Monday, 11 May 2026

Blog

అన్నమయ్య

పెద్దూరులో నందీశ్వరుడికి వెండి నాగపడిగలు సమర్పణ

చిట్వేలు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలోని పెద్దూరు గ్రామంలో శివాలయంలో వెలసిన నందీశ్వరుడికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కస్తూరి కోటేశ్వర చౌదరి వెండి నాగపడిగలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాధ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, పెద్దూరు గ్రామ ప్రజలు, ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు మరియు పలువురు నాయకులు కలిసి కస్తూరి విశ్వనాధ నాయుడు గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి అనేక మంది ముఖ్య నాయకులు, బంధుమిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తిరుపతి

ఏఎస్ఐ గా జిల్లాకోర్టు లైజనింగ్ అధికారి గోపాల్ రాజ్.

శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా కోర్ట్ లైజనింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న గోపాల్ రాజు పోలీస్ శాఖ ఏఎస్ఐ గా పదోన్నతిని పొందారు.ఈ సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో ప్రముఖ న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కుంట్రపాకు సురేంద్రబాబు ముదిరాజ్, న్యాయవాదులు పి.వెంకటాద్రి,కెవి రమణయ్య, భీమేశ్వరి,జనార్ధన్,కాకి చిన్న అంకయ్య,షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పైన తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహ పునాదికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నగర మేయర్ గారితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

సినిమా

మెగాస్టార్ చిరంజీవి 157 వ సినిమా టైటిల్ చెప్పేసిన అనిల్ రావిపూడి.

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరు స్కూల్ లో పిల్లలకు ఆటలు నేర్పించే డ్రిల్ మాస్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా ఈ సినిమా టైటిల్ లో తాజాగా ఓ టీవీ ఛానెల్ లో జరిగిన ఈవెంట్ లో మెగా డాటర్ కమ్ నిర్మాత సుస్మిత కొణిదెలతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా పాలొగొన్నాడు. ఈ ఈవెంట్ లో మెగా 157 టైటిల్ ను ‘మన శంకరవరప్రసాద్ గారు’ అని చెప్పకనే చెప్పేసాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో శంకర వరప్రసాద్ అనే పాత్రలో చిరు కనిపించబోతున్నాడు అని, వచ్చే సంక్రాంతికి ఈ సినిమాకు రిలీజ్ చేస్తాం అని తెలిపాడు. దాంతో పాటు మరో కీలక అప్డేట్ కూడా ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఈ నెల 22న మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ను కూడా రిలీజ్ చేస్తామని తెలిపాడు. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కర్నూలు

*డా. బి. ఆర్.అంబేద్కర్ గారి భవన నిర్మాణం కొరకు కేటాయించిన స్థలములో మున్సిపాలిటీ వారు ఈ స్థలము మున్సిపాలిటీకి చెందినది అని పాతి పెట్టిన బోర్డు

పున్నమి ప్రతినిధి కర్నూల్ జిల్లా ఆగస్టు *తేదీ:18-08-2025* , *ఎమ్మిగనూరు* . *డా. బి. ఆర్.అంబేద్కర్ గారి భవన నిర్మాణం కొరకు కేటాయించిన స్థలములో మున్సిపాలిటీ వారు ఈ స్థలము మున్సిపాలిటీకి చెందినది అని పాతి పెట్టిన బోర్డును తొలగించాలని మరియు ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు ఉన్నటువంటి సచివాలయమును తొలగించి ఎస్సీ కమ్యూనిటీ ప్రజల ఉపయోగ కొరకు అప్పగించాలని, యెమ్మిగనూరు లెదర్ సొసైటీ లో వర్కర్స్ కు జరిగిన అన్యాయం పై CBI ఎంక్వయిరీ వేయాలని,PGRS లో DRO గారికి వినతిపత్రం* *అందజేత*. ఎమ్మిగనూరు పట్టణమునందుగల ఎస్సీ కమ్యూనిటీ హాల్ మరియు భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం కు సంబంధించి BCRF ( బహుజన సివిల్ రైట్స్ ఫోరం ) సభ్యులు మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో DRO గారిని కలిసి సమస్యలను పరిష్కరించాలని కొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం అయినది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణం కొరకు కేటాయించినటువంటి స్థలములో మున్సిపాలిటీ వారు ఉంచినటువంటి బోర్డును వెంటనే తొలగించి, భవన నిర్మాణం కొరకు కేటాయించినటువంటి స్థలమును సర్వేర్ ద్వారా కొలిపించి హద్దులు చూపించి ప్రహరి గోడను నిర్మించి భవన నిర్మాణం కొరకు కేటాయించిన 60 లక్షల రూపాయల బడ్జెట్ను సద్వినియోగ పరచి భవన నిర్మాణాన్ని చేపట్టాలని, మరియు ఎస్సీ కమ్యూనిటీకి గత 30 సంవత్సరముల క్రితం కేటాయించబడినటువంటి కమ్యూనిటీ హాల్ లో నిర్వహించబడుతున్న సచివాలయాలను తొలగించి ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు వివిధ కార్యక్రమాలను నిర్వహించుకొనుటకు కమ్యూనిటీ ప్రజలకు హాల్ ను అప్పగించాలని,లెదర్ సొసైటీ లో వర్కర్స్ కు జరిగిన అన్యాయం పై CBI ఎంక్వయిరీ చేయాలనీ అధికారులకు తెలియజేశారు. ఇందుకు అధికారులు సానుకూలంగా స్పందించి త్వరితగతిన సమస్య పరిష్కారం కొరకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవన నిర్మాణ ఐక్య కార్యచరణ సభ్యులు బి సి ఆర్ ఎఫ్ ప్రతినిధులు k. సునీల్ కుమార్, పల్లవి దిలీప్ కుమార్, AP MRPS నాయకులు పార్లపల్లి జయన్న, జై భీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు జడ రవి, ముత్తు సుమాల, సోగునూర్ ప్రశాంత్ కుమార్,నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు చార్లెస్, కడివేళ్ల రాజశేఖర్ తదితరులు వారు పాల్గొన్నారు.

ఖమ్మం

బి ఆర్ ఎస్ కి రాజీనామా. కాంగ్రెస్ లో చేరిక

పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో BRS తో పాటు వివిధ పార్టీలకు చెందిన 30 కుటుంబాలు రాజీనామా,కాంగ్రెస్ పార్టీలో చేరిక* మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు బి ఆర్ ఎస్ కి రాజీనామా కాంగ్రెస్ లో చేరిక లు ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి ) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం మంగాపురం తండా గ్రామం నుంచి బి ఆర్ ఎస్ పార్టీతో పాటు ఇతర పార్టీల కు చెందిన ముప్పై కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్టీలోకి వస్తున్న వారికి నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు,మాజీ మార్కెట్ చైర్మన్ శాఖమూరి రమేష్,కాంగ్రెస్ జిల్లా నాయకులు కొడాలి గోవింద రావు కాంగ్రెస్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని వారు తెలిపారు.త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం గా ప్రతి ఒక్కరూ పని చేయాలని వారు అన్నారు. ఈకార్యక్రమంలో మంగాపురం తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీలో పార్టీలో చేరిన వారిలో చినతండ గ్రామ BRS అధ్యక్షులు తేజవతు కోటేశ్వరరావు,మంగాపురం తండా గ్రామ BRS పార్టీ కార్యదర్శి భూక్యా కృష్ణ,భూక్యా సునీల్,పాల్తీయ వేణు గోపాల్, తేజవత్ నాగరాజు,వెంకట,బాణోతూ భాస్కర్,గణేష్,నాగరాజు, తదితరులు ఉన్నారు

ఖమ్మం

లక్ష్మి నరసమ్మ కి నివాళి అర్పించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం జిల్లా బిజెపి నాయకులు పోతుల చంద్ర శేఖర్ నానమ్మ లక్ష్మి నర్సమ్మ యొక్క దశ దిన కార్యక్రమం సూర్యాపేట జిల్లా, మోతే మండలం, తుమ్మలపల్లి గ్రామం లో జరిగింది. ఈ కార్యక్రమం లో బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు చావ కిరణ్, ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్, ఖమ్మం టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ, పాసం శ్రీనివాస్ రెడ్డి, దాసరి మధు. రాఘవ తదితరులు పాల్గొన్నారు

కర్నూలు

తెలుగుదేశం పార్టీ తోనే అభివృద్ధి,సంక్షేమం:-తెలుగుదేశం పార్టీ గోనెగండ్ల*

*తెలుగుదేశం పార్టీ తోనే అభివృద్ధి,సంక్షేమం:-తెలుగుదేశం పార్టీ గోనెగండ్ల* *18-08-2025 న గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గోనెగండ్ల మండలం,గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతు తెలుగుదేశం పార్టీ తోనే సంక్షేమం,అభివృద్ధి అన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు,డ్రైనేజీలు మరియు సంక్షేమ పథకలతో మెగా DSC,దీపం పథకం ద్వారా ఫ్రీగా 3గ్యాస్ సిలిండర్లు,తల్లికి వందనం పథకంతో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికి 13,000రూపాయలు,అన్నదాత సుఖీభవ పథకంతో ప్రతి రైతుకు ఆర్థిక సహాయం,స్త్రీ శక్తి పథకంతో మహిళాలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లిన ఉచిత బస్సు ప్రయాణం ఇలాంటి ఎన్నో పథకలు ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తుంది అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మండలం,గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు……*

నాగర్‌కర్నూల్

“బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు”

నాగర్ కర్నూలు జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 18 నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మారేడుమామిడి గ్రామానికి సంబంధించిన సంపంగి వెంకటేష్ గారి భార్య అనారోగ్య సమస్యలతో మరణించినందున వారి కుటుంబానికి పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల చంద్రయ్య యాదవ్ గారు మరియు మారేడుమాన్ దిన్నే గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు గత కొద్ది రోజుల క్రితం మారేడుమాన్ దిన్నే గ్రామానికి చెందిన శ్రీ. సంపంగి వెంకటేష్ గారి సతీమణి అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగినది. ఈ సందర్భంగా మారేడుమాన్ దిన్నే గ్రామ కాంగ్రెస్ పార్టీ జూపల్లి కృష్ణారావు గారి ప్రధాన అనుచర వర్గీయులు సోదరభావంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి అందరూ కలిసి తమ సహాయార్థం గా రూ 10,000/- (పదివేలు) లను అందించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ… ఎల్లవేళలా తోడుంటామని భరోసా ఇవ్వడం జరిగినది.

నాగర్‌కర్నూల్

“అచ్చంపేట గిరిజన ఆదివాసులకు ROFR పట్టాలి ఇవ్వాలి”

నాగర్ కర్నూలు జిల్లా పున్నమి (ప్రతినిధి) ఆగస్టు 18 నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డివిజన్ ఆర్డీవో గారికి సోమవారం గిరిజన ఆదివాసులు ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూములకు పట్టాలు ఇప్పించాలని వినతి పత్రం ఇచ్చారు. అమ్రాబాద్ మండలం జంగం రెడ్డిపల్లి గ్రామ శివారులో కడ్లకుంట పోడు భూములకు సంబంధించి ఆర్వోఎఫ్ ఆర్ పట్టాలు 68 మందికి ఇవ్వాలని మా పూర్వీకులు కూడా వ్యవసాయం పై జీవించేవారని అచ్చంపేట ఆర్డిఓ గారికి విన్నవించుకున్నారు. జంగం రెడ్డిపల్లి గ్రామ గిరిజన ఆదివాసులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.