Tuesday, 12 May 2026

Blog

అన్నమయ్య

శ్రీ సీతా లక్ష్మణ హనుమంత సమేత రామచంద్రస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట

….హత్తిరాల కమ్మపల్లిలో శ్రీ సీతా లక్ష్మణ హనుమంత సమేత రామచంద్రస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ముఖ్య అతిథిగా బత్యాల. 06-08-2025వ తేదీ బుధవారం నాడు రాజంపేట మండలం హత్తిరాల కమ్మపల్లిలో శ్రీ సీతా లక్ష్మణ హనుమంత సమేత రామచంద్రస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా విచ్చేసి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు.ఈ సందర్భంగా వేద పండితులు బత్యాల చంగల్ రాయుడు ను శాలువ కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.అనంతరం అక్కడ నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు……., ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

తెలంగాణ

ముఖ్య మంత్రి నివాళి

ప్రొఫెసర్ జయ శంకర్ గారి జన్మ దిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం కృషి చేశారని, తన జీవితమే త్యాగం చేసిన మహానుభావుడు మన జయ శంకర్ సార్ ఆయన చూపించిన బాటలో నడవాలి, ఆయన చేసిన త్యాగం తెలంగాణ రాష్ట్రo ఎప్పటికీ మర్చిపోదు అని అన్నారు. -ఎస్. డీ. రాధా కృష్ణ (జర్నలిస్ట్)

తెలంగాణ

ముఖ్య మంత్రి నివాళి

ప్రొఫెసర్ జయ శంకర్ గారి జన్మ దిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం కృషి చేశారని, తన జీవితమే త్యాగం చేసిన మహానుభావుడు మన జయ శంకర్ సార్ ఆయన చూపించిన బాటలో నడవాలి, ఆయన చేసిన త్యాగం తెలంగాణ రాష్ట్రo ఎప్పటికీ మర్చిపోదు అని అన్నారు. -ఎస్. డీ. రాధా కృష్ణ (జర్నలిస్ట్)

తూర్పు గోదావరి

కూటమి ప్రభుత్వం కక్ష సాధించి ఉంటే వైకాపా వారితో సెంట్రల్ జైలు నిండిపోయేది

కూటమి ప్రభుత్వం కక్ష సాధించి ఉంటే వైకాపా వారితో సెంట్రల్ జైలు నిండిపోయేది – నగరంలో దేవాదాయ కమిటీల నియామకం – దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి – అందరూ నాయకులుగా ఎదగాలి – మార్గదర్శి కేసుమాదిరి మాపై కేసు కొట్టేసే అవకాశం – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం: ఆగష్టు 6 పున్నమి ప్రతి nidhi గత వైకాపా ప్రభుత్వం మాదిరిగా తమ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగి ఉంటే గడచిన ఈ ఏడాదిలో రాజమండ్రి సెంట్రల్ జైల్ నిండిపోయి ఉండేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. కానీ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా పాలన సాగిస్తోంది పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో తన విజయానికి కష్టపడి పనిచేసి 73 వేలకు పైగా భారీ మెజారిటీతో గెలిపించిన కూటమి లోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ నాయకులుగా ఎదగాలని, అందరికీ సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనతో నగరంలోని ఆయా దేవస్థానాల కమిటీల్లో వారికి చోటు కల్పించామని వెల్లడించారు. నగరంలో 14 ఎండోమెంట్ కమిటీలు ఉంటే వాటిలో నాలుగు కమిటీలకు ప్రభుత్వ ఆమోదం వచ్చిందని, మరో రెండుమూడు రోజుల్లో మరో నాలుగు కమిటీలకు ఆమోదం రానుందన్నారు. ఈ మేరకు తిలక్ రోడ్డు లోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కమిటీలు వేయడంవల్ల దేవాలయాలు మరింత అభివృద్ధి చెందుతాయని, కమిటీ ఉండడం వల్ల అన్ని విధాలుగా కూడా దాతలు ముందుకొస్తారని పేర్కొన్నారు. నాళం భీమరాజు వీధిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా మద్ది నాగ పూర్ణ వెంకట సత్యనారాయణ, సారంగధరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా కె.వి.డి.ఎస్.వి.చౌదరి, నేషనల్ సీనియర్ బేసిక్ స్కూలు కమిటీ చైర్మన్ గా చింతా జోగి నాయుడు, కోరుకొండ రోడ్డు లోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా ఏడిద వీర వెంకట దుర్గా ప్రసాద్ నియమితులయ్యారని ఆయన చెప్పారు. ఈ నాలుగు దేవస్థానం కమిటీలు రెండు మూడు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తాయని ఆయన చెప్పారు. అలాగే‌ శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం చైర్మన్ గా మదన్ సింగ్ రాజ్ పురోహిత్, శ్రీ శ్యామలాంబ దేవస్థానం చైర్మన్ గా కడియాల వీరభద్రరావు, శ్రీ పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్ గా రెడ్డి మణేశ్వరరావు, జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా దాసరి గురునాధరావు నియమితులయ్యారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. త్వరలో ఈ కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ కమిటీలు భక్తుల నమ్మకం, విశ్వాసం పొందేలా పనిచేయాలని ఆయన సూచించారు. గత వైసీపీ పాలనలో మార్కండేయ స్వామి దేవస్థానంలో క్షమించరాని పాపాలు చేశారని ఆయన ఆరోపించారు. రెండేళ్ల కాలపరిమితితో ఈ కమిటీలు పని చేస్తాయని, మరో రెండేళ్ళకు మళ్ళీ కొత్తవారితో కమిటీలు వేస్తామని ప్రతి కమిటీ లోను పదినుంచి పదకొండు మంది సభ్యులు ఉంటారని తద్వారా నాలుగేళ్లలో సుమారు 280 మందికి అవకాశం కల్పించినట్లవుతుందని ఆయన చెప్పారు. మద్యం స్కాంపై సిట్ తనపని తాను చేసుకు వెళుతోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తప్పు చేయలేదనుకుంటే వైసీపీ వారు న్యాయ పోరాటం చేయవచ్చని, గతంలో చంద్రబాబును అరెస్టు చేస్తే ఆయన తన తప్పు లేదని ఆయన న్యాయపరంగా పోరాటం చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగివుంటే ఈ ఏడాది కాలంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వైసీపీ వారితో నిండి పోయేదని, వారి కోసం మరో జైలు కట్టాల్సి వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ సంఖ్యతతో ఉన్నారని ఆయన అన్నారు. వైసీపీ గ్రౌండ్ స్థాయిలో జీరో అయిపోయిందని, వారి కార్యక్రమం ద్వారా జనంలోకి వెళితే ప్రజలు వారిపై తిరగబడుతున్నారని అందుకే ఆ పార్టీ కార్యక్రమం అర్థాంతరంగా ముగిసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు కోర్టు కొట్టివేసిందని, తమపై నమోదు చేసిన కేసు కూడా అలాంటిదేనని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరిపిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. నెలాఖరు నాటికి 5,500 కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని, త్వరలో 9,600 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. టిడ్కో గృహాలు త్వరలో లబ్దిదారులకు అందచేస్తామని ఆయన చెప్పారు. బూరుగుపూడి ఆవ భూమిలో వైసీపీ నాయకులు భారీ స్కాం చేశారని ఆనాడే అప్పటి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ ‌మార్గాని భరత్ గొడవ పడ్డారని ఆయన గుర్తు చేశారు. దేవీచౌక్, పుష్కర ఘాట్ రాళ్ళు అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, దోషులు తేలాక అక్కడ సిసి రోడ్డు వేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వై శ్రీను, దొండపాటి సత్యంబాబు, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకి రామయ్య, బుడ్డిగ రవి, పి నాగేంద్ర, కంటిపూడి శ్రీనివాస్, కొల్లి బుజ్జి, శెట్టి జగదీష్, మొకమాటి సత్యనారాయణ, అడబాల రామకృష్ణ, దాస్యం ప్రసాద్, ఆడారి లక్ష్మీ నారాయణ, చాపల చినరాజు, అక్కిరెడ్డి ప్రసాద్, భాష లిమ్రా తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం జాతీయ అంతర్జాతీయ తెలంగాణ పెద్దపల్లి

ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నాం

మధిర నియోజకవర్గంలో రెండు పారిశ్రామిక పార్కులకు ఆర్థిక సహాయం అందించండి కేంద్ర మంత్రి జితేంద్ర మాంజిని కలిసి విజ్ఞప్తి చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు న్యూఢిల్లీ, ఆగస్టు 06, పున్నమి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం MSME (మైక్రో, చిన్న మరియు మధ్యతరః పరిశ్రమల) రంగ అభివృద్ధిలో మరో అడుగు ముందుకు వేస్తోంది. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రెండు కొత్త MSME పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కేంద్ర MSME మంత్రి జితన్ రామ్ మాంజీ కి వివరించారు. బుధవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర మంత్రిని డిప్యూటీ సీఎం తో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ మల్లు రవి , కలిసి విజ్ఞప్తి చేసి లేఖను అందించారు. MSME రంగం సమగ్ర ఆర్థిక ప్రగతికి కీలక క్షేత్రంగా మారుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఖమ్మం జిల్లా మధిర మండలంలోని యెండపల్లి, ఎర్రుపాలెం మండలంలోని రె మిడిచర్ల గ్రామాల్లో MSME పార్కులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, వరుసగా 85 ఎకరాలు మరియు 60 ఎకరాల్లో ఈ పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. జాతీయ రహదారి 65 (హైదరాబాద్–విజయవాడ కారిడార్) కు సమీపంలో ఉండటంతో, వీటి భౌగోలిక స్థానం వ్యూహాత్మకంగా ఉందనీ, సమీప పట్టణాలు, రైల్వే నెట్వర్క్‌లు, పోర్టులతో అనుసంధానం ఉందనీ తెలిపారు. ఈ పార్కుల అభివృద్ధి ద్వారా ఆ ప్రాంత యువతకు, ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు చెందిన యువతకు పారిశ్రామిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయనీ తెలిపారు. ఈ పార్కులు వివిధ తయారీ రంగాలకు అనుకూలంగా అభివృద్ధి చేయబడి, కనీసం 5,000 ప్రత్యక్ష మరియు 15,000 పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించగలవనే అంచనాలతో ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. MSME-CDP పథకం కింద ఈ పార్కుల అభివృద్ధికి ఆర్థిక సహాయానికి ప్రాజెక్ట్ ప్రతిపాదనలు పంపించేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో కోరింది.తెలంగాణలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్క్ – రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనMSME-CDP పథకం కింద కేంద్ర నుంచి ఆర్థిక సహాయం ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రికి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం MSME రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికను రూపొందించిందనీ, రాష్ట్రంలోని ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో (మొత్తం 119) చిన్న స్థాయి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలతో కూడిన MSME పార్క్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందనీ, ఈ పార్కులు, చిన్న స్థాయి పారిశ్రామిక సంస్థలు తమ వ్యాపారాలను ప్రారంభించి, నడిపించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని అందించనున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు.ఈ MSME పార్కుల్లో హాస్టళ్లు, కిచెన్లు, టాయిలెట్లు, టెస్టింగ్ సెంటర్లు, ఇతర సాధారణ వసతులు ఉంటాయనీ, వ్యాపార అభివృద్ధి, ఉత్పత్తి ఆవిష్కరణ, మార్కెట్ వ్యూహం వంటి సేవలు అందుబాటులో ఉంటాయనీ, మహిళా ప్రాధాన్యత గల సంస్థలకు ప్రోత్సాహంగా స్ట్రీనిధి పథకం ద్వారా రుణాల మద్దతు కూడా ఇవ్వనున్నామని కేంద్రమంత్రికి వివరించారు. దీని ద్వారా మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు బలోపేతం కావడంతోపాటు, జీవనోపాధి అవకాశాలు విస్తరించనున్నాయనీ,ప్రస్తుతం MSME-CDP పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 25 ప్రాజెక్టులను కేంద్ర MSME మంత్రిత్వ శాఖ సహకారంతో అమలు చేస్తోందనీ, వీటిలో ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు (CFCs) ఉన్నాయి. ఇవి రాష్ట్రంలో MSME వ్యవస్థను బలంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయనీ తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం, కేంద్ర MSME మంత్రిత్వ శాఖ మద్దతుతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా MSME పార్కులను నెలకొల్పడానికి సంబంధిత పథకాల ద్వారా ఆర్థిక సహాయం కోరుతోంది. ఈ ప్రయోజనాత్మక కార్యక్రమాల ద్వారా భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ రాష్ట్రం కీలక భాగస్వామిగా నిలుస్తుందనే నమ్మకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి ఎదుట వ్యక్తం చేశారు.

ఖమ్మం

ప్రెస్ మీట్

కళ్ళుండి చూడలేని కాబోధులారా…. చెవులుండి వినలేని చెవిటివలా… న్యాయ దేవతనే మోసం చేస్తున్న న్యాయ వాదులారా న్యాయం కావాలని కోరుకునే అభాగ్యులకు మీరిచ్చే న్యాయ సలహా ఇదేనా? న్యాయ దేవత పై నమ్మకం పెంచండి. రేవంత్ రెడ్డి గారి పై,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పై విమర్శలు తగవు. కడుపు మండి మా బొచ్చెలో బువ్వ గుంజుకొని తింటున్నారని న్యాయ దేవత ను కోరడం తప్పా? తెగల పై చిచ్చు పెడుతున్నారని నిజాన్ని ఉరి తీయకండి న్యాయ దేవత కళ్ళు తెరిచి చూడనివ్వండి – ఎస్. డీ. రాధా కృష్ణ (జర్నలిస్ట్)

సూర్యాపేట

ట్రాఫిక్ నుంచి విముక్తి

కొత్త బస్టాండ్ నుంచి శంకర్ విలాస్ సెంటర్ వరకు షాప్ బోర్డులను తొలగిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, మున్సిపల్ సిబ్బంది ట్రాఫిక్ నుంచి విముక్తి కల్పిస్తూ తనకంటూ ముద్ర వేసుకుంటున్న ట్రాఫిక్ ఎస్ఐ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న ప్రజలకు, వాహనదారులకు ఉపశమనం కలిగించే విధంగా సూర్యాపేట మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం సమన్వయంతో కలిసి ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలను విముక్తి కలిగిస్తున్నారు. ఈ బోర్డులు తొలగించడం పట్ల పట్టణ ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అలాగే దంతాలపల్లి సూర్యాపేట రోడ్డు మీదుగా సూర్యాపేటకు వచ్చే మార్గంలో విపరీతంగా భారీ వాహనాలు పోలీస్ సిబ్బంది రోడ్డు డైవర్షన్ చేయక పోవడంతో అనవసరంగా వాహనాలు పట్టణంలోకి ప్రవేశించి ట్రాఫిక్ సమస్యను సృష్టిస్తున్నాయి దానివల్ల దుమ్ము, ధూళి తో పాటు ట్రాఫిక్ సమస్యతో సూర్యాపేట పట్టణానికి రోజుకు వేలాదిమంది తమ సొంత పని నిమిత్తం వస్తుంటారు. కాబట్టి భారీ వాహనాలను డైవర్షన్ చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

సంగారెడ్డి

నారాయణఖేడ్ ఆగస్ట్ 06 (పున్నమి ప్రతినిధి): గురుకుల కళాశాలను తనిఖీచేసిన సబ్ కలెక్టర్.

నారాయణఖేడ్ పట్టణ ప్రాంతంలోని గిరిజన గురుకులకళాశాలను నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా భారతి గారుఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగాకళాశాలలోని కిచెన్ రూమ్, స్టాక్ రూమ్, తరగతిగదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతోకలిసి అల్పాహారం లో పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్యాదగిరితో మాట్లాడుతూ.. కళాశాలలోని వసతులనుగురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయ బృందంపాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అన్నదాత సుఖీభవ పథకం కి దరఖాస్తు చేసుకోండి:- తాసిల్దార్

అన్నదాత సుఖీభవ పథకం కి దరఖాస్తు చేసుకోండి:- తాసిల్దార్ సీతారాంపురం మండలం అన్నదాత సుఖీభవ పథకంలో పేరు నమోదయి ఉండి వివిధ కారణాల దృశ్య నగదు జమ కాని రైతులు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తాసిల్దార్ పి.వి. కృష్ణారెడ్డి తెలిపారు.540 మంది రైతులు మరణించినట్లు జాబితా వచ్చిందన్నారు. వారసులు సంబంధిత పత్రాలతో పాటు మరణ ధ్రువీకరణ పత్రం. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్. కుటుంబ బాగా పంపకాల దస్తాలు తీసుకొని సంబంధిత విఆర్ఓలకు అందిస్తే త్వరగా జమ అవుతుంది అని ఆయన పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇస్కాన్ లో చిన్నారులకు పోటీలు

పున్నమి ప్రతినిధి( శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) నెల్లూరులోని ఇస్కాన్ (అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం) మందిరంలో ఆదివారం రోజున త్వరలో జరుపబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను పురస్కరించుకొని వ్యాసరచన, చిత్రలేఖనం, బొమ్మలకు రంగులు వేయడం, భగవద్గీత శ్లోక పఠనం, శ్రీ కృష్ణ గానం మొదలైన విషయాలలో పోటీలు నిర్వహించారు. పాల్గొన్న వారందరికీ ప్రసాదాలు, ప్రమాణ పత్రాలు సమర్పించారు అందించారు. ఈ పోటీలు ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. తమ పిల్లలు సనాతన ధర్మం గురించి తెలుసుకునేలా ప్రోత్సహించినందుకు తల్లిదండ్రులను అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.