Monday, 11 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో నేడు కేంద్రమంత్రులను కలవనున్న మంత్రి నారా లోకేష్.

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : ఢిల్లీలో నేడు కేంద్రమంత్రులను కలవనున్న మంత్రి నారా లోకేష్. పెండింగ్ ప్రాజెక్ట్ లపై నేడు ఢిల్లీలో కేంద్రమంత్రులతో లోకేష్ భేటీ. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‍ తో భేటీకానున్న నారా లోకేష్. ఏపీకి సెమీకండక్టర్ యూనిట్ మంజూరుకు ధన్యవాదాలు తెలపనున్న లోకేష్. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలవనున్న మంత్రి నారా లోకేష్.. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో భేటీకానున్న లోకేష్. ఓడరేవులు, జలరవాణా మంత్రి శర్బానంద సోనోవాల్‍తో భేటీకానున్న లోకేష్. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‍తో భేటీకానున్న లోకేష్. విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో భేటీకానున్న మంత్రి లోకేష్. ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రమంత్రులకు అందించనున్న మంత్రి లోకేష్.

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం. ఈ నెల 20న ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. 20న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం కాన్ఫరెన్స్ హాలులో సమావేశం. భేటీకి రావాలని 14 ఉద్యోగ సంఘాలు, అనుబంధ సంఘాలకు ఆహ్వానం. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించనున్న సీఎస్ విజయానంద్. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం. ఈ నెల 20న ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. 20న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం కాన్ఫరెన్స్ హాలులో సమావేశం. భేటీకి రావాలని 14 ఉద్యోగ సంఘాలు, అనుబంధ సంఘాలకు ఆహ్వానం. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించనున్న సీఎస్ విజయానంద్.

ఆంధ్రప్రదేశ్

అన్నదాత సుఖీభవ రైతులకు ముఖ్య గమనిక

పట్టాదారు ఆధార్ సీడింగ్, అప్లికేషన్ పెండింగ్ తదితర సమస్యలు ఉండి అర్హత ఉన్నప్పటికీ అమౌంట్ పడని వారికి *ఆగస్టు 25వ* తేదీ వరకు అర్జీ పెట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. సదరు రైతులు మీ సమీప రైతు సేవా కేంద్రంలో సంప్రదించవచ్చు. పేమెంట్ ఇప్పటికే ప్రాసెసింగ్ చూపిస్తున్న వారికి అర్జీ అవసరం లేదు, అమౌంట్ పడుతుంది

ఖమ్మం

పాపన్న గౌడ్ కి నివాళులు అర్పించిన సండ్ర

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి) బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాపన్న గౌడ్ఘ విగ్రహం కి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో స్థానిక భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

“సమాజం తగలబడుతుంది నకిలీ మంటల్లో…”

మనందరం గొప్ప చదువులు చదువుకున్నప్పటికీ, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేక మోసపోతున్నామని యువ రచయిత పిట్ట. గోపి ఆవేదన వ్యక్తం చేశారు.సమాజం నకిలీ మంటల్లో తగలబడుతుందని, నటన మాత్రం నాణ్యతగా దొరుకుతోందని ఆయన వ్యాఖ్యానించారు. యువతే దేశానికి వెన్నెముక అయినా, చాలామంది చదువుకు తోడైన ప్రతిభను కష్టపడి సంపాదించటానికి కాకుండా, ఇతరులను మోసం చేసి సులువుగా సంపాదించటానికి ఉపయోగిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.”మూగజీవుల కంటే కూడా ఒక మనిషి ఇంకో మనిషిని డబ్బు కోసం సులభంగా చంపగలుగుతున్నాడు. డబ్బు కోసం ఎలాంటి పనైనా చేయడానికి వెనుకాడని పరిస్థితి వస్తోంది. ఇలాంటి దారిలో నడిచే వ్యక్తికి చివరికి జైలు జీవితం తప్ప విలాస జీవితం ఉండదు” అని గోపి గారు అన్నారు.డబ్బు, ఆకలి మంచివాడినీ చెడవాడిని చేయగలవని, ఎలాంటి పరిస్థితులలోనైనా నిబద్ధతతో జీవించాలనే విషయాన్ని గుర్తు చేశారు. “నేరాలు చేయటానికి ఉన్న ధైర్యం, కష్టపడి సంపాదించటానికి ఎందుకు ఉండడం లేదో ఆలోచించాలి” అని ఈ యువ రచయిత ప్రశ్నించారు.

ఖమ్మం

పాపన్న గౌడ్ జయంతి.. నివాళులు అర్పించిన ధనియాకుల

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా ఖమ్మం టూ టౌన్ బిజెపి అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ నివాళులు అర్పించారు

ఆంధ్రప్రదేశ్

వరుస సెలవులతో సందడిగా ఆగస్టు నెల – ఈరోజు కూడా భారీ వర్షం సెలవు

శ్రీకాకుళం, ఆగస్టు 18:ఆగస్టు నెల ప్రారంభం నుంచే ప్రజలకు వరుసగా పండుగలతో పాటు ఆదివారాలు కలిసిపోవడంతో సెలవుల సందడి నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు భారీ వర్షాల కారణంగా మరో సెలవు జోడైందని చెప్పాలి.ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం, 9న రక్షా బంధన్, 10న ఆదివారం రావడంతో మూడు రోజుల వరుస సెలవులు లభించాయి. వెంటనే 15న స్వాతంత్ర్య దినోత్సవం, 17న ఆదివారం, 16న కృష్ణాష్టమి కారణంగా మరిన్ని సెలవులు వచ్చాయి. ఇక ఈరోజు కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులకు అదనపు విశ్రాంతి లభించింది. ఈనెల 27న వినాయక చవితి, ముందు రోజు ఆదివారం రావడంతో నెలాఖరులో కూడా వరుస సెలవులు లభించనున్నాయి.ఈ వరుస సెలవులతో విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు అందరూ ఉత్సాహంగా గడుపుతున్నారు. రైతాంగం కూడా వర్షాల కారణంగా పంటల పెరుగుదలపై ఆశలు పెంచుకుంది. మొత్తానికి ఈ ఆగస్టు నెల పండుగలు, ఆదివారాలు, వర్షాలతో ఆనందోత్సవ మాసంగా మారింది. 🌸🌧️🇮🇳🐘

ఆంధ్రప్రదేశ్

ఏపీలో పేదలకు ఇళ్ళు.. రూపాయికే ఇంటి ప్లాన్!

అమరావతి : ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. 50 చదరపు మీటర్లలోపు స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే రూపాయికే ఇంటిప్లాన్ లభించనుంది. కొత్త నిబంధనల ప్రకారం లబ్ధిదారులు వారి పరిధిలోని కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా ప్లాన్ పొందుతారు. దీనివల్ల లబ్దిదారులకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు మిగులుతుంది.

ఆంధ్రప్రదేశ్

కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో పరీక్ష

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : విద్యార్థులకు సైన్స్ పై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో పరీక్ష నిర్వహించి ఉపకార వేతనాలు అందిస్తోంది. ఆన్ లైన్ లో నిర్వహించే ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 6వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనేందుకు అర్హులని, సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవు

శ్రీకాకుళం, ఆగస్టు 18:జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సోమవారం (ఆగస్టు 18) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ఒక రోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ నిర్ణయాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.అలాగే, భారీ వర్షాల కారణంగా ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.