Tuesday, 12 May 2026

Blog

చిత్తూరు

కరెన్సీ నోట్లతో సత్య గంగమ్మ అమ్మవారికి అలంకరణ

పలమనేరులో కొలువై ఉన్న సత్య గంగమ్మ అమ్మవారిని శుక్రవారం కరెన్సీ నోట్లతో విశేషంగా అలంకరించారు. వరలక్ష్మీ వ్రతం కావడంతో ధనలక్ష్మీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఈ అలంకరణ కోసం 6 లక్షల కొత్త కరెన్సీ నోట్లు ఉత్సవ కమిటీ ఉపయోగించింది. 200, 500 నోట్లను అమ్మవారి అలంకరణకు వినియోగించారు. అంతేకాదు ఆలయాన్ని కరెన్సీ నోట్లతో అందంగా ముస్తాబు చేశారు. అచ్చం పులాకృతిలో ఉండేలా నోట్లను అక్కడ ఏర్పాటు చేశారు. రంగు రంగు పూల మాదిరిగానే కరెన్సీ నోట్లు చూపరులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. కరెన్సీ నోట్లతో అలంకార శోభితమైన అమ్మవారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు. కోర్కెలు నెరవేర్చాలని, ప్రజలను చల్లగా చూడాలని కరెన్సీ నోట్లతో అలంకరణ చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

P-4లో స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి): సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించి నిరుపేద కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా P-4 ప్రోగ్రాం నిర్వహిస్తోందని కలెక్టర్ ఆనంద్ అన్నారు. P-4 ఉద్దేశాన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులందరికీ వివరించాలనే లక్ష్యంతోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వ లక్ష్యంతో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు

నిర్మల్

సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను పంపిణీ చేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

పున్నమి ప్రతినిధి నిర్మల్ ఆగస్టు: నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, సొన్, మామడ, లక్ష్మణచందా, సారంగాపూర్, దిలవార్ పూర్, నర్సాపూర్ మండలాలకు చెందిన 153 మంది లబ్ధిదారులకు రూ. 37,30,500/- (ముప్పై ఏడు లక్షల ముప్పై వేల ఐదు వందల రూపాయలు) చెక్కులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వినుతకోటకి బెయిల్ మంజూరు చేసిన చెన్నై కోర్ట్

శ్రీకాళహస్తి జనసేన బహిష్క్రుత నేత వినుతకోట(A3) కు మద్రాసు స్పెషన్స్ కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గతనెల 7న జరిగిన వినూతకోట డ్రైవర్ శ్రీనివాస అలియాస్ రాయుడు హత్య కేసులో ఆమె నిందితురాలిగా చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఇచ్చిన షరతుల మేరకు వరకు ప్రతిరోజు ఉదయం 10గంటలలోపు C3 సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాలంటూ బెయిల్ ఆర్డర్లో ఆదేశాలిచ్చారు.

E-పేపర్

నెల్లూరు: డిప్యూటీ MRO ప్రియాంకకు నోటిసులు

నెల్లూరు: డిప్యూటీ MRO ప్రియాంకకు నోటిసులు DRO లాగిన్లో ఉన్న ఫైల్ను ఉన్నతాధికారుల అనుమతి లేకుండా తన లాగిన్లోకి తీసుకున్న డిప్యూ టీ MRO ప్రియాంకకు DRO హుస్సేన్ సాహెబ్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. తన అనుమతి లేకుండా ఫైల్ను ఎందుకు తీసుకున్నారో వివరణ ఇవ్వాలంటూ ఆమెను కోరారు. వివరణ అనంతరం ఆమెపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కలెక్టరేట్ ఉన్నతాధికారులు తెలిపారు. గతంలో కూడా ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయి.

కడప

ఒంటిమిట్ట మండల వైస్ ఎంపీపీ బోగా గీతా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిక.

ఒంటిమిట్ట ఆగస్టు (పున్నమి ప్రతినిధి) శుక్రవారం ఒంటిమిట్ట ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతులమీదుగా, రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి సమక్షంలో కొత్త మాధవరం ఎంపీటీసీ మరియు ఒంటిమిట్ట మండల వైస్ ఎంపీపీ బోగా గీతా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన మద్దతుగా నేడు టిడిపి కండువా కప్పుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ

జల దిగ్బoబందనంలో ఊట్కూర్ గ్రామప్రజలు

శాలిగౌరారం : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ప్రవాహం వల్ల ఊట్కూర్ గ్రామప్రజలు ఊరినుండి భైటకు వెళ్ళుటకు వీలులేకుండా ఊట్కూర్ నుండి పావురాళ్ళగూడెం మధ్యన, ఊట్కూర్ నుండి బండమీదిగూడెం మధ్యన, అలాగే సవుళ్లగూడెం మధ్యన వరద ప్రవాహం అధికంగా ఉండడంతో ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతుంది. కావున గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద తగ్గిన తర్వాత ప్రయాణాలు సాగించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్

నెల్లూరు లొ ఘనంగా వరలక్ష్మి వృతం పూజలు

నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి ): Kumar Sr Reporter, ১৯ way2.co/59s9bc Nellore (M) నెల్లూరు: ప్రారంభమైన వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం నెల్లూరు నగరంలోని దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేక పుష్ప అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం దేవస్థానం ఆలయ ఆవరణలో వరలక్ష్మీ వ్రతాన్ని వేద పండితులు మంగళ వాయిద్యాలు నడుమ అంగరంగ వైభవంగా జరిపించారు. 3 నెలల్లో రంగనాథస్వామి ఘాట్ పనులు పూర్తి: నారాయణ నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి ): రానున్న మూడు నెలల్లో 52 డివిజన్లోని పినాకిని పార్ను పొట్టే పాలెం వరకు అభివృద్ధి చేసి బోటింగు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ తెలిపారు. తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకున్న ఆయన ఘాట్ పనులను పర్యవేక్షించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా రంగనాయకుల స్వామి గుడిలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

తూర్పు గోదావరి

వైఎస్ఆర్ మరణానికి ఈవీఎంల అవకతవకలకు ఏమైనా సంబంధం ఉందా

ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్ ******************* వై ఎస్ ఆర్ మరణానికి – ఈ వి ఎమ్, ల అవకతవకలకు ఏమైనా సంబంధం వుందా ! ఎన్నికల సంఘం అధికార దుర్వినియోగమే ” జనసేన ” గెలుపుకు కారణమా ! ********************** మేడా శ్రీనివాస్ , నిగూడ సందేహాలు , రాష్ట్రయ ప్రజా కాంగ్రెస్ 2000 సం వ రం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ వి ఎమ్, ల కుంబకోణం జరిగింది అని గోంతేత్తి ఘోష వినిపించిన ఏకైక రాజకీయ పార్టి ” రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ” అని చెప్పుకోవటానికి గర్వాంగా వుంది . ఆనాడు మన కార్పొరేట్ మీడియా కు మా గోష వినిపించలేదు . మా ఆర్తనాదాలు కనిపించలేదు . నేడు భారతదేశ వ్యాప్తంగా వినిపిస్తున్నది . కనిపిస్తున్నది ” ఈ వి ఎమ్ ” ల కుంబకోణం కోసమే పెద్ద ఎత్తున చర్చ జకరగటం విశేషం .. తొలి నుండి భారత ఎన్నికల సంఘం పనితీరు ఒక రకమైన కార్పొరేట్ ఈ వి ఎమ్ ల కుంబకోణంకు నాంది పలికింది అని అనేక సార్లు గోంతేత్తి అరిచిన మా ఆవేదనను ప్రధాన వ్యాపార రాజకీయ పార్టిలు , కార్పొరేట్ మీడియా సంస్థలు పెదచెవిన పెట్టాయి . సాంకేతికంగా ఎంతో ముందున్న అమెరికా వంటి దేశం భారత్ లో పెద్ద ఎత్తున ఈ వి ఎమ్ ల కుంబకోణం జరిగింది అని ఆ దేశ ఇంటిలిజెన్స్ చీఫ్ చెబితే భారత్ లో కొంతమేరకు కదలికలు వచ్చాయి . భారత్ నిఘా వ్యవస్థ ఎంత బహినంగా వుందో గుర్తించాల్సిన బాధ్యత నేడు మన అత్యున్నత ప్రజా స్వామ్యం పై ఆధార పడి వుంది . భారత్ లో 3 సార్లు మోదీ ప్రధానిగా ఎన్నిక కాబడినా , ఉత్తర ప్రదేశ్ , మహారాష్ట్ర , లో బిజెపి ప్రభుత్వాలు అధికారాన్ని శాశిస్తున్నా అందుకు ఎన్నికల సంఘం వ్యూహ రచనలో జరిగిన ఈ వి ఎమ్ ల కుంబకోణమే అని బావించాలి . ఆంధ్రప్రదేశ్ లో ” జనసేన ” గెలిచిన అన్ని స్థానాల్లోను , ఇతర స్థానాల్లో , అన్ని పోలింగ్ బూత్ ల లోను ఈ వి ఎమ్ ట్యాంపరింగ్ జరిగింది . ఎన్నికల సంఘం ఏ స్థాయిలో ” జనసేన ” పార్టీకి అడ్డ గోలుగా కొమ్ము కాసిందో ఆధారాలతో నిరూపించి 2024 ఎన్నికల్లో కొంతమేరకు ” గాజుగ్లాస్ ” గుర్తు కేటాయింపులో న్యాయస్థానం ద్వారా ” రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ” పై చేయి సాధించినది . ఆ నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి విమాన ప్రమాదం ఘటనకు ప్రస్తుత ఈ వి ఎమ్,ల మాయా జాలానికి చాలా దగ్గర సంబంధాలు వున్నాయి . అనటంలో సందేహమే లేదు . కాని ఆ కుట్రను చేదించగల ఇన్వెస్టిగేషన్ సంస్థ ప్రస్తుతం భారత్ లో లేదు . మన నిఘా వ్యవస్థ ఎంత బలహీంగా వుందో నని చెప్పటంలో కొన్ని ఉదాహరణలు : మన భారతదేశం నుండి ఒక సందర్బంలో ప్రస్తుత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొన్ని రోజులు ఒక్కసారిగా మాయం అయ్యారు . ఆయన జాడ తెలుకోవటంలో మన నిఘా విభాగం చేతులెత్తెసింది. మరో ఘటన ఆంధ్రప్రదేశ్ నుండి సుమారు 35 వేల మంది అమ్మాయిలు కానడకుండా పోయారు . వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు అంటు ప్రస్తుత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ” భహిరంగంగా ప్రకటించు కున్నారు . శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెందిన ” పింక్ డైమండ్ ” ఎక్కడుందో తనకు తెలుసునాని , కేంద్ర నిఘా సంస్థలు తనకు చెప్పాయని బాహటంగా పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నారు . భారతదేశంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే ఎంతో గొప్ప నిఘా వ్యవస్థను నడిపించగల సమర్డులు , మేధావులు భారత్ లో వున్నారు . పాలకులు రాజకీయ పెత్తనం కారణంగా వారి సామర్థ్యత చతికిల పడుతుంది . ప్రస్తుత పాలనా వ్యవస్థ కారణంగా భారత్ లో కొన్ని నేరాలు , కుంబకోణాలు నిరూపించటం అసాధ్యం అనే బావించాలి . రెండు ధశాబ్దాలు పైభడి భారత్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అర కోర గా సాగిన ఈ వి ఎమ్ కుంబకోణాలు , ఎన్నికల సంఘం అధికార దుర్వినియోగం నేడు మహా వృక్షంగా మారి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి . భారత్ లో బారి స్థాయిలో ఈ వి ఎమ్, ల కుంబకోణం జరిగిందని పరాయి దేశాలు చెబితేనే మన కార్పొరేట్ మీడియాలో కాస్త చెలనం కలగటం భారతీయుల దురదృష్టం . కొన్ని కుల సంఘాలను , మత సంస్థలను , ప్రాంతీయ ఉన్మాద ఘటన లను ప్రోత్సహించేది . ముగించిది కూడా కార్పొరేట్ శక్తులు , కార్పొరేట్ మీడియా సంస్థలే .. భారతదేశంలో ఆది లోనే ఒక రాజకీయ పార్టి నుండి ” ఈ వి ఎమ్ ” లు వద్దు ” బ్యాలెట్ ” ముద్దు అని అని గోంతేత్తి ఉద్యమించిన ఏ కైక రాజకీయ పార్టి ” రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ” పార్టి అని చాటుకోవటంలో ఎంతో సంతోగంగా వుంది .

ఆంధ్రప్రదేశ్

విమర్శలు పట్టించుకోను :మంత్రి నారాయణ

నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి ): వీఆర్ హైస్కూల్పై వైసీపీ నేతలు చేసే విమర్శలను పట్టించుకోనని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నిరుపేదలకు మంచి చేయడం వారికి ఇష్టం లేదన్నారు. తన మీద విమర్శలు చేయలేక వీఆర్ హైస్కూల్పై చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హుందాగా వ్యవహరించాలని, లేదంటే 11 సీట్లు కాస్త జీరోకి పడిపోతాయని ఎద్దేవా చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.