Tuesday, 12 May 2026

Blog

యాదాద్రి భువనగిరి

ఘనంగా కుంభం కీర్తి రెడ్డి జన్మదిన వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లాఆగస్టు పున్నమి (ప్రతినిధి) ఈరోజు బోనగిరి పట్టణంలో స్థానిక ఏకే ప్యాలెస్ లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మరియు భువనగిరి శాసనసభ్యులు కుమార్తె కుంభం కీర్తి రెడ్డి గారి జన్మదిన వేడుకలు వస్తువుల సాయికిరణ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా వారి జన్మదిన వేడుకల గుర్తుగా ఉప్పుతో తయారు చేసిన బొమ్మ ను బహుకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కాపాడుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రంథాలను సంస్థ చైర్మన్ అవైస్ చిస్తీ గారు. ఎండి మజార్ పిట్టల బాలరాజ్ యాదగిరి గంగ శీను ఇరపాక నరసింహ చారి….

తిరుపతి

ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్లు ఎంపిక

ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్లు ఎంపిక శ్రీ కాళహస్తి,ఆగస్టు(పున్నమి ప్రతినిధి): శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల గ్రౌండ్ ఆవరణమునందు ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ మరియు సీనియర్స్ జిల్లా జట్లను ఎంపిక చేయడం జరిగింది.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కోలా విశాలాక్షి మరియు గుడ్లూరు మయూరి మరియు టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి, కొట్టె సాయి మరియు గరికపాటి చంద్ర పాల్గొన్నారు ఈ పోటీలలో సుమారుగా 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారని వారిలో జిల్లా జట్లు ఎంపిక జరిగిందని మరియు ఈ కార్యక్రమమునకు చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిహెచ్ వెంకటస్వామి మరియు అసోసియేషన్ సభ్యులు మరియు సీనియర్ క్రీడాకారుడు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారని చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పి బాలాజీ తెలియజేశారు.

యాదాద్రి భువనగిరి

డాక్టర్” ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఘనల్ నివాళులర్పించిన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు పున్నమి (ప్రతినిధి) ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ప్రధాన కార్యదర్శి స్వర్ణకార సంఘం జిల్లా కోశాధికారి తంగళ్ళపల్లి గిరిధరాచారి ఆధ్వర్యంలో సహృదయ అనాధాశ్రమంలో ఏర్పాటు చేసిన పండ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరకొండ నరసింహ చారి మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు అధికారికంగా జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ గారి తో పాటు జిల్లా అధికారులతో పాటు ప్రతి ప్రభుత్వ సిబ్బందికి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సహృదయ అనాలాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన తంగళ్ళపల్లి గిరిధరాచారి జాతీయ యాదాద్రి జిల్లా MRPS నాయకులు కొంగరి మహేష్ గార్లు భువనగిరి పట్టణ కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కుంచం రాజు గార్లు జిల్లా మాల మహానాడు కార్యదర్శి పడిగేమ్ శ్రీనివాస్ గార్లు ఎర్రోజు నరేష్ కందుకూరు శ్రీనివాస్లకు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సహృదయ ఆశ్రమం కొనసాగించడం చాలా విశేషం త్వరలోనే ఈ ఆశ్రమానికి గౌరవ విప్పు ఐలయ్య బోనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ ఆశ్రమానికి తీసుకువస్తామని జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తామని

E-పేపర్

Impact ద్వారా ఉచిత శిక్షణ

Impact foundation వివిధ పాఠశాలలు మరియు కళాశాలలలో వివిధ అంశాలపై ఉచిత సెషన్లను నిర్వహించారు.సమాజ శ్రేయస్సు మరియు అభివృద్ధికి ఈ ఫౌండేషన్ కాలానుగుణంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ సెషన్లకు హాజరు కావడం వల్ల విద్యార్థులు ఎక్కువ ప్రయోజనం పొందుతారు మరియు సమాజంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న జ్ఞానం మరియు ధోరణులతో పరిచయం పొందుతారు. Impact foundation అలాగే ఎప్పటికప్పుడు వివిధ శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా నిర్వహిస్తుంది, రాబోయే సెషన్‌లో AIతో TTWS (train the trainer workshop)కోసం ఒక సెషన్ జరుగుతుంది.ఈ సెషన్‌లో పాల్గొనడానికి మీరు 80747 24226 నంబర్‌ను సంప్రదించవచ్చు.

E-పేపర్

Impact ద్వారా ఉచిత శిక్షణ

Impact foundation వివిధ పాఠశాలలు మరియు కళాశాలలలో వివిధ అంశాలపై ఉచిత సెషన్లను నిర్వహించారు.సమాజ శ్రేయస్సు మరియు అభివృద్ధికి ఈ ఫౌండేషన్ కాలానుగుణంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ సెషన్లకు హాజరు కావడం వల్ల విద్యార్థులు ఎక్కువ ప్రయోజనం పొందుతారు మరియు సమాజంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న జ్ఞానం మరియు ధోరణులతో పరిచయం పొందుతారు. Impact foundation అలాగే ఎప్పటికప్పుడు వివిధ శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా నిర్వహిస్తుంది, రాబోయే సెషన్‌లో AIతో TTWS (train the trainer workshop)కోసం ఒక సెషన్ జరుగుతుంది.ఈ సెషన్‌లో పాల్గొనడానికి మీరు 80747 24226 నంబర్‌ను సంప్రదించవచ్చు.

తెలంగాణ

నకిరేకల్ మినిస్టేడియం నీటిలో మునక?

నకిరేకల్ ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) : ఆగష్టు మొదటి వారంలో కురిసిన వర్షానికి నల్గొండ జిల్లా నకిరేకల్ లోని మినిస్టేడియం గత మూడురోజుల నుండి నీటిలో మునిగి ఉన్నది. ఆనీటిని మళ్లీంచకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలేదని ప్రతిరోజూ వచ్చే వాకర్స్ మండిపడుతున్నారు. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి తగిన స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు. నీరు నిలువ ఉండడంవల్ల దోమలకి ఆవాసంగా ఉండి, డెంగ్యూ, మలేరియా, వంటి రోగాలు రావడానికి అవకాశం ఉన్నది.కావున మినిస్టేడియంలోని నీటిని బైటకు వెళ్లే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పి 4 సర్వే పై తనిఖీ చేయడమైనది

పి 4 సర్వే పై తనిఖీ చేయడమైనది : ఈరోజు సీతారామపురం మండలం అయ్యవారిపల్లి సచివాలయమును గౌరవ ఎంపీడీవో ప్రసాద్ సార్ గారు పి4 సర్వే మండలంలో అతి తక్కువగా 106 కి రెండు మాత్రమే చేసి ఉన్నందున తగు సూచనలు జారీచేసి వెంటనే సర్వే పూర్తి చేయవలసిందిగా తెలియజేయడం అయినది లేనడల క్రమశిక్షణ చర్యలు తీసుకున్న బడుతాయని ఆదేశించడం అయినది

తిరుపతి

ఎంపి గురుమూర్తి కృషితో బిఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటు కు గ్రీన్ సిగ్నల్

జులై 6 పున్నమి ప్రతినిధి దొరవారిసత్రం తిరుపతి పార్లమెంటు పరిధిలోని గూడూరు నియోజకవర్గం పూడిరాయదొరువు, సూళ్ళురుపేట నియోజకవర్గం ఇరకం దీవిలో ఎట్టకేలకు బిఎస్ఎన్ఎల్ 4జి టవర్ల ఏర్పాటుకు అడ్డంకులు తొలగాయి. తీర ప్రాంత గ్రామాలైన పూడిరాయదొరువు, ఇరకం దీవిలో సెల్ ఫోన్ సిగ్నల్ సరిగా లేక తుఫాను వంటి అత్యవసర సమయాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలని అక్కడ పర్యటించిన సమయంలో స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ గురుమూర్తి బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా సరిహద్దు, మారుమూల గ్రామాల్లో 4జి టవర్లను ఏర్పాటు చేస్తున్న నేపధ్యంలో, పూడిరాయదొరువు, ఇరకం దీవి గ్రామాలను కూడా ఆ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేయాలని కోరడం జరిగింది. టవర్ల ఏర్పాటుకు బిఎస్ఎన్ఎల్ అంగీకారం తెలిపినా ఈ రెండు ప్రాంతాలు ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉండటంతో, అటవీ శాఖ అనుమతులు అవసరమయ్యాయి. ఇది టవర్ల ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగా మారింది. తదుపరి తిరుపతి ఎంపి కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అటవీ శాఖ అనుమతులు, పూడిరాయదొరువు టవర్ కోసం విద్యుత్ కనెక్షన్ ఏర్పాటులో సమస్యలని బిఎస్ఎన్ఎల్ అధికారులు ఎంపీకి వివరించారు. స్పందించిన ఎంపి గురుమూర్తి విద్యుత్ కనెక్షన్ ఏర్పాటుకు సదరు శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. అటవీ శాఖ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ కి లేఖ రాశారు. కాగా శాఖా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపి గురుమూర్తి తెలిపారు. టవర్ల నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో త్వరలోనే ఈ గ్రామాలకు నాణ్యమైన మొబైల్ నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నాయని హర్షం వ్యక్తం చేశారు.

తిరుపతి

నాయుడుపేట లో వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన ర్యాలీ

ఆగష్టు 6 పున్నమి ప్రతినిధి దొరవారిసత్రం వాట్సాప్ గవర్నెన్స్ (మనమిత్ర యాప్)పై మంగళవారం నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా ఆధ్వర్యంలో నాయుడుపేట పట్టణంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు.డిజిటల్ సేవలలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ (మనమిత్ర యాప్) ప్రజల చేతిలో ప్రభుత్వం అనే పోస్టర్ తో సేవలపై నినాదాలతో, అవగాహన కల్పిస్తూ,ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ షేక్.ఫజులుల్లా మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకురావడం జరిగిందని,26 శాఖలకు చెందిన 530 కు పైగా సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచారని,వాట్సాప్ లో 9552300009 అనే నంబర్ కు హాయ్ చెప్పి అన్ని సేవలు హాయిగా పొందవచ్చన్నారు.మనమిత్ర– వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు ప్రతి నెల 5వ తేదీన అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో ర్యాలీలను నిర్వహించి,పూర్తి అవగాహన కల్పించాలని సచివాలయ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, సచివాలయ, మెప్మా,సిబ్బంది పాల్గొన్నారు.

అన్నమయ్య

సీఎం రాచపల్లిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చిట్వేల్ మండలంలో సీఎం రాచపల్లి నందు వ్యవసాయ శాఖ పొలంపిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమం కి ముఖ్య అతిధిగా సహాయ వ్యవసాయ సంచాలకులు ( రెగ్యులర్ ), రైల్వే కోడూరు శ్రీ ఎస్. మణి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ అర్హత కలిగిన ప్రతి రైతు కి లబ్ది పొందడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, ఎవరికైనా ఏదయినా కారణం వల్ల పడకపోతే, వాటిని, వాటిని సరిచేసుకొంటే వారికి అమౌంట్ పడుతుందని చెప్పారు. .. ప్రతి రైతు ప్రతి పంటలో సుష్మ పోషకాలను వాడితే మంచి దిగుబడులు పొందాలని తెలియజేసారు… కాంప్లెక్స్ ఎరువులను దుక్కిలో మాత్రమే వేయాలి, పై పాటు వాడ రాదని వరకు. రైతులు భూసార పరీక్షల ఆధారంగా ఏరువులు వాడాలని సూచించారు…అంతరపంటలు వేయడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఉద్యాన పరిశోధన స్థానం, అనంతరాజుపేట సైంటిస్ట్ శ్రీ చంద్ర మోహన్ రెడ్డి అరటి, బొప్పాయి, మామిడి పంటలకు అధిక దిగుబడులకి తీసుకొనవలసిన జాగ్రత్తలు తెలియ చేశారు. మండల వ్యవసాయ అధికారి, రైల్వే కోడూరు జి. సుధాకర్ ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు చేసుకుంటేనే అన్ని పథకాలు వర్తిస్తాయని చెప్పారు.. సీఎం రాచపల్లి సర్పంచి శ్రీ రవి కుమార్ రాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అధికారుల సూచనలు పాటించి మంచి దిగుబడులు పొందాలని.. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు శ్రీ ధర్మయ్య, సురేష్ కుమార్ రాజు, పీహెచ్‌ఏ లక్ష్మి నారాయణ, ఆత్మ బి టి యం శ్రీ బాల సుబ్రహ్మణ్యం, గ్రామ రైతులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో బిఏ వెంకటాద్రి, కళ్యాణ్, గ్రామ రైతులు ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.