Tuesday, 12 May 2026

Blog

ఖమ్మం

ప్రెస్ మీట్

కళ్ళుండి చూడలేని కాబోధులారా…. చెవులుండి వినలేని చెవిటివలా… న్యాయ దేవతనే మోసం చేస్తున్న న్యాయ వాదులారా న్యాయం కావాలని కోరుకునే అభాగ్యులకు మీరిచ్చే న్యాయ సలహా ఇదేనా? న్యాయ దేవత పై నమ్మకం పెంచండి. రేవంత్ రెడ్డి గారి పై,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పై విమర్శలు తగవు. కడుపు మండి మా బొచ్చెలో బువ్వ గుంజుకొని తింటున్నారని న్యాయ దేవత ను కోరడం తప్పా? తెగల పై చిచ్చు పెడుతున్నారని నిజాన్ని ఉరి తీయకండి న్యాయ దేవత కళ్ళు తెరిచి చూడనివ్వండి – ఎస్. డీ. రాధా కృష్ణ (జర్నలిస్ట్)

సూర్యాపేట

ట్రాఫిక్ నుంచి విముక్తి

కొత్త బస్టాండ్ నుంచి శంకర్ విలాస్ సెంటర్ వరకు షాప్ బోర్డులను తొలగిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, మున్సిపల్ సిబ్బంది ట్రాఫిక్ నుంచి విముక్తి కల్పిస్తూ తనకంటూ ముద్ర వేసుకుంటున్న ట్రాఫిక్ ఎస్ఐ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న ప్రజలకు, వాహనదారులకు ఉపశమనం కలిగించే విధంగా సూర్యాపేట మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం సమన్వయంతో కలిసి ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలను విముక్తి కలిగిస్తున్నారు. ఈ బోర్డులు తొలగించడం పట్ల పట్టణ ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అలాగే దంతాలపల్లి సూర్యాపేట రోడ్డు మీదుగా సూర్యాపేటకు వచ్చే మార్గంలో విపరీతంగా భారీ వాహనాలు పోలీస్ సిబ్బంది రోడ్డు డైవర్షన్ చేయక పోవడంతో అనవసరంగా వాహనాలు పట్టణంలోకి ప్రవేశించి ట్రాఫిక్ సమస్యను సృష్టిస్తున్నాయి దానివల్ల దుమ్ము, ధూళి తో పాటు ట్రాఫిక్ సమస్యతో సూర్యాపేట పట్టణానికి రోజుకు వేలాదిమంది తమ సొంత పని నిమిత్తం వస్తుంటారు. కాబట్టి భారీ వాహనాలను డైవర్షన్ చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

సంగారెడ్డి

నారాయణఖేడ్ ఆగస్ట్ 06 (పున్నమి ప్రతినిధి): గురుకుల కళాశాలను తనిఖీచేసిన సబ్ కలెక్టర్.

నారాయణఖేడ్ పట్టణ ప్రాంతంలోని గిరిజన గురుకులకళాశాలను నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా భారతి గారుఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగాకళాశాలలోని కిచెన్ రూమ్, స్టాక్ రూమ్, తరగతిగదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతోకలిసి అల్పాహారం లో పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్యాదగిరితో మాట్లాడుతూ.. కళాశాలలోని వసతులనుగురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయ బృందంపాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అన్నదాత సుఖీభవ పథకం కి దరఖాస్తు చేసుకోండి:- తాసిల్దార్

అన్నదాత సుఖీభవ పథకం కి దరఖాస్తు చేసుకోండి:- తాసిల్దార్ సీతారాంపురం మండలం అన్నదాత సుఖీభవ పథకంలో పేరు నమోదయి ఉండి వివిధ కారణాల దృశ్య నగదు జమ కాని రైతులు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తాసిల్దార్ పి.వి. కృష్ణారెడ్డి తెలిపారు.540 మంది రైతులు మరణించినట్లు జాబితా వచ్చిందన్నారు. వారసులు సంబంధిత పత్రాలతో పాటు మరణ ధ్రువీకరణ పత్రం. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్. కుటుంబ బాగా పంపకాల దస్తాలు తీసుకొని సంబంధిత విఆర్ఓలకు అందిస్తే త్వరగా జమ అవుతుంది అని ఆయన పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇస్కాన్ లో చిన్నారులకు పోటీలు

పున్నమి ప్రతినిధి( శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) నెల్లూరులోని ఇస్కాన్ (అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం) మందిరంలో ఆదివారం రోజున త్వరలో జరుపబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను పురస్కరించుకొని వ్యాసరచన, చిత్రలేఖనం, బొమ్మలకు రంగులు వేయడం, భగవద్గీత శ్లోక పఠనం, శ్రీ కృష్ణ గానం మొదలైన విషయాలలో పోటీలు నిర్వహించారు. పాల్గొన్న వారందరికీ ప్రసాదాలు, ప్రమాణ పత్రాలు సమర్పించారు అందించారు. ఈ పోటీలు ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. తమ పిల్లలు సనాతన ధర్మం గురించి తెలుసుకునేలా ప్రోత్సహించినందుకు తల్లిదండ్రులను అభినందించారు.

తిరుపతి

సూర్య ప్రభ వాహనంపై దర్శనమిచ్చిన నీలకంఠేశ్వర స్వామి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధం దేవాలయమైన ఊరందూరు గ్రామంలో వెలసియున్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మంగళవారం రెండవ తిరునాళ్ళు నిర్వహించడం జరిగింది.ముందుగా స్వామి అమ్మవార్లను పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం సూర్య ప్రభ వాహనంపై శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు.

భక్తి

ప్రవచనాల కు అనుమతి లేదా పరమేశా!అంజూరు తారక శ్రీనివాసులు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కైలాస క్షేత్రంలో నిత్యం ఆధ్యాత్మిక ప్రవచనాలతో ధార్మిక ప్రసంగాలతో ముక్తి మార్గాన్ని సూచించాల్సిన చోట ఆధ్యాత్మిక ప్రవచనాలకు శ్రీకాళహస్తి దేవస్థానం అనుమతులు ఇవ్వకపోవడం అత్యంత శోచనీయమని  దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు. తాము పాలకమండలి ఛైర్మెన్ గా వున్నప్పుడు శుక బ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతి విద్యా స్వరూపానంద స్వామూల వారి ప్రవచనాలు ఏర్పాటు చేశామన్నారు.ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈఓ ప్రవచనాలను అనుమతి ఇచ్చి ప్రజలలో ఆధ్యాత్మికత పెరిగేలా చేయాలన్నారు.

E-పేపర్

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే టీ తాగుదాం చర్చించుకుందాం – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రప్ప

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ గారు నూతనంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమం ఈనెల 5వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నంద్యాల జిల్లా చిన్న నీటి పారుదల శాఖ కార్యాలయం ఆవరణంలో రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత పాలకులు ఉద్యోగుల బకాయిలు పరిష్కరించాలని సమస్యల తోరణం తో ధర్నాలకు వెళితే ఉద్యోగులను దేశద్రోహుల భావించి మన రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్ సూర్యనారాయణ గారిని అరెస్టు చేసే ప్రయత్నం చేశారన్నారు. అయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయని ప్రభుత్వాలు మనకెందుకని మనం నూతనంగా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైబడిన ఇంకా ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తున్నది అన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు సుమారు 35 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉందని ఈ మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో అర్థం కావడం లేదన్నారు. అందుకని జిల్లా కేంద్రాలు, పరిసర మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాల రూపంలో ఉద్యోగులకు ఇచ్చి వారికి ఇవ్వాల్సిన బకాయిలను జమ చేసుకోవడం వలన ఇటు ఇల్లు నిర్మించుకోవాలన్న ఉద్యోగుల కల అటు ప్రభుత్వ బకాయిలు రెండు నెరవేరుతుందని రాష్ట్ర అధ్యక్షులు అభిప్రాయమని నాగేంద్రప్ప పేర్కొన్నారు. దీంతోపాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక సంఘం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమే అన్నారు. రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమంలో కూడా ఏదైనా ఉద్యోగ సమస్యలు ఉంటే తమ సంఘం దృష్టికి తీసుకువస్తే సత్వరం జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కారం కి కృషి చేస్తానని జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకంతో తాము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశంతోనే సానుకూలంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమం ద్వారా ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నామని ఆయన అన్నారు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని వారు వారి పిల్లలకు వివాహాధి కార్యక్రమాలు చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాలను ప్రభుత్వం గుర్తించి సత్వరం ఉద్యోగుల బకాయిల చెల్లింపుకు మార్గాన్ని ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వానికి విన్నవించారు. కార్యక్రమం అనంతరం రాష్ట్ర అధ్యక్షుకు శ్రీ కె ఆర్ సూర్యనారాయణ గారి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, కార్యదర్శి తిరుపాల్, ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్ విజయలక్ష్మి సునీల్ కుమార్, ఎన్.యం. ఆర్. మినిమం టైమ్ స్కేల్ రాష్ట్ర అధ్యక్షులు సురేష్ మరియు నాయకులు వేణుగోపాల్ రెడ్డి, కార్య వర్గ సభ్యులు దావూద్ ఖాన్, బుల్లెట్ భాష, రఫీ, ఆళ్లగడ్డ వ్యవసాయ శాఖ ADA విజయశేఖర్ ఉద్యోగులు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయండి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు(పున్నమి ప్రతినిధి) ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కరట్లపల్లి.భవాని శంకర్ భువనగిరి జిల్లా కేంద్రంలోని బిసి కళాశాల హాస్టల్ కమిటీ ఆధ్వర్యంలో వారు కరపత్రం ఆవిష్కరించి. ఆగస్టు 11,12,13వ తేదీల్లో భువనగిరిలో జరిగే ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలతో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ చదువుతు పోరాడు, చదువుపై పోరాడు నినాదంతో ముందుకెళ్తుందన్నారు. విద్యార్థుల సమస్యలపై నికరంగా పోరాడుతున్న సంఘం ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్న అతిపెద్ద సంఘమన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకొచ్చిన బీజేపీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణం చేయడం కోసం ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. నూతన విద్యా విధానం వల్ల విద్యను పూర్తిగా ప్రయివేటీకరణ చేయడం జరుగుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకొచ్చి 24 నెలలవుతున్నా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజురీయీంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శిక్షనా తరగతులకు 300 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరవుతారన్నారు. 11వ తేదీన భువనగిరి ర్యాలీ ఉంటుందన్నారు. 12,13వ తేదీల్లో శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. తరగతులో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమం రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హాస్టల్ కమిటీ కార్యదర్శి గోల్కొండ సతీష్, కమిటీ నాయకులు అరవింద, అభిషేక్,అభినవ్, శివ, మచ్చగిరి మరియు విద్యార్థులు పాల్గొన్నారు

తిరుపతి

ఘనంగా గ్రామ దేవత శ్రీ గొల్లపల్లెమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం ఉదయమాణిక్యం గ్రామపంచాయతీ పుట్టావాండ్లపల్లి సమీపంలో ఉన్న గ్రామ దేవత అయిన శ్రీ గొల్లపల్లెమ్మ అమ్మవారి తిరునాళ్లు గత మూడు రోజులుగా ఘనంగా జరిగినాయి ఉదయ మాణిక్యం గ్రామానికి చెందిన కోరవాండ్లపల్లి పుట్టవాండ్లపల్లి కాల్వకాడ తొప్పి రెడ్డి గారి పల్లి మర్రిపాటి వారి పల్లి గ్రామస్తులు సంయుక్తంగా కలిసి మూడు రోజుల ఈ జాతరను ఘనంగా నిర్వహించినారు ఈరోజు చివరి రోజు అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకొని ఘనంగా పూజ చేసి భక్తులు వారి మొక్కులు తీర్చుకొని ఘనంగా జాతరను ముగించారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.