ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి ముద్దు కృష్ణా రెడ్డి తరుపున నాయకుల ప్రచారం హోరెత్తుతోంది.బుధవారం రాచ గుడిపల్లి గ్రామ పంచాయతీ రాచపల్లి గ్రామంలో పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో జనసేన పార్లమెంట్ నాయకులు యల్లటూరి శ్రీనివాసరాజు మరియు కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందిస్తున్న పథకాలు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే తెలుగుదేశం అభ్యర్థి గెలుపుతో ఒంటిమిట్ట అభివృద్ధికి ముందడుగు పడుతుందని, ఒక గెలుపు మండల రూపురేఖలే మార్చే అభివృద్ధికి మలుపు అవుతుందని వారు ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు, రాజంపేట నియోజకవర్గ ఆరు మండలాల టిడిపి అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు, బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగినది.*


