Tuesday, 12 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

విమర్శలు పట్టించుకోను :మంత్రి నారాయణ

నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి ): వీఆర్ హైస్కూల్పై వైసీపీ నేతలు చేసే విమర్శలను పట్టించుకోనని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నిరుపేదలకు మంచి చేయడం వారికి ఇష్టం లేదన్నారు. తన మీద విమర్శలు చేయలేక వీఆర్ హైస్కూల్పై చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హుందాగా వ్యవహరించాలని, లేదంటే 11 సీట్లు కాస్త జీరోకి పడిపోతాయని ఎద్దేవా చేశారు.

హనుమకొండ

గొల్ల కురుమ వృతి పై అవగాహన పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి విన్నపం ఇచ్చిన యాదవ జిల్లా కార్యదర్శి

పరకాల ప్రతినిధి: *ప్రమాదవశాత్తు మరణించిన గొర్ల కాపరులకు 10 లక్షల ఎక్స్ చేసి ఇవ్వాలి. మూగ జీవాలకు నట్టల మందులు ఎందుకు పంపిణీ చేయడం లేదు . gmps జిల్లా కార్యదర్శి. కే.లింగయ్య * ప్రమాదవశాత్తు మరణించిన గొర్ల కాపరులకు 10 లక్షల ఇవ్వాలని.గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులు ఉచితంగా పంపిణీ చేయాలని వివిధ రోగాలకు వ్యాక్సిన్ సప్లై చేసి ఆదుకోవాలని **గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాడబోయిన లింగయ్య ప్రభుత్వాన్ని* డిమాండ్ చేశారు. *పరకాల మండలం సీతారాంపురం లో గొర్రెలు మేకల పెంపకం దారుల సొసైటీ విస్తృత సమావేశం అధ్యక్షులు ఓదెల ఐలు కొమురూ అధ్యక్షతన యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ జరిగింది .దీనికి ముఖ్యఅతిథిగా సంఘం జిల్లా కార్యదర్శి కాడబోయిన లింగయ్య*హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులతో పాటు ఇతర* మందులు కూడా పంపిణీ కొంత పంపిణీ జరిగేది ఆ ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి మూడుసార్లు నట్ల నివారణ మందులు జీవాలకు తాపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా మెట్ల మందులు పంపిణీ తోపాటు వివిధ రోగాలకు ఎలాంటి మందులు కూడా పంపిణీ చేయలేదని లింగయ్య మండిపడ్డారు. గొల్ల కురుమల అందరి ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే రెండు లక్షల నగదు బదిలీ ద్వారా గొర్ల పంపిణీ చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో కట్టిన డీడీలకు గొర్లు పంపిణీ చేయకుండా తిరిగి వాపసు ఇచ్చి గొల్ల కురుమలలో మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల తోపాటు కుక్కల దాడిలో వివిధ రోగాలతో అనేక రోగాలతో గొర్రెలు మేకలు చనిపోతున్నాయి వీటికి ప్రభుత్వం ఇన్సిడెంట్ సౌకర్యం కల్పించాలని ప్రమాదవశాత్తు చనిపోయిన గొల్ల కురుమలందరికి 10 లక్షల ఇవ్వాలని 50 సంవత్సరాలు దాటిన గొల్ల కాపరులకు 5000 పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు లేకుంటే రాబోయే కాలంలో ప్రభుత్వం పై పోరాటం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంఘం *ఉడుత విజయ్ .ఉడుత మహేందర్ .ఇష్టబోయిన ఐలుమల్లు. ఇష్టబోయిన హరీష్. ఓదెల శ్రీనివాస్ ఉడుత లింగమూర్తి ఇష్టమైన సమ్మయ్య ఇష్టబోయిన రాజయ్య. పి రాజయ్య. రాజకుమార్ ఎన్ శ్రీనివాస్. ఓదెల శ్రీనివాస్ మొగిలి మల్లయ్య తదితరులు* *పాల్గొన్నారు* . ……… ఇట్లు…….. మండల కార్యదర్శు గండ్రకోటి కుమార్*

ఖమ్మం

42 % బిసి రిజర్వేషన్ లని బీసీ లకే కేటాయించాలి. పడిగల మధు డిమాండ్

ఖమ్మం ఆగస్టు ( పున్నమి ప్రతి నిధి) బిసి లకి కేటాయించి న 42 శాతము రిజర్వేషన్ లని బిసి లకే కేటాయించాలి అని ఆలా కాకుండా ముస్లిం లకి 10% కేటాయిస్తే సహాంచేది లేదని బిజెపి ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పడిగల మధు సుదన్ రావు అన్నారు. ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం, రెండో విడత గొర్రెలు పంపిణీ చేస్తాం, బీసీలకు బడ్జెట్లో ప్రతి ఏటా 20 వేల కోట్లు కేటాయిస్తాం, బీసీ బిడ్డలు వ్యాపారం చేసుకోవడం కోసం కానీ చదువు కోసం కానీ 10 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తామని చెప్పిందని, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరము పైగా అవుతున ఇంకా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా బీసీలను మోసం చేస్తుందని మండి పడ్డారు కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు, కాంగ్రెస్ అబద్దాలను నమ్మి మోసపోయిన బీసీ బిడ్డలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ని ఆదరిస్తారని ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్

భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు ప్రారంభమైన వరద ఆనందంలో రైతన్నలు

రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక రాష్ట్రం నుండి వరద నీరు కొనసాగుతున్నడంతో రైతన్నలు హర్షాత్రేఖలు వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సామర్థ్యం 1655అడుగులు కాగా ప్రస్తుతం 1653 అడుగులకు నీరు చేరిందని.

ఆంధ్రప్రదేశ్

రాయదుర్గంలో దుండగులు హల్ చల్.. మూడు ఇళ్లల్లో చోరీ

రాయదుర్గం పట్టణంలోని మొలకలమూరు రోడ్డు చెక్ పోస్ట్ సీతప్ప జిన్నా సమీపాన ఒకే రోజు మూడు ఇళ్లల్లో దొంగతనం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గత రాత్రి గంగమ్మ,రాధమ్మ మరియు పక్కింటి నివాసాలలో రాత్రి నివాసితులు లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు గంగమ్మ ఇంటిలో దాచుకున్న 37వేల డబ్బులు, చైనా,ఉంగరాలు, పెద్ద చీరలు ఎత్తుకెళ్లారని నివాసితురాలు గంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

కడప

కొండ మాచుపల్లిలో హోరెత్తిన జడ్పిటిసి ఉప ఎన్నికల ప్రచారం

-టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని విస్తృత స్థాయిలో ప్రచారం – పాల్గొన్న గ్రామీణ ఖాది పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి, ఎమ్మెల్సీ అనురాధ, తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ -నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుంది… చేనేత కార్మికుల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది : కె కె చౌదరి. ఒంటిమిట్ట, ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, ఒంటిమిట్ట మండలం, కొండ మాచుపల్లి గ్రామంలో జరుగుతున్న జడ్పిటిసి ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఖాది గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కేకే చౌదరి , ఎమ్మెల్సీ అనురాధ గారు, తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ గారు, జనసేన నాయకులు శివరామ రాజు గారు, సుండుపల్లి మండల అధ్యక్షులు రెడ్డప్ప గారు మరియు స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడినప్పుడు ఏడాది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను పథకాల విజయవంతమైన అమలు, గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల విస్తరణ, రహదారి నిర్మాణం, తాగునీటి సదుపాయాల కల్పన, విద్యుత్ సరఫరా మెరుగుదల, రైతులకు పంట పెట్టుబడి సాయం, మహిళల కోసం ‘సూపర్ సిక్స్’ ఉచిత బస్సు పథకం, యువతకు ఉపాధి అవకాశాల సృష్టి వంటి అనేక రంగాల్లో జరిగిన ప్రగతిని వివరించారు.నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. చేనేత కార్మికుల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని గ్రామస్థులకు ఖాదీ బోర్డు చైర్మన్ కె కె చౌదరి వివరించారు.సియం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల ఆశలు నెరవేర్చడమే తమ ధ్యేయమని, అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి కోసం పార్టీ అభ్యర్థిని గెలిపించి ప్రజల మద్దతు ఇవ్వాలని కోరారు.

భక్తి

శాలిగౌరారం మండల గ్రామాల్లో బోనాల సంబరాలు

శాలిగౌరారం : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం మండలంలోని చాలా గ్రామాలు గురువారం బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్దలతో కులామతాలకు అతీతముగా చేసుకోవడం జరిగింది. శాలిగౌరారం మండలంలోని వంగమర్తి గ్రామ ప్రజలు భక్తి శ్రద్దలతో బోనాల పండుగను పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు పాల్గొని పండుగకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పండుగను విజయవంతంగా జరుపుకున్నారు.

అన్నమయ్య

బలిరెడ్డి పల్లి గ్రామంలో సిమెంట్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి

ఓబులువారిపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ఓబులువారిపల్లి మండలంలోని బలిరెడ్డి పల్లి గ్రామంలో సిమెంట్ రోడ్ నిర్మాణనికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంకు ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్వహించి అభివృద్ధి పనులకు శుభారంభం పలికారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ,”బలిరెడ్డి పల్లి గ్రామానికి సిమెంట్ రోడ్ ద్వారా శాశ్వత సౌకర్యం కల్పిస్తున్నాం. ప్రజల అభ్యున్నతి కోసం అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయి” అని తెలిపారు.ముక్కా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ,”గ్రామ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమయానికి అందించేందుకు కృషి చేస్తాము” అని తెలిపారు.అనంతరం తిరుపతి హాస్పటల్ లొ బ్రెయిన్ స్ట్రోక్‌కు చికిత్స పొందిన గజ్జల రమణ రెడ్డి గారిని ఈరోజు వారి నివాసంలో పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కార్యకర్తలు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

E-పేపర్

మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ

ఓబులువారిపల్లి మండలం మంగంపేట RR5 నూతన లేఔట్‌ నందు భక్తి శ్రద్ధలతో శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లొ మంగంపేట వాస్తవ్యులు పసుపులేటి సుబ్రమణ్యం అలియాస్ మణి ,NDA కుటమి నాయుకులు, ప్రజలు, పాల్కొన్నారు.

E-పేపర్

మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ

ఓబులువారిపల్లి మండలం మంగంపేట RR5 నూతన లేఔట్‌ నందు భక్తి శ్రద్ధలతో శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లొ మంగంపేట వాస్తవ్యులు పసుపులేటి సుబ్రమణ్యం అలియాస్ మణి ,NDA కుటమి నాయుకులు, ప్రజలు, పాల్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.