వర్ధన్ తదితరులు.

తెలంగాణ పెద్దపల్లి వరంగల్

తెలంగాణ రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించిన పోలీస్ డాగ్

రామగుండం పోలీస్ కమీషనరేట్ నార్కోటిక్ డాగ్ “సింబా” ఎంపిక రామగుండం, ఆగస్టు 04, పున్నమి ప్రతినిధి: వరంగల్ జిల్లా మమునూరు పిటిసిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ లో కాళేశ్వరం జోన్ నుండి నార్కోటిక్ డాగ్ విభాగం పోటీలో పాల్గొనీ గంజాయి, మత్తు పదార్థాలను గుర్తించడం లో పోలీసు జాగిలం సింబా, డాగ్ హ్యాండ్లర్ ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం. వేణుగోపాల్ కృష్ణ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిదంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ డాగ్ గా “సింబా” ఎంపిక కావడం జరిగింది. సోమవారం రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తమ కార్యాలయంలో నార్కోటిక్ డాగ్ సింబా, డాగ్ హాండ్లర్ ను అభినందించడం జరిగింది. 2026 సంవత్సరం ఫిబ్రవరిలో పూణేలో జరిగే నేషనల్ పోలీసు డ్యూటీ మీట్ లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలని తెలంగాణ రాష్ట్రానికి, రామగుండం పోలీస్ కమీషనరేట్ కి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ పి. కరుణాకర్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్, వామన మూర్తి, సంపత్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

శ్రీ ధన కొండమ్మ దేవత తిరణాల మహోత్సవం

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం గుడ్లవారిపల్లి గ్రామం కంప సముద్రం నందు ధన కొండమ్మ దేవత తిరణాలు మంగళవారం నుంచి ఆదివారం వరకు మహోత్సవం జరుగును కావున భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృప పాత్రులు కాగలరు మంగళవారం కార్యక్రమం ఉదయం తీర్థ సంగ్రహణము, ప్రధాన దేవతల కలిశస్థాపన మూలమంత్ర జపములు. శ్రీ చండి సప్తశతి పారాయణం, పంచామృత అభిషేకం, నైవేద్యం మంగళహారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వినియోగం సాయంత్రం షోడశ ఉపచార పూజలు అగ్ని ప్రతిష్ట, దీక్ష హోమం, సహస్రనామార్చన, నైవేద్యం మహా మంగళ హారతి తీర్థ ప్రసాదం వినియోగం జరుగును.

తెలంగాణ సినిమా హైదరాబాద్

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన!

*తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన!* హైదరాబాద్, ఆగస్టు 04, పున్నమి ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలను స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు కో-ఛైర్మన్‌ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చింది. తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ హబ్‌ ను నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌ గా సంజీవ్ గోయెంకా ను కో-ఛైర్మన్‌ గా ఉపాసన కొణిదెల నియమించారు. అపోలో హాస్పిటల్స్‌ లో CSR వైస్ ఛైర్‌ పర్సన్ , UR లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌ గా ఆరోగ్యం, ఫిట్‌నెస్, యువతకు సంబంధించిన కార్యక్రమాలలో ఉపాసన పేరు తెచ్చుకున్నారు. ఆమె నాయకత్వం క్రీడాకారుల సంక్షేమం , క్రీడా విద్యపై దృష్టి సారిస్తుందని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తోంది. ఈ పాలసీ ద్వారా తెలంగాణ క్రీడా రంగాన్ని రాజకీయ ప్రభావం నుండి దూరంగా ఉంచి, ప్రైవేట్ సంస్థలు, నిపుణులతో భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.