శ్రీకాళహస్తి, మే 01 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పాండురంగస్వామి అగ్నిగుండ మహోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా నిర్వహించబడ్డాయి. కార్యకర్తల ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తొట్టంబెడు మండలం చియ్యవరం, కొన్నలి, ఏర్పేడు మండలం పాగాలి, అలాగే శ్రీకాళహస్తి రూరల్ మండలం గొల్లపల్లి, ముచ్చివోలు హరిజనవాడ గ్రామాల్లో నిర్వహించిన అగ్నిగుండ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఆయా గ్రామాల పాండురంగస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ, మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ఇటువంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అగ్నిగుండంలో నడిచే భక్తుల విశ్వాసం, భక్తిశ్రద్ధలను ఆయన ప్రశంసించారు. ఈ పర్యటనలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్ర మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కూనాటి నాగరాజు, మండల అధ్యక్షులు భగీర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

అగ్నిగుండ మహోత్సవాల్లో భక్తి వెలుగు – కోలా ఆనంద్ పర్యటన