Tuesday, 12 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఏపీలో మద్యం పాలసీ.. తగ్గనున్న ధరలు

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూటమి ప్రభుత్వం కొత్త బార్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కొత్త పాలసీ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ పాలసీ ద్వారా మద్యం ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే కల్లుగీత కార్మికులకు కూడా మద్యం పాలసీ ద్వారా 10 శాతం వాటా ఉంటుందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

అన్నమయ్య

సౌథర్న్ స్పైస్ అరబిక్ మండి రెస్టారెంట్” నూతన ప్రారంభోత్సవం … ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల

రాజంపేట పట్టణంలోని బైపాస్ రోడ్డు నందు అరవింద్ ఐ హాస్పిటల్ పక్కన “సౌథర్న్ స్పైస్ అరబిక్ మండి రెస్టారెంట్” ప్రారంభోత్సవానికి నాగినేని దివాకర్ నాయుడు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్ ప్రారంభించి షాప్ యజమాని గండ్రా శ్రీహరి నాయుడు కి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి మీ రెస్టారెంట్ కస్టమర్ల మన్నలను పొంది దిన దినాభివృద్ధి చెందాలని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాలచంగల్ రాయుడు.రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బత్యాల చంగల్ రాయుడు ని హోటల్ యాజమాన్యం ముందుగా బానసంచా పేలుస్తూ, పూలు చల్లుతూ శాలువా కప్పి పూల బొక్కేను అందజేసి ఘన స్వాగతం పలికారు……….., ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

అనుమతి లేని ఎరువులు పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవు

చిట్వేల్ లోని ఎరువుల మరియు పురుగు మందుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి, చిట్వేల్ జి. సుధాకర్ ఇన్స్పెక్షన్ చేసి రిజిస్టర్లు, రికార్డ్స్, స్టాక్స్ ను పరిశీలించడం జరిగింది. ప్రతి ఒక్కరూ రిజిస్టర్, బిల్ బుక్స్ సక్రమంగా మైంటైన్ చేయాలని, ఎవరు ఎం.ఆర్.పి ధరకి మించి అమ్మినా, అనుమతి లేని ఏరువులు, పురుగు మందులు అమ్మిన, కఠిన చర్యలు ఉంటాయని హేచ్చరించారు. శ్రీ లక్ష్మి శ్రీనివాస పరస్పర సంఘము ఎరువుల దుకాణం నందు గ్రీన్ స్టార్ కంపెనీ కి సంబంధించి డి. ఏ. పిస్టాక్ ను రిజిస్టర్ లో అప్డేట్ చేయనందుకు, తదుపరి సరిచేసే వరకు 26.95 మెట్రిక్ టన్నులు, విలువ Rs. 7,27,650/- అమ్మకం నిలుపుదల చేయడం జరిగింది.

అన్నమయ్య

ఒంటిమిట్ట జడ్పిటిసి ఎన్నికల ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న చైర్మన్ కె కె చౌదరి

రాజంపేట నియోజకవర్గం, ఒంటిమిట్ట మండల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్త మాధవరంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి కూటమి ప్రభుత్వానికి అడుగడుగున మద్దతు వ్యక్తం చేస్తున్న ప్రజలు.అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాది మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రైతులకు అందుబాటులో లేని చిట్వేలి కరెంట్ ఏఈ ను అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు వెంటనే సస్పెండ్ చేయాలి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ

చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం కరెంటు సబ్ స్టేషన్ దగ్గర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపుమేరకు నిరసన కార్యక్రమం చేసి కరెంటు ఏఈ గారి కుర్చీకు వినత పత్రం అందజేయడం జరిగినది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య. రైల్వే కోడూరు నియోజకవర్గం కౌన్సిల్ సభ్యులు తిప్పన ప్రసాద్ మాట్లాడుతూ చిట్వేలి మండల పరిధిలో 21 పంచాయతీల్లో దళిత రైతులు. సన్నకారి రైతులు. ధనుక రైతులు దాదాపు రైతులు వేలమంది ఉన్నారు ఈ రైతులు పొలాల్లో సమస్యలు వచ్చినప్పుడు వెంటనే చిట్వేలి కరెంట్ ఏఈ గారు దృష్టికి తీసుకురావాలని ఎన్నో ఆశలతో సబ్ స్టేషన్ దగ్గరికిఏఈ గారి కోసం వస్తే అక్కడ ఏఈ గారు ఉండరు మరియు సిబ్బంది కూడా ఉండరు అది చూసి రైతులు మరల తిరిగి ఇంటికి రాక తప్పదని అన్నారు దళిత రైతులు సర్వీసులను ఒక్కరి సర్వీసులు మరొకరికి కాసులకు కక్కుర్తి పడి మార్చుకుంటూరైతులను ఇబ్బంది పెడుతూ ఉన్నారని అన్నారు ఇప్పటికే దాదాపు మండల పరిధిలో ఉన్న రైతులు అందరూ కూడా ఏఈ గారిని వ్యతిరేకిస్తూ వారిపై కారాల మిరియాలు నూరుతున్నారని అన్నారు ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గామేము రాష్ట్ర పిలుపు మేరకు సబ్స్టేషన్ దగ్గరికి పోయి ఏ ఈ గారికి వినత పత్రం అందజేయాలని పోయినప్పటికీ అక్కడ ఏ ఈ గారు. వారు సిబ్బంది లేనప్పటికీ మేము ఏ ఈ గారికి ఫోన్ చేసినప్పటికీ ఆయన నిర్లక్ష్యం వలన ఫోన్ తీనందువలన అక్కడ ఆయన కుర్చీకు వినత పత్రం అందజేసి ఆ కుర్చీలు రైతులకు న్యాయం చేయవలసిందిగా అని అడగడం జరిగిందని అన్నారు . ఇప్పటికైనా ఏఈ గారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా మేము ఒకటే చెబుతున్నాం మీరు రైతులను కాసుల కోసం వాళ్ల రక్తాన్ని పిర్చి పిప్పు చేయకుండా రైతులను గమనించి ఆఫీసుకు ప్రతిరోజు వస్తూ వారు సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన మండల పరిధిలో ఉన్నటువంటి రైతులను కలుపుకొని ఈ నెల లాస్ట్ లో అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ గారికి చిట్వేల్ మండలంలో ఏఈ గారు చేసిన అవకతవకలు గురించి వారన్నారు వివరించడం జరుగుతున్నదని అన్నారు 2.రాష్ట్ర పిలుపు మేరకుస్మార్ట్‌ మీటర్లు బిగించొద్దు,చార్జీల భారం రద్దు చేయాలి,నూతన బాదుడు 12,771 , రద్దు చేయాలి భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్అదాని స్మార్ట్‌ మీ టర్లు వద్దు-ట్రూఅప్‌ చార్జీలు ర ద్దు అనే, నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.స్మార్ట్ మీటర్లను బిగించ వద్దు,  బిగించిన వాటిని తొలగిం చి, పాతవాటిని  బిగించాలన్నారు.  విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, గత ప్రభుత్వంలో, ప్రతిపక్ష నేతగా, స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, టిడిపి మేము అండగా ఉంటామని, పిలుపునిచ్చి, నేడు అదే ప్రభుత్వం, స్మార్ట్ మీటర్లు, ఎందుకు బిగిస్తుందని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లను, గత ప్రభుత్వం  ఆదాని, షిరిడి ఎలక్ట్రికల్  కంపెనీతో ఒప్పందాన్ని,  అదే కాంట్రాక్టర్ తో, కమిషన్లకు  కుక్కుర్తి పడి ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం అధిక రేటు పెట్టి, విద్యుత్తు కొనుగోలను, ఎందుకు సమీక్షించలేదని ప్రశ్నించారు, విద్యుత్ సుంకా న్ని  తగ్గించాలన్నారు. 2024-25 సం. లో అదనం గా వసూలు చేసిన 2,787 కొట్ల ను  వినియోగదారులకు, తక్షణం తిరిగి  చెల్లించాలన్నారు.  గత ప్రభుత్వం 2024 వరకు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 15000 కోట్లు, వసూలు చేశారని, తిరిగి,అదనం గా వేయాలని ప్రతిపాధనలో వున్న 12,771 కొట్ల  భారాన్ని,  విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రైతు సంఘం నాయకులు కటారి శంకరయ్య. సిపిఐ నాయకులు శ్రీను. శేఖర్. శంకరయ్య. తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే రండి… టీ తాగుతూ మాట్లాడుకుందాం- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రప్ప

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ నూతనంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమం ఈనెల 5వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైనది అని, 3వ రోజు స్థానిక గ్రామీణ నీటి పారుదల శాఖ కార్యాలయ ఆవరణలో రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత పాలకులు ఉద్యోగుల బకాయిలు పరిష్కరించాలని సమస్యల తోరణం తో ధర్నాలకు వెళితే ఉద్యోగులను దేశ ద్రోహుల భావించి మన రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్ సూర్యనారాయణ గారిని అరెస్టు చేసే ప్రయత్నం చేశారన్నారు. అయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయని ప్రభుత్వాలు మనకెందుకని మనం నూతనంగా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైబడిన ఇంకా ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తున్నది అన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు సుమారు 35 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉందని ఈ మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో అర్థం కావడం లేదన్నారు. అందుకని జిల్లా కేంద్రాలు, పరిసర మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాల రూపంలో ఉద్యోగులకు ఇచ్చి వారికి ఇవ్వాల్సిన బకాయిలను జమ చేసుకోవడం వలన ఇటు ఇల్లు నిర్మించుకోవాలన్న ఉద్యోగుల కల అటు ప్రభుత్వ బకాయిలు రెండు నెరవేరుతుందని రాష్ట్ర అధ్యక్షులు అభిప్రాయమని నాగేంద్రప్ప పేర్కొన్నారు. దీంతోపాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక సంఘం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమే అన్నారు. రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమంలో కూడా ఏదైనా ఉద్యోగ సమస్యలు ఉంటే తమ సంఘం దృష్టికి తీసుకువస్తే సత్వరం జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కారం కి కృషి చేస్తానని జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకంతో తాము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశంతోనే సానుకూలంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమం ద్వారా ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నామని ఆయన అన్నారు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని వారు వారి పిల్లలకు వివాహాధి కార్యక్రమాలు చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాలను ప్రభుత్వం గుర్తించి సత్వరం ఉద్యోగుల బకాయిల చెల్లింపుకు మార్గాన్ని ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, సిటీ అధ్యక్షులు సత్యం, ఉపాధ్యక్షులు యేసురత్నం, ప్రభావతి, పూర్ణాచారి, గాయత్రి, ఉద్యోగులు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ ఇవ్వాలి. ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంగు మన్మధరావు

శ్రీకాకుళం : ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అధ్యాపకులకు కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ అధ్యాపక అవార్డులను ఇవ్వాలని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంగు మన్మధరావు కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ లో అక్షరాస్యతలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ పాత్ర కీలకమన్నారు. గవర్నమెంట్ స్టూడెంట్స్ కన్నా.. గవర్నమెంట్ టీచర్స్, లెక్చరర్స్ కన్నా.. ప్రైవేట్ స్టూడెంట్స్.. ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అధికమన్నారు. తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక అవార్డుల ఎంపికలో ప్రైవేటు ఉపాధ్యాయులను, అధ్యాపకులను కూడా చేర్చాలని కోరారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల అధ్యాపకులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకుల సమిష్టి కృషితోనే విద్యావ్యవస్థలో సమూల మార్పులు వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖా మంత్రి, విద్యా శాఖ కమీషనర్, అన్ని స్థాయిల విద్యా శాఖాధికారులు జోక్యం చేసు కుని ప్రైవేట్ ఉపాధ్యాయుల అధ్యాపకుల కృషిని గుర్తించి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉత్తమ అవార్డులు ఇవ్వాలని కోరారు.ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉపాధ్యాయ సేవలకుగానూ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మాత్రమే అని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. అటెండర్ స్థాయి ఉద్యోగి పిల్లల నుండి అఖిల భారత సర్వీసెస్ లో పనిచేసే వారి పిల్లల వరకు విద్యాబుద్ధులు నేర్పి నీట్, ఐఐటి జెఈఈ మైన్స్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలలో పదవ, ఇంటర్మీడియట్ వంటి పరీక్షలలో ఉత్తమ ర్యాంకులకు కారకులు ప్రయివేట్ టీచర్స్, లెక్చర్స్ కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ శ్రమను గుర్తించాలని కోరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక అవార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు జిల్లా అధ్యక్షులు నాగశివ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

వర్షాలు కురవాలని ముస్లిం సోదరుల ప్రత్యేక నమాజు

వర్షాలు కురవాలని ముస్లిం సోదరుల ప్రత్యేక నమాజు మంథని, ఆగస్టు 07, పున్నమి ప్రతినిధి; పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ముస్లిం మైనారిటీ సోదరులు గురువారం పట్టణ పరిధిలోని గోదావరి తీరంలో ప్రత్యేక నమాజు నిర్వహించారు. సంవృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు, ప్రజలకు అల్లా దయ, కృపా కటాక్షాలు ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని సాలెహా మజీద్ కు చెందిన ఇమాంసాబ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. అనంత కరుణామయుడు అల్లా దయతో ప్రకృతి కటాక్షించి సంవృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక నమాజులు చేస్తున్నట్లు తెలిపారు. ఇలా వరుసగా మూడు రోజులు నమాజులు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రతిరోజు చేసే నమాజుకు ఈ ప్రార్థనలు ప్రత్యేకమని వివరించారు. ఇదే క్రమంలో ముస్లిం పెద్దలు సర్దార్ ఖాన్, మక్బూల్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వానాకాలం వచ్చి దాదాపు రెండు నెలలు దాటినా ఇంతవరకు పరిసర ప్రాంతాల్లో సరైన వానలు లేక ప్రజలు అల్లాడుతున్నారని, వర్షాలు లేకుంటే రైతులకు సరైన పంటలు పండక అవస్థలు పడుతున్నారని, అల్లా దయతో వర్షాలు కురిసి, పంటలు పండితే ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. మంథని పట్టణంలోని సాలెహా మజీద్ కమిటీ అధ్యక్షుడు యాకూబ్, ఆఫిజ్, ఎండీ లతీఫ్, మజీద్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అలీం ఖాన్, చాంద్, అక్బర్, శంశీర్, షాహిద్, ఐసన్, నిజాం, అంజద్, అజీమ్, హైమద్, బాబా, మోహిన్, పట్టణ ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమము*

శ్రీ కాళహస్తి,ఆగస్ట్(పున్నమి ప్రతినిధి): డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 56 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమమును పవన్ కళ్యాణ్ ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తొట్టంబేడు మండలం ఉపాధ్యక్షులు తేజ ,గంధం శ్రీను, మనీ,నవీన్, ముని చంద్ర, చందు, సాయి, రాజా,ముని కుమార్ , సుబ్రహ్మణ్యం, కత్తిమని వీర మహిళల బత్తెమ్మ, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

అధిక లోడ్ ట్రిప్పర్లతో ఆలాత్తూరు రోడ్డు ధ్వంసం అడ్డుకున్న గ్రామస్థులు

తిరుపతి జిల్లా పున్నమిప్రతినిధి తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం లోని ఆలతురు రోడ్డు ట్రిప్పర్ లు అధిక లోడ్ తో వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనేది ఓపెన్ సీక్రెట్ గా మారిపోయింది. అధిక లోడ్ లతో ప్రయాణిస్తున్న లారీల వల్ల రోడ్డు గుంతలమయం అయిపోయింది. దీనివలన ఆ రోడ్డు మీద వచ్చే ప్రణీకులు తమ వాహనాలు అదుపు తప్పి ప్రమాదాల బారినపడి పలువురు అమాయకుల సైతం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట పడ్డ సందర్భలు ఉన్నాయి ఈ వాహనాల వల్ల నిర్ణయించిన కాలానికి ముందే రోడ్లపై కంకర తేలి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఇక వర్షా కాలంలో వీటి కారణంగా ఏర్పడే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అధిక బరువు వల్ల రోడ్ల నాణ్యత సైతం పూర్తిగా దెబ్బతింటుంది.ఈ వాహనాలు అధిక లోడ్ తో ప్రయానిచుతూ దుమ్ము, దూళి ను లేపడం తో ద్విచక్ర వాహన దారుల బాధలు వర్ణనాతీతం గా వున్నాయి.అంతే కాక అత్యవసర పరిస్థితి లో కనీసం అంబులెన్సు కూడా రావడానికి వీలుగా లేక పోవడం తో పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక ఈ విషయం గురించి ఈరోజు అలాత్తూరు, మరియు రెడ్డిగుంట బాడవ కు సంబందించిన గ్రామస్థులు రోడ్డు మీద బైటాయించి అధిక లోడ్ తో ప్రయానిస్తున్న వాహనాలని ఆపివేయడం జరిగింది. ఆలత్తూర్ వేణుగోపాల్ రెడ్డి, యనమల ప్రసాద్ పాల్, చిన్నకృష్ణ, లక్ష్మీ నారాయణ, చెంచమ్మ,సుదీర్రెడ్డి పాల్గొన్నారు..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.