Friday, 1 May 2026
  • Home  
  • జనసేన ఆధ్వర్యంలో మేడే సేవా కార్యక్రమం – మహిళా కార్మికులకు చీరల పంపిణీ
- తిరుపతి

జనసేన ఆధ్వర్యంలో మేడే సేవా కార్యక్రమం – మహిళా కార్మికులకు చీరల పంపిణీ

శ్రీకాళహస్తి, మే 01 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై, తన చేతుల మీదుగా కార్మికులకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమని, వారికి గౌరవార్థంగా ఆలయ ప్రాంగణంలో సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రజా సేవలో ముందుండాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసే కార్మికులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.