Tuesday, 12 May 2026

Blog

తెలంగాణ సినిమా హైదరాబాద్

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన!

*తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన!* హైదరాబాద్, ఆగస్టు 04, పున్నమి ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలను స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు కో-ఛైర్మన్‌ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చింది. తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ హబ్‌ ను నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌ గా సంజీవ్ గోయెంకా ను కో-ఛైర్మన్‌ గా ఉపాసన కొణిదెల నియమించారు. అపోలో హాస్పిటల్స్‌ లో CSR వైస్ ఛైర్‌ పర్సన్ , UR లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌ గా ఆరోగ్యం, ఫిట్‌నెస్, యువతకు సంబంధించిన కార్యక్రమాలలో ఉపాసన పేరు తెచ్చుకున్నారు. ఆమె నాయకత్వం క్రీడాకారుల సంక్షేమం , క్రీడా విద్యపై దృష్టి సారిస్తుందని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తోంది. ఈ పాలసీ ద్వారా తెలంగాణ క్రీడా రంగాన్ని రాజకీయ ప్రభావం నుండి దూరంగా ఉంచి, ప్రైవేట్ సంస్థలు, నిపుణులతో భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.

తెలంగాణ

తెలంగాణకు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం హైదరాబాద్, ఆగస్టు 05, పున్నమి ప్రతినిధి: బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారుతోంది. దక్షిణ బంగాళాఖాతంలో ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం మంగళవారం, బుధవారం (ఆగస్ట్ 5, 6) తెలంగాణపై ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్ష సూచన రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమూ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డిలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇతర చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈదురుగాలుల తీవ్రత వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హవామాన శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచనలిచ్చింది. హెచ్చరికలు: గగనతల విద్యుత్‌ స్ఫోటాల నుంచి జాగ్రత్తగా ఉండాలనీ, విద్యుత్ లైన్‌ల దగ్గరగా వెళ్లకుండా ఉండాలనీ, రైతులు పొలాల్లో ఉండే సమయాన్ని తగ్గించుకోవాలనీ, నీటి ప్రవాహాల వద్ద, పురుగు మందుల పిచికారీ సమయంలో సురక్షిత దూరం పాటించాలనీ సంబంధిత అధికారులు ముందస్తు సూచనలు జారీ చేశారు. రైతులకు సూచన: వర్షాభావ పరిస్థితులు మారే సూచనలు ఉన్నందున సాగు కార్యక్రమాలను వాయిదా వేయవచ్చు. వర్షపాతం ఆశించదగిన పంటలను ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ సలహా ఇచ్చింది.

ఖమ్మం

కల్లూరు లో హాస్టల్ తీరు.

*ఈ హాస్టల్ లో మేముండలేం….* *పశువుల కంటే హీనంగా చూస్తున్నారు* *కూర అడిగితే గరిటతో కొడుతున్నారు…* *కిచిడీ తిని… 40 మంది విద్యార్థులకు ఆస్వస్థత* *హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాగమయి* *హస్పటల్ సందర్శించిన సబ్ కలెక్టర్* *వైద్యం అందించిన డాక్టర్ నవ్య కాంత్* *కారకులపై చర్యలు తీసుకోవాలి-ప్రజా సంఘాలు* (కల్లూరు ) ఖమ్మం పున్నమి స్టాఫర్ ఆగష్టు వారంతా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాల నుండి వచ్చిన పిల్లలు. కొందరికి తండ్రి లేరు. కొందరికి తల్లి లేరు.ఇంకొంత మందికి తల్లిదండ్రులు లేరు. మరి కొందరి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఐ టి డి ఐ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గిరిజన సంక్షేమ హాస్టల్లో చదువుతున్న పిల్లలు. సోమవారం ఉదయం కిచిడీ తిని అస్వస్థకు గురయ్యారు నాసిరకమైన ఉడికి ఉడకని కిచిడీ తిని అసోస్త గురై ఆసుపత్రి పాలైన సంఘటన కల్లూరులో చోటు చేసుకుంది వివరాల్లోకెళ్తే కల్లూరు మున్సిపాలిటీ పరిధి గిరిజన సంక్షేమ హాస్టల్ లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన హాస్టల్ సిబ్బంది ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అందుబాటులో ఉన్న డాక్టర్ నవ్య కాంత్ సిబ్బందితో కలిసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాప్రాయం నుండి కాపాడారు. సోమవారం ఉదయం కిచిడి తిన్న విద్యార్థులు అందరూ కడుపునొప్పి, వాంతులు కాగా విద్యార్థులు అస్వస్థతకు అవ్వడంతో గురయ్యారు. విషయం తెలుసుకున్న ఏ ఎం సి చైర్మన్ హాస్పిటల్ కి చేసుకుని విద్యార్థుల పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కు తెలపగా స్పందించిన ఎమ్మెల్యే హుటాహుటిన కల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ కి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను చూసి చలించి ఆమె వైద్యం చేశారు.స్వతహాగా డాక్టర్ అయిన ఎమ్మెల్యే విద్యార్థులకు వైద్యం అందించి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం హాస్టల్ సందర్శించి జరిగిన సంఘటనపై హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకైతే ఇలాంటి భోజనం పెడతారా, అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో మెనూ రేట్లు కూడా పెంచితే ,నిర్లక్ష్యంగా వ్యవహరించి నాసిరకమైన ఆహారం అందిస్తారా అని హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న విద్యార్థులను పరామర్శించి,మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ నవ్య కాంత్ కి సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మార్వో పులి సాంబశివుడు, ఎంపీడీవో చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి విషయం తెలిసిన వెంటనే హాస్పటల్ కు చేరుకుని, దగ్గరుండి విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ హాస్టల్లో మేము ఉండలేమని ,పశువుల కంటే హీనంగా చూస్తున్నారని ,తమ ఆవేదన వ్యక్తం చేశారు. పురుగులు అన్నం పెడుతున్నారని ,ప్రశ్నిస్తే కొడుతున్నారని, కూర అడిగితే వంట మనిషి గరిటతో కొడుతుందని ,మీ ఇండ్లలో ఇంతకంటే నాణ్యమైన అన్నం తింటున్నారా అంటూ,మారు అన్నం అడిగిన తిడుతున్నారని విద్యార్థులు వాపోయారు. ఏది ఏమైనా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వార్డెన్, వంట మనిషిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం, సిపిఐ, ఎస్ఎఫ్ఐ, విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. అనేక సమస్యలతో ఉన్న హాస్టల్లో పరిస్థితిని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మాట్లాడి పూర్తి రక్షణ కల్పించే విధంగా, నాణ్యమైన ఫుడ్ అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉడికకీ ఉడకని కిచిడీ తిన్న విద్యార్థులు మాత్రమే అస్వస్థతకు గురై ఇబ్బంది పడ్డారని అధికారులు తెలిపారు. విద్యార్థులు తిన్న కిచిడిని ఎమ్మెల్యే రాగమయి, డాక్టర్ నవ్య కాంత్,తహశీల్దార్, ఎంపీడీవో పరిశీలించారు. ఆ స్వస్థతకు గురైన విద్యార్థులను ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు పసుమర్తి చందర్రావు తమ వాహనాల్లో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఏది ఏమైనా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

క్రైమ్

రోడ్డు ప్రమాదాలకి అడ్డుకట్ట వెయ్యాలి :cp

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఆగష్టు రోడ్డు ప్రమాదాలని అరికట్టే దిశ గా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి అని కమిషనర్ సునీల్ దత్ అధికారులని ఆదేశించారు. జిల్లా పోలీస్ అధికారులు తో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు,స్టేషన్ ల వారీగా నమోదైన కేసు ల దర్యాప్తు, పెండింగ్ కేసుల పురోగతి మీద సమీక్సించారు. వైరా, కల్లూరు డివిజన్ లలో బ్లాక్ స్పాట్ లలో బారికేడ్లు, ప్రమాద సంకేతిక బోర్డు లు, స్థాపర్స్, సిగ్నెల్ లైట్ లు, బ్లీంకింగ్ లైట్ లు ఏర్పాటు చేసి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సీసీ కెమెరా లను హైదరాబాద్ కామాండ్ కంట్రోల్ తో అనుసంధానం చేయించాలి అని ఆదేశించారు, సీసీ ఆర్ బి ఇన్స్పెక్టర్ స్వామి, ఎస్ ఐ లు రవి, సత్యనారాయణ లు పాల్గొన్నారు

ఖమ్మం

ఖమ్మం జిల్లా ఇంచార్జి విద్యాశాఖ అధికారిని గా నాగ పద్మజ

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఆగష్టు 5 ఖమ్మం జిల్లా ఇంచార్జ్ విద్యాశాఖ అధికారిని గా జిల్లా పరిషత్ డిప్యుటీ సి ఈ ఒ నాగపద్మ జ నియమితులు ఐయ్యారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జులై నెల చివరి న జిల్లా విద్యాశాఖ అధికారిగా సామినేని సత్య నారాయణ ఉద్యోగ విరమణ చేసినప్పటి నుండి పోస్ట్ ఖాళీ గా ఉండటం తో నాగ పద్మ జ కు పూర్తి స్థాయి అదనపు భాద్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీలు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కీలక భాద్యతలు నిర్వర్తించాలిసి ఉంటుంది

యాదాద్రి భువనగిరి

తెలంగాణలో స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ విడుదలకు నోచుకొని ప్రజాపాలన ప్రభుత్వం

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాలయాపనతో ప్రజాపాలన ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎస్ఎఫ్ఐ భువనగిరి పట్టణ కార్యదర్శి ఈర్ల రాహుల్ అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని సుందరయ్య భవన్లో పట్టణ సహాయ కార్యదర్శి కరెట్లపల్లి భవాని శంకర్ అధ్యక్షతన భువనగిరి పట్టణ కమిటీ సమావేశం నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఎలా కాలయాపన చేసిందో ఈ ప్రజా పాలన ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుందనిన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల కోట్ల 3 వందల స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ప్రతిపక్షంలో ఉండి అనేక వాగ్దానాలు చేసే అధికారంలోకి వచ్చినంక విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా కేవలం మాటలకు పరిమితం అవుతూ ముందుకెళుతుందని అన్నారు. తెలంగాణలో విద్యార్థులు స్కాలర్షిప్లు రాక తీవ్ర ఇక్కట్లు గురి అవుతూ చదువుకు పేద విద్యార్థులు దూరమవుతున్నారని అన్నారు. నెలలో అనేకసార్లు క్యాబినెట్ మీటింగ్లు పెట్టి విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోవడం అంటే దేనికి సంకేతం అని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణలో విద్యారంగం అనేక సమస్యలతో ఉన్నదని పరిష్కరించే నాధుడే లేరని తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం అంటే కేవలం మాటలు చెప్పే ప్రభుత్వం లాగానే మిగిలిపోయిందని వారు అన్నారు. పేద విద్యార్థుల బాధలను పట్టించుకోని తక్షణమే స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులందరినీ సమీకరించి పోరాటాలను ఉదృతం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ ఉపాధ్యక్షులు ఏడుమేకల మహేష్, సుష్మ, దీప్తి పట్టణ నాయకులు వెన్నెల,ప్రేమజ, మౌనిక, పాల్గొన్నారు…

యాదాద్రి భువనగిరి

బహుజన స్మశాన వాటికలను పరిరక్షించాలి పెంట నర్సింహ్మ

ముదిరాజ్ కులస్థులకు (ముదిరాజ్ సంఘo ) చెందిన స్మశాన వాటికను “1064” సర్వేనెంబర్ కలిగిన భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా *”బహుజన స్మశాన వాటికల పరిరక్షణ కమిటీ యాదాద్రి భువనగిరి”* జిల్లా కమిటీ అధ్యక్షులు “*పెంట నర్సింహ్మ ముదిరాజ్*” గారు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి ఎదురుగా ఉన్న మా ముదిరాజ్ కులస్థుల సమాధులను కొంతమంది గుర్తు తెలియని దుండగులు భూమిని చదును చేస్తున్నారు ,ఇట్టి భూమిలో సుమారు 60 కి పైగా సమాధులు తీసివేశారు అని వీరిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు గారు,మాజీ కౌన్సిలర్ ఎనబోయిన జహంగీర్, సాధు విజయ్, గొర్రెంకల శివశంకర్, ఇట్టబోయిన గోపాల్, ఉడత భాస్కర్, దుగ్యల రవి,షాగంటి నర్సింహా, గడిల ప్రభాకర్,గుర్రాల మల్లేష్, పెంట నితీష్, తుమ్మల నగేష్,పెంటబోయిన నాగరాజు,బాలరాజు,కొల్పుల హరినాథ్, ఇండ్ల శ్రీను, ప్రవీణ్ ,ముదిరాజు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు….

యాదాద్రి భువనగిరి

13వ వార్డు ప్రజలశ్రేయస్సే నాకర్తవ్యం గుర్రాల శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి 13వ వార్డు ప్రజలు గత నాలుగు సంవత్సరాలుగా లో వోల్టేజ్ కారణంగా నానా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి దృష్టికి ఇట్టి సమస్యను 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల శ్రీనివాస్ గారు తీసుకెళ్లగా తక్షణమే స్పందించి గౌరవ విద్యుత్ అధికారులు డి ఈ ఏ డి ఏ. ఈ గార్లకు ఎమ్మెల్యే గారు సమస్యను వివరించి అట్టి సమస్య పరిష్కారం కోసం కృషిచేసి ప్రజల సమస్యను తీర్చడం ముఖ్యంగా భావించి అక్కడ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినందుకు ముందుగా గౌరవ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి వార్డు ప్రజల తో కలిసి గుర్రాల శ్రీనివాస్ గారు నేడు ధన్యవాదాలు తెలుపుతూ అట్టి ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించడం జరిగింది ఇట్టి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రగతి నగర్ 13వ వార్డు ప్రజలు లో వోల్టేజ్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ టీవీలు ఫ్రిజ్లు ఇంట్లో ఉన్నటువంటి వాటర్ మోటర్లు పిల్లలకు చదువుకోవడం కూడా సమస్యగా ఏర్పడిన సందర్భంలో ఇట్టి విషయాన్ని గ్రహించి ప్రజలందరి సహకారంతో గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లామని తదనంతరం జరుగుతున్నటువంటి పనులను పలు దఫాలుగా అక్కడికి వెళ్లి పరిశీలించి ప్రజలకి అతి త్వరలో అందుబాటులోకి ట్రాన్స్ఫార్మర్ను తీసుకురావాలని విద్యుత్ అధికారులను పలుమార్లు కలిసి సమస్యను వివరించడం జరిగిందన్నారు తక్షణమే ఎమ్మెల్యే గారి సహకారంతో 13వ వార్డు ప్రజల సమస్యలను తీర్చుట కొరకు నేడు నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటుచేసి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జనగాం కవిత నరసింహ చారి, పూదరి లక్ష్మీ సతీష్, విశ్రాంత ఉద్యోగస్తులు బాల్ రెడ్డి గారు కృష్ణమూర్తి గారు, వార్డు ప్రజలు గోమారి మహిపాల్ రెడ్డి, సురేష్, సంతోష్ సిరికొండ కిరణ్,ప్రసాద్, నరాల మహేష్, సత్యం వెంకటేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

5వ తేదీ ఏపీజీఈఏ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల కొరకు వినూత్నంగా “రండి – టి…తాగుతూ మాట్లాడుకుందాం” అనే కార్యక్రమం..!* *-నంద్యాల జిల్లా అధ్యక్షులు కె.నాగేంద్రప్ప.*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (ఏపీజీఈఏ ) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిరంతరం పోరాట పటిమతో ఉద్యోగుల డిమాండ్స్ కొరకు రాజీలేని పోరాటం చేస్తూ ఉద్యోగుల హక్కులై లక్ష్యంగా అనగా ఉద్యోగులకు బకాయిగా ఉన్న 30 వేల కోట్ల రూపాయలు, పి ఆర్ సి, ఐఆర్, డిఏ, సరెండర్ లీవ్స్ మరియు ప్రధానమైన డిమాండ్స్ కొరకు ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షులు కె. ఆర్.సూర్య నారాయణ ఉద్యోగుల కోసం ప్రభుత్వంతో సమస్యల పై పోరాటం చేస్తూ… ఒక విన్నూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగుల కొరకు చేపట్టారు. ఆ కార్యక్రమమే …”రండి – టి…తాగుతూ మాట్లాడుకుందాం” అనే కార్యక్రమాన్ని రేపు అనగా 05.08.2025 వ తేది ఉదయం 11.00 గంటలకు స్థానిక కె .సి.కెనాల్ కార్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సమస్య పైన ఒక వీడియో రూపంలో ఉద్యోగుల ముందుకు తీసుకురానున్నాము. అందువలన ఈ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లాలో నిర్వహించాలని ఏపీజీఈఏ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పత్రిక ప్రకటన విడుదల చేస్తూ ఉద్యోగుల హక్కులపై అందరిని చైతన్య పరిచి, ప్రభుత్వం సమస్య కొరకు స్పష్టమైన పరిష్కారం చేసేవిధంగా సూచనను చేస్తూ ఉద్యోగుల ఆమోదం కొరకు చేద్దామని రాష్ట్ర సంఘం మేరకు పిలుపు నివ్వడమైనదని నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప తెలిపారు.

తిరుపతి

పిల్లారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సామగ్రి పంపిణి*

శ్రీకాళహస్తి మండలం అబ్బా బట్లపల్లి పాఠశాల విద్యార్థులకు పిల్లారి ఫౌండేషన్ విద్యా సామాగ్రి పంపిణీ.శ్రీకాళహస్తి పట్టణం పిల్లారి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిల్లారి దుర్గాప్రసాద్ కుమార్తె పిల్లారి అమరావతి శ్రీకాళహస్తి మండలం రామాపురం పంచాయతీ అబ్బా బట్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు పలకలు, బలపాలు, పెన్సిళ్లు, పెన్నులు 80 మంది విద్యార్థులకు సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్ఎంసి మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.