Monday, 17 August 2026
  • Home  
  • కూటమి ప్రభుత్వం కక్ష సాధించి ఉంటే వైకాపా వారితో సెంట్రల్ జైలు నిండిపోయేది
- తూర్పు గోదావరి

కూటమి ప్రభుత్వం కక్ష సాధించి ఉంటే వైకాపా వారితో సెంట్రల్ జైలు నిండిపోయేది

కూటమి ప్రభుత్వం కక్ష సాధించి ఉంటే వైకాపా వారితో సెంట్రల్ జైలు నిండిపోయేది – నగరంలో దేవాదాయ కమిటీల నియామకం – దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి – అందరూ నాయకులుగా ఎదగాలి – మార్గదర్శి కేసుమాదిరి మాపై కేసు కొట్టేసే అవకాశం – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం: ఆగష్టు 6 పున్నమి ప్రతి nidhi గత వైకాపా ప్రభుత్వం మాదిరిగా తమ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగి ఉంటే గడచిన ఈ ఏడాదిలో రాజమండ్రి సెంట్రల్ జైల్ నిండిపోయి ఉండేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. కానీ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా పాలన సాగిస్తోంది పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో తన విజయానికి కష్టపడి పనిచేసి 73 వేలకు పైగా భారీ మెజారిటీతో గెలిపించిన కూటమి లోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ నాయకులుగా ఎదగాలని, అందరికీ సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనతో నగరంలోని ఆయా దేవస్థానాల కమిటీల్లో వారికి చోటు కల్పించామని వెల్లడించారు. నగరంలో 14 ఎండోమెంట్ కమిటీలు ఉంటే వాటిలో నాలుగు కమిటీలకు ప్రభుత్వ ఆమోదం వచ్చిందని, మరో రెండుమూడు రోజుల్లో మరో నాలుగు కమిటీలకు ఆమోదం రానుందన్నారు. ఈ మేరకు తిలక్ రోడ్డు లోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కమిటీలు వేయడంవల్ల దేవాలయాలు మరింత అభివృద్ధి చెందుతాయని, కమిటీ ఉండడం వల్ల అన్ని విధాలుగా కూడా దాతలు ముందుకొస్తారని పేర్కొన్నారు. నాళం భీమరాజు వీధిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా మద్ది నాగ పూర్ణ వెంకట సత్యనారాయణ, సారంగధరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా కె.వి.డి.ఎస్.వి.చౌదరి, నేషనల్ సీనియర్ బేసిక్ స్కూలు కమిటీ చైర్మన్ గా చింతా జోగి నాయుడు, కోరుకొండ రోడ్డు లోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా ఏడిద వీర వెంకట దుర్గా ప్రసాద్ నియమితులయ్యారని ఆయన చెప్పారు. ఈ నాలుగు దేవస్థానం కమిటీలు రెండు మూడు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తాయని ఆయన చెప్పారు. అలాగే‌ శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం చైర్మన్ గా మదన్ సింగ్ రాజ్ పురోహిత్, శ్రీ శ్యామలాంబ దేవస్థానం చైర్మన్ గా కడియాల వీరభద్రరావు, శ్రీ పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్ గా రెడ్డి మణేశ్వరరావు, జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా దాసరి గురునాధరావు నియమితులయ్యారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. త్వరలో ఈ కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ కమిటీలు భక్తుల నమ్మకం, విశ్వాసం పొందేలా పనిచేయాలని ఆయన సూచించారు. గత వైసీపీ పాలనలో మార్కండేయ స్వామి దేవస్థానంలో క్షమించరాని పాపాలు చేశారని ఆయన ఆరోపించారు. రెండేళ్ల కాలపరిమితితో ఈ కమిటీలు పని చేస్తాయని, మరో రెండేళ్ళకు మళ్ళీ కొత్తవారితో కమిటీలు వేస్తామని ప్రతి కమిటీ లోను పదినుంచి పదకొండు మంది సభ్యులు ఉంటారని తద్వారా నాలుగేళ్లలో సుమారు 280 మందికి అవకాశం కల్పించినట్లవుతుందని ఆయన చెప్పారు. మద్యం స్కాంపై సిట్ తనపని తాను చేసుకు వెళుతోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తప్పు చేయలేదనుకుంటే వైసీపీ వారు న్యాయ పోరాటం చేయవచ్చని, గతంలో చంద్రబాబును అరెస్టు చేస్తే ఆయన తన తప్పు లేదని ఆయన న్యాయపరంగా పోరాటం చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగివుంటే ఈ ఏడాది కాలంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వైసీపీ వారితో నిండి పోయేదని, వారి కోసం మరో జైలు కట్టాల్సి వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ సంఖ్యతతో ఉన్నారని ఆయన అన్నారు. వైసీపీ గ్రౌండ్ స్థాయిలో జీరో అయిపోయిందని, వారి కార్యక్రమం ద్వారా జనంలోకి వెళితే ప్రజలు వారిపై తిరగబడుతున్నారని అందుకే ఆ పార్టీ కార్యక్రమం అర్థాంతరంగా ముగిసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు కోర్టు కొట్టివేసిందని, తమపై నమోదు చేసిన కేసు కూడా అలాంటిదేనని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరిపిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. నెలాఖరు నాటికి 5,500 కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని, త్వరలో 9,600 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. టిడ్కో గృహాలు త్వరలో లబ్దిదారులకు అందచేస్తామని ఆయన చెప్పారు. బూరుగుపూడి ఆవ భూమిలో వైసీపీ నాయకులు భారీ స్కాం చేశారని ఆనాడే అప్పటి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ ‌మార్గాని భరత్ గొడవ పడ్డారని ఆయన గుర్తు చేశారు. దేవీచౌక్, పుష్కర ఘాట్ రాళ్ళు అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, దోషులు తేలాక అక్కడ సిసి రోడ్డు వేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వై శ్రీను, దొండపాటి సత్యంబాబు, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకి రామయ్య, బుడ్డిగ రవి, పి నాగేంద్ర, కంటిపూడి శ్రీనివాస్, కొల్లి బుజ్జి, శెట్టి జగదీష్, మొకమాటి సత్యనారాయణ, అడబాల రామకృష్ణ, దాస్యం ప్రసాద్, ఆడారి లక్ష్మీ నారాయణ, చాపల చినరాజు, అక్కిరెడ్డి ప్రసాద్, భాష లిమ్రా తదితరులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వం కక్ష సాధించి ఉంటే వైకాపా వారితో సెంట్రల్ జైలు నిండిపోయేది
– నగరంలో దేవాదాయ కమిటీల నియామకం
– దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి
– అందరూ నాయకులుగా ఎదగాలి
– మార్గదర్శి కేసుమాదిరి మాపై కేసు కొట్టేసే అవకాశం
– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం: ఆగష్టు 6 పున్నమి ప్రతి nidhi
గత వైకాపా ప్రభుత్వం మాదిరిగా తమ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగి ఉంటే గడచిన ఈ ఏడాదిలో రాజమండ్రి సెంట్రల్ జైల్ నిండిపోయి ఉండేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. కానీ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా పాలన సాగిస్తోంది పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో తన విజయానికి కష్టపడి పనిచేసి 73 వేలకు పైగా భారీ మెజారిటీతో గెలిపించిన కూటమి లోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ నాయకులుగా ఎదగాలని, అందరికీ సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనతో నగరంలోని ఆయా దేవస్థానాల కమిటీల్లో వారికి చోటు కల్పించామని వెల్లడించారు. నగరంలో 14 ఎండోమెంట్ కమిటీలు ఉంటే వాటిలో నాలుగు కమిటీలకు ప్రభుత్వ ఆమోదం వచ్చిందని, మరో రెండుమూడు రోజుల్లో మరో నాలుగు కమిటీలకు ఆమోదం రానుందన్నారు. ఈ మేరకు తిలక్ రోడ్డు లోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కమిటీలు వేయడంవల్ల దేవాలయాలు మరింత అభివృద్ధి చెందుతాయని, కమిటీ ఉండడం వల్ల అన్ని విధాలుగా కూడా దాతలు ముందుకొస్తారని పేర్కొన్నారు. నాళం భీమరాజు వీధిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా మద్ది నాగ పూర్ణ వెంకట సత్యనారాయణ, సారంగధరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా కె.వి.డి.ఎస్.వి.చౌదరి, నేషనల్ సీనియర్ బేసిక్ స్కూలు కమిటీ చైర్మన్ గా చింతా జోగి నాయుడు, కోరుకొండ రోడ్డు లోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా ఏడిద వీర వెంకట దుర్గా ప్రసాద్ నియమితులయ్యారని ఆయన చెప్పారు. ఈ నాలుగు దేవస్థానం కమిటీలు రెండు మూడు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తాయని ఆయన చెప్పారు. అలాగే‌ శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం చైర్మన్ గా మదన్ సింగ్ రాజ్ పురోహిత్, శ్రీ శ్యామలాంబ దేవస్థానం చైర్మన్ గా కడియాల వీరభద్రరావు, శ్రీ పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్ గా రెడ్డి మణేశ్వరరావు, జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా దాసరి గురునాధరావు నియమితులయ్యారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. త్వరలో ఈ కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ కమిటీలు భక్తుల నమ్మకం, విశ్వాసం పొందేలా పనిచేయాలని ఆయన సూచించారు. గత వైసీపీ పాలనలో మార్కండేయ స్వామి దేవస్థానంలో క్షమించరాని పాపాలు చేశారని ఆయన ఆరోపించారు. రెండేళ్ల కాలపరిమితితో ఈ కమిటీలు పని చేస్తాయని, మరో రెండేళ్ళకు మళ్ళీ కొత్తవారితో కమిటీలు వేస్తామని ప్రతి కమిటీ లోను పదినుంచి పదకొండు మంది సభ్యులు ఉంటారని తద్వారా నాలుగేళ్లలో సుమారు 280 మందికి అవకాశం కల్పించినట్లవుతుందని ఆయన చెప్పారు. మద్యం స్కాంపై సిట్ తనపని తాను చేసుకు వెళుతోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తప్పు చేయలేదనుకుంటే వైసీపీ వారు న్యాయ పోరాటం చేయవచ్చని, గతంలో చంద్రబాబును అరెస్టు చేస్తే ఆయన తన తప్పు లేదని ఆయన న్యాయపరంగా పోరాటం చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగివుంటే ఈ ఏడాది కాలంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వైసీపీ వారితో నిండి పోయేదని, వారి కోసం మరో జైలు కట్టాల్సి వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ సంఖ్యతతో ఉన్నారని ఆయన అన్నారు. వైసీపీ గ్రౌండ్ స్థాయిలో జీరో అయిపోయిందని, వారి కార్యక్రమం ద్వారా జనంలోకి వెళితే ప్రజలు వారిపై తిరగబడుతున్నారని అందుకే ఆ పార్టీ కార్యక్రమం అర్థాంతరంగా ముగిసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు కోర్టు కొట్టివేసిందని, తమపై నమోదు చేసిన కేసు కూడా అలాంటిదేనని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరిపిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. నెలాఖరు నాటికి 5,500 కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని, త్వరలో 9,600 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. టిడ్కో గృహాలు త్వరలో లబ్దిదారులకు అందచేస్తామని ఆయన చెప్పారు. బూరుగుపూడి ఆవ భూమిలో వైసీపీ నాయకులు భారీ స్కాం చేశారని ఆనాడే అప్పటి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ ‌మార్గాని భరత్ గొడవ పడ్డారని ఆయన గుర్తు చేశారు. దేవీచౌక్, పుష్కర ఘాట్ రాళ్ళు అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, దోషులు తేలాక అక్కడ సిసి రోడ్డు వేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వై శ్రీను, దొండపాటి సత్యంబాబు, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకి రామయ్య, బుడ్డిగ రవి, పి నాగేంద్ర, కంటిపూడి శ్రీనివాస్, కొల్లి బుజ్జి, శెట్టి జగదీష్, మొకమాటి సత్యనారాయణ, అడబాల రామకృష్ణ, దాస్యం ప్రసాద్, ఆడారి లక్ష్మీ నారాయణ, చాపల చినరాజు, అక్కిరెడ్డి ప్రసాద్, భాష లిమ్రా తదితరులు పాల్గొన్నారు.

1 Comment

  1. 光算科技

    August 6, 2025

    I like what you guys are up also. Such clever work and reporting! Carry on the superb works guys I?¦ve incorporated you guys to my blogroll. I think it will improve the value of my website 🙂

  2. 谷歌SEO公司

    August 6, 2025

    I love your blog.. very nice colors & theme. Did you create this website yourself or did you hire someone to do it for you? Plz answer back as I’m looking to create my own blog and would like to find out where u got this from. thanks a lot

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.