Tuesday, 12 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

అపసముద్రం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు…!

ఉదయగిరి,(పున్నమి,న్యూస్,ప్రతినిధి): ఉదయగిరి మండల కేంద్రమైన అప్పసముద్రం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.ఎల్.హెచ్.పి సురేష్ మాట్లాడుతూ,తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని వారు తెలిపారు. బిడ్డకు ఆరు నెలలు వరకు తల్లిపాలు తప్ప ఏ ఇతర ద్రవపదార్థాలు తాగించకూడదని తెలిపారు. బిడ్డ పుట్టిన గంటలోనే తల్లి పసుపు రంగు చీకటి పాలు అమృతం లాంటివని, వీటి ద్వారా బిడ్డకు అతి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని తెలిపారు. తల్లి పాలలో ఉన్న పోషక గుణాలు మరి ఏ ఇతర పాలలో ఉండవని స్పష్టం చేశారు. మరి ముఖ్యంగా తల్లిపాలు శిశువుకు న్యూమోనియా, అదే సార వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో, హెల్త్ అసిస్టెంట్ ఎండీ మన్సూర్ అలీ,ఏఎన్ఎం సౌజన్య, ఆశ వర్కర్ విస్తారమ్మ, అంగన్వాడి టీచర్ దుర్గాభవాని, సుభాషిని, రజిత, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అప్పసముద్రం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా తల్లిపాలు వారోత్సవాలు

ఉదయగిరి,(పున్నమి,న్యూస్,ప్రతినిధి): ఉదయగిరి మండల కేంద్రమైన అప్పసముద్రం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.ఎల్.హెచ్.పి సురేష్ మాట్లాడుతూ,తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని వారు తెలిపారు. బిడ్డకు ఆరు నెలలు వరకు తల్లిపాలు తప్ప ఏ ఇతర ద్రవపదార్థాలు తాగించకూడదని తెలిపారు. బిడ్డ పుట్టిన గంటలోనే తల్లి పసుపు రంగు చీకటి పాలు అమృతం లాంటివని, వీటి ద్వారా బిడ్డకు అతి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని తెలిపారు. తల్లి పాలలో ఉన్న పోషక గుణాలు మరి ఏ ఇతర పాలలో ఉండవని స్పష్టం చేశారు. మరి ముఖ్యంగా తల్లిపాలు శిశువుకు న్యూమోనియా, అదే సార వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో, హెల్త్ అసిస్టెంట్ ఎండీ మన్సూర్ అలీ,ఏఎన్ఎం సౌజన్య, ఆశ వర్కర్ విస్తారమ్మ, అంగన్వాడి టీచర్ దుర్గాభవాని, సుభాషిని, రజిత, తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

బిసి రిజర్వేషన్ ముసుగు లో మత రిజర్వేషన్ లు బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు విమర్శ

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) తెలంగాణ లో అధికార కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ ముసుగులో మత పరమైన రిజర్వేషన్ లని ప్రవేశ పెట్టేందుకు కుట్ర చేస్తుంది అని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు విమర్శించారు. బుధవారం ఖమ్మం జిల్లా బిజెపి కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశం లో నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ బిసి లకి 42% రిజర్వేషన్ కల్పిస్తాం అని చెప్పి అందులో 10% ముస్లిం లకి వాటా ఇస్తుంది అని ఆరోపించారూ. అందువల్ల బిసి లకి అన్యాయం జరుగుతుంది అని అన్నారు. ఈ సమావేశం లో బిజెపి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కన్వీనర్ ఈ వి రమేష్, కిసాన్ మోర్చా నాయకులు టి రవీందర్, మహిళా మోర్చా నాయకురాలు శ్రీమతి పమ్మి అనిత, యువమోర్చా నాయకులు ప్రవీణ్, ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, జిల్లా నాయకులు కుమిలి శ్రీనివాస్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ యుగంధర్ నాయుడు, టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్ర గాని మాధవ్ తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

మానూర్ ఆగస్ట్ 07(పున్నమి ప్రతినిధి): మూగజీవి ప్రాణం తీసిన విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.

సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం రాయిపల్లి గ్రామంలోవిద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల దాదాపు లక్ష రూపాయలువిలువైన ఎద్దు బుధవారం మృతి చెందింది. ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ కంచె లేకపోవడం, విద్యుత్ తీగలు భూమి కి అనుకోని ఉండటం తో గడ్డి మేయడానికి వెళ్ళిన ఎద్దు కి ఒక్కరిగా షాక్ తగిలి మంటలు అంటుకున్నాయి అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉన్నతఅధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులుకోరుతున్నారు.

E-పేపర్

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే టీ తాగుతూ చర్చించుకుందాం- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రప్ప

ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ నూతనంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం పాణ్యం మండలంలో నీటి పారుదల శాఖ కార్యాలయంలో రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత పాలకులు ఉద్యోగుల బకాయిలు పరిష్కరించాలని సమస్యల తోరణం తో ధర్నాలకు వెళితే ఉద్యోగులను దేశద్రోహులుగా భావించి మన రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్ సూర్యనారాయణని అరెస్టు చేసే ప్రయత్నం చేశారన్నారు. అయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయని ప్రభుత్వాలు మనకెందుకని మనం నూతనంగా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైబడిన ఇంకా ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తున్నది అన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు సుమారు 35 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉందని ఈ మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో అర్థం కావడం లేదన్నారు. అందుకని జిల్లా కేంద్రాలు, పరిసర మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాల రూపంలో ఉద్యోగులకు ఇచ్చి వారికి ఇవ్వాల్సిన బకాయిలను జమ చేసుకోవడం వలన ఇటు ఇల్లు నిర్మించుకోవాలన్న ఉద్యోగుల కల అటు ప్రభుత్వ బకాయిలు రెండు నెరవేరుతుందని రాష్ట్ర అధ్యక్షులు అభిప్రాయమని నాగేంద్రప్ప పేర్కొన్నారు. దీంతోపాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక సంఘం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమే అన్నారు. రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమంలో కూడా ఏదైనా ఉద్యోగ సమస్యలు ఉంటే తమ సంఘం దృష్టికి తీసుకువస్తే సత్వరం జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కారం కి కృషి చేస్తానని జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉద్యోగులు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు

అన్నమయ్య

కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీని సందర్శించిన యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి

రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) గ్రామానికి తాగునీటి కొరత నివృత్తి చేసేందుకు త్వరలోనే బోర్ వేయిస్తానని హామీ ఇచ్చిన ముక్కా సాయి వికాస్ రెడ్డి ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తున్న ప్రజల నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీ పరిధిలో పర్యటించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డిగ్రామస్థులతోమాట్లాడివారిసమస్యలుఅడిగితెలుసుకున్నారు.గ్రామ ప్రజలు ప్రధానంగా తాగునీటి సమస్య, నూతన స్కూల్ కొరకు, సిమెంట్ రోడ్, కరెంట్ సప్లై, వాటర్ పైప్ లైన్ తదితర అవసరాలను పేర్కొన్నారు. వెంటనే స్పందించిన సాయి వికాస్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి, వేగంగా పనులు ప్రారంభించాల్సిందిగా పేర్కొన్నారు. అలాగే, గ్రామానికి తాగునీటి కొరత నివృత్తి చేసేందుకు త్వరలోనే బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు ఆయన పర్యటనకు సంతోషం వ్యక్తం చేస్తూ తమ ఆశలు నెరవేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చేజర్ల మండలంలో పాఠశాలల తనిఖీ

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలంలోని వివిధ పాఠశాలల్లో మనబడి మన భవిష్యత్తు ఫేజ్ 2 లో తూర్పుపల్లి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న తరగతిగదుల నిర్మాణాలతో పాటు , మాముడూరు చేజర్ల , ఆదూరుపల్లి ఉన్నత పాఠశాలలను సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటసుబ్బయ్య, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుధీర్ బాబు బుధవారం తనిఖీ చేశారు. ఫేస్ టు కింద జరుగుతున్న పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. శిథిల స్థితిలో ఉన్న ఏటూరు ఎస్సీ పాఠశాల తరగతిగదిని పరిశీలించి నూతన తరగతి గదిని మంజూరు చేయడం జరుగుతుందని ఎ పి సి వెంకటసుబ్బయ్య తెలియజేశారు. ఈ సంవత్సరం ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయిన నూతక్కి వారి కండ్రిక పాఠశాలను సందర్శించి అదనపు తరగతి గదులకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. వీరి వెంట మండల ద్వితీయ విద్యాశాఖ అధికారి డిసి మస్తానయ్య పాల్గొన్నారు.

తిరుపతి

అద్దె బకాయిలను సకాలంలో చెల్లించండి

సకాలంలో మున్సిపల్ దుకాణల అద్దె బకాయిలు చెల్లించాలి -మున్సిపల్ మేనేజర్ ఉరుకుందమ్మ ఆగష్టు 6పున్నమి ప్రతినిధి దొరవారి సత్రం నాయుడుపేట పట్టణంలోని మున్సిపల్ దుకాణల అద్దె బకాయిలను తక్షణమే చెల్లించాలని మున్సిపల్ మేనేజర్ ఎం. ఉరుకుందమ్మ కోరారు. బుధవారం కమీషనర్ ఫజులుల్లా ఆదేశాల మేరకు పట్టణంలోని బకాయి ఉన్న మున్సిపల్ దుకాణాలను ఆమె సందర్శించారు.ఈ సందర్భంగా ఆమె దుకాణ లీజుదారులతో బకాయిల చెల్లింపుపై చర్చించారు. ఒక నెల బకాయి ఉంటే తాము ఒత్తిడి తీసుకురామని,నెలల పాటు అద్దె పెండింగ్ ఉంటే ఏలా అని ప్రశ్నించారు.వారం లోపు బకాయి ఉన్న అద్దెలు చెల్లించాలని, లేనిపక్షంలో దుకాణలకు తాళాలు వేస్తామని ఆమె హెచ్చరించారు. మేనేజర్ వెంట బిల్ కలెక్టర్లు గాయిత్రి, ప్రసాద్,శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

రాచపల్లి లో జోరుగా కూటమి నాయకుల ప్రచారం,,

ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి ముద్దు కృష్ణా రెడ్డి తరుపున నాయకుల ప్రచారం హోరెత్తుతోంది.బుధవారం రాచ గుడిపల్లి గ్రామ పంచాయతీ రాచపల్లి గ్రామంలో పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో జనసేన పార్లమెంట్ నాయకులు యల్లటూరి శ్రీనివాసరాజు మరియు కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందిస్తున్న పథకాలు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే తెలుగుదేశం అభ్యర్థి గెలుపుతో ఒంటిమిట్ట అభివృద్ధికి ముందడుగు పడుతుందని, ఒక గెలుపు మండల రూపురేఖలే మార్చే అభివృద్ధికి మలుపు అవుతుందని వారు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు, రాజంపేట నియోజకవర్గ ఆరు మండలాల టిడిపి అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు, బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగినది.*

తిరుపతి

రోసనూరు లో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కుంభాభిషేకం

పెళ్లకూరు మండలంలోని రోశనూరు దళితవాడలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అంగ,రంగ వైభవంగా కుంబాభిషేకం మహోత్సవం నిర్వహించారు. కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీ, పార్థసారథి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా రోసనూరు టిడిపి నేత దొమ్మరాజు సత్యంరాజు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీ,పార్థసారథి దంపతులకు శాలువాలు కప్పి,సన్మానించి,పట్టు వస్త్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.