Monday, 11 May 2026

Blog

అన్నమయ్య

పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి నిత్యవసర సరుకుల పంపిణీ

చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో మానవతా శాఖ అడ్వైజర్ బోర్డ్ సభ్యుడు మద్దిన చంద్రమోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా సోమవారం శ్రీ నారాయణ తపోవనం ఆశ్రమంలో వృద్ధులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ దాతను ఘనంగా సత్కరించారు. మానవతా శాఖ తరఫున మెమెంటో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సాయిరాం, కో చైర్మన్ గుత్తి నరసింహ, కన్వీనర్ దొండ్లవాగు శ్రీనివాసులు, కార్యదర్శి మునిరావు, సభ్యులు శివరాజు, బాజీ, చింటూ, చంద్రశేఖర్, ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ సహకారంతో, రైతుల సేవలో తరిస్తా..!కలిగిరి సొసైటీ బాధ్యతలు స్వీకరించిన కదిరి రంగారావు. డైరెక్టర్లు సోము భాస్కర్ రెడ్డి, గన్నమనేని శ్రీనివాసులు..!

కూటమి నేతలకు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి ధన్యవాదాలు తెలిపిన. సొసైటీ చైర్మన్ కదిరి రంగారావు..! కలిగిరి పున్నమి న్యూస్ ప్రతినిధి నాగరాజు ఆగస్టు 18 :/// మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారికి అవసరమైన ఎరువులు , విత్తనాలు, సబ్సిడీ రుణాలను సకాలంలోఅందించేందుకు కృషిచేసి వారి సేవలో తరిస్తానని కలిగిరి సొసైటీ చైర్మన్ కదిరి రంగారావు పేర్కొన్నారు.సోమవారం కలిగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా కదిరి రంగారావు, డైరెక్టర్లుగా, సోము భాస్కర్ రెడ్డి, గన్నమనేని శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరణ సందర్భంగా నియోజకవర్గంలోని కూటమి నేతలు చైర్మన్ కదిరి రంగారావు, డైరెక్టర్లు సోము భాస్కర్ రెడ్డి, గన్నమనేని శ్రీనివాసులను, శాలవాలు పూలమాలలతో, ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు నాపై నమ్మకంతో, ఈ గురుతుర బాధ్యతను అప్పగించారని, ఈ పదవిని సేవకుడిగా భావించి, వమ్ము చేయక రైతులకు సేవ చేస్తూ తరిస్తానని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు రుణాలను అందిస్తానన్నారు. నాకు సహకరించిన కూటమి నేతలకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి, పార్టీ అధ్యక్షులకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, చీమల తాతయ్య, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పులి చర్ల వెంకటనారాయణ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు మేకపాటి మాల్యాద్రి నాయుడు, ఆండ్రా పరంధామ రెడ్డి సీఈఓ మానస బిజెపి మండల కన్వీనర్ లు లెక్కల వెంగళరెడ్డి, చుండి హరి గోపాల్, డేగా మధు యాదవ్, మాలేపాటి మల్లికార్జున, ఆవుల రోశయ్య యాదవ్, ఇతర నాయకులు అభిమానులు తదితరులు ఉన్నారు.

నాగర్‌కర్నూల్

బిజినేపల్లి లో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

నాగర్ కర్నూల్ జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 18 నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండల కేంద్రంలో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను పిఎసిఎస్ చైర్మన్ బాలరాజు గౌడ్ గౌడ సంఘం అధ్యక్షులు వేణు గౌడ్ ఆచరణలో ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గౌడ జాతి ఔన్నత్యానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుని ఆయనతో ఆశయాలతో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలతో పాటు దళిత బహుజనల సమాజానికి సేవ చేయడమే పాపన్న లక్ష్యం అని అన్నారు.అంతటి రాజేందర్ గౌడ్ వంగ రాములు గౌడ్ శంకర్ గౌడ్ గణేష్ గౌడ్ దశరథం గౌడ్ అంజి గౌడ్ మరియు బంగారి పర్వతాలు వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ స్వామి బహుజన బిడ్డలు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది.

నాగర్‌కర్నూల్

అచ్చంపేటలో 30 మందికి ఆపరేషన్లు పూర్తి

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పున్నమి ప్రతినిధి ఆగస్టు 18. MLA డా చిక్కుడు వంశీకృష్ణ నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేట పట్టణంలో నిర్వహిస్తున్న మెగా సర్జికల్ క్యాంపు సోమవారం 30 మందికి ఆపరేషన్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఈ క్యాంపు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 31 వరకు ఈ సర్జికల్ క్యాంపు కొనసాగుతుందని ఇంకా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పేర్లు నమోదు చేసుకోవాలని డాక్టర్ ఎమ్మెల్యే ప్రజలకు సూచనలు చేశారు అచ్చంపేట నల్లమల్ల ప్రాంత ప్రజలు ఇంకా ఎవరైనా పేర్లు నమోదు చేసుకొని వారు ఉంటే నమోదు చేసుకొని ఈ యొక్క మెగా సర్జికల్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోగలరు… ఈ క్యాంపులో సేవలందిస్తున్నసూపర్డెంట్ డాక్టర్ ప్రభు,వనపర్తి డిఎంహెచ్వో శ్రీనివాస్,డి సి హెచ్ రామకృష్ణ , డా.శ్రీనివాసులు ,స్టాఫ్ నర్స్, థియేటర్ అసిస్టెంట్లు,గోవర్ధన్ , పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. వైద్య బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు.

తెలంగాణ

బహుజన నాయకుడు పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు హాజరైన: ఎమ్మెల్యే

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నకిరేకల్ పట్టణంలోని ఇందిరాగాంది బొమ్మ వద్ద మహమ్మదియ పాలకుల దౌర్జన్యాలను ఎదిరించి విప్లవ వీరుడు, బహుజన నాయకుడైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్బంగా ఎమ్మెల్యే వేముల వీరేశం గారు హాజరై కేక్ కట్ చేసి అక్కడికి హాజరైన నాయకులందరికి కేక్ ను తినిపించి, సర్వాయి పాపన్న గౌడ్ చేసిన ధైర్యసాహసాలను గుర్తు చేసుకున్నారు.

తిరుపతి

*వికలాంగుల పింఛన్‌లు రద్దు

తడ పున్నమి ప్రతినిధి తిరుపతి జిల్లా తడ మండలం అండగుండాల గ్రామంలో పెన్షన్ 11మందికి ఆపివేశారు, మాకు 20 సంవత్సరలుగా పెన్షన్ వస్తుందని కనీసం ఎటువంటి సమాచారం లేకుండా మీకు తరువాత నెల నుండి డబ్బులు రావు అని చెప్పి నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్న సచివాలయ సిబ్బంది, కనీసం 76% అంగవైకల్యం ఉండీ, ప్రభుత్వ వైద్యాధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ ఉండి కూడా పెన్షన్ ఆపివేయడం ఏంటని అడిగిన ఎటువంటి సమాచారం ఇవ్వని అధికారులు, ఇకపై ఎలా బ్రతకాలి అని ఆవేదన చెందుతున్న 11 మంది కుంటుంబాలు…

నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 18 నాగర్ కర్నూల్ సమీపంలో ఉన్న కేసరి సముద్రం చెరువును జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం పరిశీలించారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచనలు చేశారు. కేసరి సముద్రం చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలందరూ దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. Video: https://youtu.be/_80fpkaBE6M?si=sHb-1S5zbg2x1ntC

కర్నూలు

గాజులదినే ప్రాజెక్ట్ కు వరద నీరు ఎక్కువ చేరుకుంది

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజులదినే ప్రాజెక్ట్ కు వర్షాలు ఏకువ కురవడం కారణంగా వరదనీరు ఎక్కువ రావటం జరిగింది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు భక్తులు ప్రయాణికులు ఇబ్బందులు

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం ఆదురుపల్లి ప్రాంతంలో వరుసగా మూడు రోజులుగా కురుస్తున్న చిరుజల్లుల కారణంగా పెంచలకోన రోడ్డు మార్గంలో వర్షపు నీరు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మే నెలలో లక్షలు పెట్టి వేసిన ప్యాచ్ లు నాశిరకంగా ఉండటం తో చిన్నపాటి వర్షానికే రోడ్డు ప్యాచ్ లు దెబ్బతిన్నాయి. ఫలితంగా రోడ్డు నీటమునిగి ఆందోళన కలిగిస్తోంది.ఈ మార్గంలో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వందలాది వాహనాలలో భక్తులు, ప్రయాణికులు ప్రయాణిస్తూండటంతో సమస్య మరింత పెరిగింది. రోడ్డు దెబ్బతిన్న కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. తక్షణమే నీరు పారేలా చర్యలు తీసుకోవాలని మరియు తక్షణమే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని ప్రజలు, భక్తులు అధికారులను కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

ఉపరాష్ట్రపతి అభ్యర్థులను ప్రధాని మోడీ ప్రకటన

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ ను ఎన్‌డిఏ నామినేట్ చేసింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో ప్రాంతీయ సమతుల్యత – రాష్ట్రపతి ఉత్తరాది నుంచి, ఉపరాష్ట్రపతి దక్షిణాది నుంచి. ప్రధాని మోడీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ప్రకటనకు స్వాగతం పలుకుతూ హైవే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో “Vocal for Local” నినాదాన్ని మళ్లీ ప్రస్తావించారు. ఎన్నికల సంఘం – అన్ని పార్టీలకు సమాన హక్కులు ఉంటాయని, 18 ఏళ్లు నిండిన ప్రతివారికి ఓటు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. సిక్కిం–కాలింపాంగ్‌ను కలిపే NH-10 మళ్లీ ప్రారంభం, భూస्खలనంతో మూసివేత తరువాత. ముంబైలో దేశంలోని తొలి అన్ని మహిళలు నడిపే క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్ ను పీయూష్ గోయల్ ప్రారంభించారు. మాజీ అంతరిక్ష యాత్రికుడు శుభాంశు శుక్లా భారత్‌కు తిరిగొచ్చారు – ఢిల్లీలో ఘనస్వాగతం, ప్రధాని మోడీతో భేటీ.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.