Monday, 11 May 2026

Blog

ఎలూరు

కామ్రేడ్ శివ నాగరాజు సేవలు మరవలేనివి

కామ్రేడ్ శివ నాగరాజు సేవలు మరవలేనివి ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి ఆగిరిపల్లి మండల సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చాకిరి శివ నాగరాజు మరణించడం పార్టీకి తీరని లోటు అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎ .రవి అన్నారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చాకిరి శివ నాగరాజు సోమవారం ఉదయం అనారోగ్యంతో మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. నెక్కలం గొల్లగూడెం లోని ఆయన స్వగృహం నందు భౌతిక కాయానికి పలువురు పార్టీ నాయకులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ నాగరాజు గత 19 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా పలు ప్రజా ఉద్యమాల్లో అంకితభావం తో పనిచేస్తూ సిపిఎం పార్టీ మండల కార్యదర్శిగా ఎదిగారన్నారు. ప్రస్తుతం చిన్నగిరిపల్లిలో ఆక్రమణకు గురైన దళితుల భూముల కోసం జరుగుచున్న భూపారాటంలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు అన్నారు. నాగరాజు కుటుంబాన్ని సిపిఎం పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి ఎన్ వి డి ప్రసాద్, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజు, లింగరాజు, సిపిఎం పార్టీ మండల నాయకులు సత్తు కోటేశ్వరరావు, జహంగీర్ భాష, పలువురు ప్రజా సంఘల నాయకులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

హైదరాబాద్

కార్పొరేట్ స్థాయి లో ఇంటిగ్రెటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు. ఈ నెల 20న గాచ్చిబౌలి లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేత శంకుస్థాపన: మంత్రి పొంగులేటి వెల్లడి

పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి స్థాఫ్ రిపోర్టర్ ఖమ్మం రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల‌కు వ‌చ్చే ప్రజ‌ల‌కు అత్యుత్తమ సేవ‌లు అందించ‌డానికి స్టాంప్ప్ & రిజిస్ట్రేష‌న్ల శాఖ‌లో విప్లవాత్మక‌మైన సంస్కర‌ణ‌లు చేపట్టాం..ఈ సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే ప‌లు మెరుగైన‌ సేవ‌లు అందుతున్నాయి. భ‌విష్య‌త్తులో అత్యుత్త‌మ‌ సేవ‌లు అందించ‌డానికి వీలుగా గౌర‌వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప్రజ‌ల‌కు సౌక‌ర్యవంతంగా ఉండేలా ప‌రిపాల‌న‌కు ఇబ్బంది లేకుండా అవసరమైన చోట సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల పునర్వ్యవస్థీకరించి ఇంటిగ్రేటెడ్ కార్యాల‌యాల‌ను నిర్మించబోతున్నాం. ఈ కార్యాలయాల వల్ల పనితీరు మెరుగుపడడమే కాకుండా పర్యవేక్షణ సులభమవుతుందని అవినీతిని కూడా తగ్గించవచ్చని, కార్యాలయాల మధ్య పనిభారం సమానంగా ఉండడంతో పాటు దస్త్రాల ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది. మొద‌టి ద‌శ‌లో హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల్లోని 39 స‌బ్‌ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను 11 స‌మీకృత భ‌వ‌నాల ప‌రిధిలోకి తీసుకురాబోతున్నాం.. రంగారెడ్డి ఆర్వో ఆఫీస్, గండిపేట, షేర్‌లింగంప‌ల్లి, రాజేంద్ర‌న‌గ‌ర్ నాలుగు ఆఫీసుల‌ను గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంగా నిర్మిస్తున్నాం.. ఈ ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఒక రోల్ మోడల్ గా తయారవుతుంది. గౌర‌వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ భ‌వ‌నానికి ఈనెల 20వ తేదీన శంకుస్ధాప‌న చేయ‌నున్నారు. శంకుస్దాప‌న‌కు సంబంధించిన ఏర్పాట్ల‌పై సోమ‌వారం నాడు అధికారుల‌తో సమీక్షించడం జరిగింది. అబ్దుల్లాపూర్‌, పెద్ద అంబ‌ర్ పేట్, హ‌య‌త్‌న‌గ‌ర్, వ‌న‌స్ధ‌లిపురం న‌కు సంబంధించి కోహెడ్ లో, మ‌హేశ్వ‌రం, ఇబ్ర‌హింప‌ట్నం, శంషాబాద్‌కు సంబంధించి మ‌హేశ్వ‌రం మండ‌లంలోని మంకాల్ లో, ఆర్వో మేడ్చ‌ల్‌, కుత్బుల్లాపూర్‌, కీస‌ర‌, శామీర్‌పేట్ కు సంబంధించి కండ్ల‌కోయ‌లో ఉప్ప‌ల్‌, నార‌ప‌ల్లి, కాప్రా, ఘ‌ట్‌కేస‌ర్‌, మ‌ల్కాజ్‌గిరికి సంబంధించి బోడుప్ప‌ల్ లో బంజారాహిల్స్‌, ఎస్‌.ఆర్‌. న‌గ‌ర్‌, గొల్కోండ‌కు సంబంధించి బంజారాహిల్స్‌లో, ఆజంపూరా, చార్మినార్, దూద్‌బౌలి సంబంధించి మ‌ల‌క్‌పేట‌లో ఇంటిగ్రేటెడ్ కార్యాల‌యాల‌ను నిర్మిస్తున్నాం. మ‌రో పదమూడు సబ్ రిజిస్టార్ కార్యాలయాల కోసం నాలుగు చోట్ల ఇంటిగ్రేటెడ్ భవనాల కోసం స్ధ‌లాల‌ను గుర్తించాల‌ని ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజ‌ల స‌మ‌యాన్ని ఆదా చేసే విధంగా పార‌ద‌ర్శకంగా, అవినీతి ర‌హితంగా సేవ‌లు అందించేలా రాష్ట్రంలోని అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానం విజయవంతంగా అమలవుతుంది. రాష్ట్రంలోని 144 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ఏప్రిల్ 10వ తేదీ నుంచి ద‌శ‌ల వారీగా జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమ‌లు చేస్తున్నాం..ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 3 ల‌క్ష‌ల స్లాట్ బుకింగ్‌లు న‌మోద‌య్యాయి.

ఖమ్మం

సుభాష్ చంద్ర బోస్ వర్ధంతి నివాళులు

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి నేలకొండపల్లి మండలం బిజెపి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ అధ్యక్షత న నేతాజీ సుభాస్ చంద్ర బోస్ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శులు మెల్లబోయిన గోవిందరావు బాజా రామకృష్ణ మండల ఉపాధ్యక్షుడు కొండ హర్షవర్ధన్ గౌడ్ నేలకొండపల్లి బూత్ అధ్యక్షుడు దేశబోయిన వేణుబాబు మండల నాయకులు మండల నాయకులు మూడు రమేష్ తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చేజర్ల మండలంలో ఆధార్ స్పెషల్ క్యాంపులు.. ఎంపీడీవో అమర్

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలంలో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అమర్ తెలిపారు. ఈనెల 19 నుంచి 30 వరకు వివిధ సచివాలయాలలో క్యాంపులు జరుగుతాయని ఆయన తెలిపారు. ఆగస్టు 19 నుంచి 21 వరకు తూర్పుపల్లి, ఏటూరు సచివాలయాల్లో, 22 నుంచి 23 వరకు పాడేరు, ఆదురుపల్లి సచివాలయాలలో, 28 నుంచి 29 వరకు పాతపాడు, వావిలేరు సచివాలయాలలో నిర్వహించనున్నారు. 0–6 సంవత్సరాల పిల్లలకు నూతన ఆధార్ కార్డులు, బయోమెట్రిక్ అప్డేట్ సదుపాయం ఉంటుందని తెలిపారు. మండల వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్

ఎ.పి లో పింఛ‌న్ల కోసం రోడ్డెక్కిన దివ్యాంగులు

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : ఎ.పి లో పింఛ‌న్ల కోసం రోడ్డెక్కిన దివ్యాంగులు. చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నిరసన చేప‌ట్టిన దివ్యాంగులు. మేమంతా నిజమైనా దివ్యాంగుల‌మే అంటూ స‌ద‌రం స‌ర్టిఫికెట్‌తో గ‌గ్గోలుపెట్టిన దుస్థితి. కూటమి ప్రభుత్వం అన్యాయంగా పింఛ‌న్ల కోత విధించింద‌ని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ధర్నా. దివ్యాంగుల వద్ద వినతులు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ.

ఖమ్మం

తెలుగు తేజం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

పున్నమి Daily న్యూస్ ప్రతినిధి: T.రవీందర్ ఖమ్మం మొఘలుల ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్* మొఘలుల ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం, గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధీఅసశాలి, ఔరంగజేబు కే ముచ్చెమటలు పట్టించిన వీరుడు, పేదల పాలిట పెన్నిధి, సమ సమాజ స్థాపకుడు, సమ సమాజ స్థాపనకు ప్రాణాలనే అర్పించిన యోధుడు, చత్రపతి శివాజీ మహారాజ్ కి సమకాలికుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకులు బోయనపల్లి సురేష్ గౌడ్ అన్నారు. ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1650 లో పూర్వపు వరంగల్ జిల్లాలో జన్మించిన పాపన్న గౌడ్ తన కులవృత్తిని చేసుకుంటూ మొఘల్ రాజులు చేస్తున్న ఆకృత్యాలను, దారుణాలను సహించలేక సామాన్య ప్రజలనే యుద్ధ వీరులుగా, గెరిల్లా దళంగా తయారు చేసి మొగల్ రాజులపై తిరుగుబాటు చేసి ఎన్నో కోటలను స్వాధీన పరుచుకున్న యోధుడు అని తెలిపారు. దానిలో భాగంగానే గోల్కొండ కోటపై తన జెండాను ఎగురవేసి తన రాజ్య కాలంలో బడుగు, బహుజనుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారనీ కొనియాడారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని కులవృత్తులను ఐక్యం చేసి ముందుకు కదిలిన వీరుడు అని అన్నారు. పాపన్న గౌడ్ గురించి కేం బ్రిడ్జి ప్రెస్ బుక్ లో ప్రత్యేకంగా ప్రస్తావన చేసారని, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం లండన్ లోని “విక్టోరియా అండ్ ఆల్బర్ట్” మ్యూజియంలో సర్ధార్ పాపన్న మహారాజ్ శాశ్వత శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాంటి మహానుభావుని యొక్క 375 వ జయంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నామనీ, ఈ జయంతి సందర్భంగా ప్రపంచ తెలుగు ప్రజలందరికీ వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సాధించే విధంగా కార్యాచరణ చేసుకొని బడుగు, బలహీన వర్గాలు అందరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఖమ్మం

తెలుగు తేజం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

పున్నమి Daily న్యూస్ ప్రతినిధి: T.రవీందర్ ఖమ్మం మొఘలుల ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్* మొఘలుల ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం, గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధీఅసశాలి, ఔరంగజేబు కే ముచ్చెమటలు పట్టించిన వీరుడు, పేదల పాలిట పెన్నిధి, సమ సమాజ స్థాపకుడు, సమ సమాజ స్థాపనకు ప్రాణాలనే అర్పించిన యోధుడు, చత్రపతి శివాజీ మహారాజ్ కి సమకాలికుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకులు బోయనపల్లి సురేష్ గౌడ్ అన్నారు. ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1650 లో పూర్వపు వరంగల్ జిల్లాలో జన్మించిన పాపన్న గౌడ్ తన కులవృత్తిని చేసుకుంటూ మొఘల్ రాజులు చేస్తున్న ఆకృత్యాలను, దారుణాలను సహించలేక సామాన్య ప్రజలనే యుద్ధ వీరులుగా, గెరిల్లా దళంగా తయారు చేసి మొగల్ రాజులపై తిరుగుబాటు చేసి ఎన్నో కోటలను స్వాధీన పరుచుకున్న యోధుడు అని తెలిపారు. దానిలో భాగంగానే గోల్కొండ కోటపై తన జెండాను ఎగురవేసి తన రాజ్య కాలంలో బడుగు, బహుజనుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారనీ కొనియాడారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని కులవృత్తులను ఐక్యం చేసి ముందుకు కదిలిన వీరుడు అని అన్నారు. పాపన్న గౌడ్ గురించి కేం బ్రిడ్జి ప్రెస్ బుక్ లో ప్రత్యేకంగా ప్రస్తావన చేసారని, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం లండన్ లోని “విక్టోరియా అండ్ ఆల్బర్ట్” మ్యూజియంలో సర్ధార్ పాపన్న మహారాజ్ శాశ్వత శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాంటి మహానుభావుని యొక్క 375 వ జయంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నామనీ, ఈ జయంతి సందర్భంగా ప్రపంచ తెలుగు ప్రజలందరికీ వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సాధించే విధంగా కార్యాచరణ చేసుకొని బడుగు, బలహీన వర్గాలు అందరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఖమ్మం

సర్వాయి పాపన్న గౌడ్ జయంతి.. బిజెపి నేతల నివాళి

ఈ రోజున శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాలు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటీశ్వరరావు ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లగట్టు ప్రవీణ్, నేరెళ్ల శ్రీనివాస్ జ్వాలా నరసింహారావు, గుత్తా వెంకటేశ్వరరావు, మందడపు ప్రభాకర్ రెడ్డి, మందడపు సుబ్బారావు, మేకల నాగేందర్, మంద సరస్వతి,బోయినపల్లి చంద్రశేఖర్, దార్ల శంకర్ గౌడ్, రుద్ర గాని మాధవ్ గౌడ్, నక్కల రవి గౌడ్, బోయినపల్లి ప్రభాకర్ గౌడ్, బోయినపల్లి సురేష్ గౌడ్, వీరవల్లి రాజేష్, తోడుపునూరి రవీందర్, యార్లగడ్డ రాఘవరావు, చిన్ని కృష్ణ, కందుల శ్రీకృష్ణ, మహేందర్ సింగ్, కృష్ణ చారి, వెంకట్ వాకా దాని రామకృష్ణ నాగమణి, రజిని రెడ్డి, గోలి పణి కుమారి,పాలేపు రాము, మంద రామారావు, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నమయ్య

విద్యార్థులకు శక్తి టీం అవగాహన కార్యక్రమాలు

రాయచోటి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్ బృందాలు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలు, ఈవ్ టీజింగ్, ప్రేమ పేరుతో మోసాలు, మహిళలపై నేరాలు వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. అలాగే డయల్ 112 అత్యవసర సేవలు, శక్తి యాప్ వినియోగం గురించి వివరించారు.ముఖ్యంగా విద్యార్థినులకు స్వీయ రక్షణ పద్ధతులు, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తు కోసం క్రమశిక్షణతో ప్రవర్తించే విధానాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఎలాంటి సమస్య వచ్చినా 112 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ అవగాహన కార్యక్రమాలు పలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలల్లో విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

అన్నమయ్య

కోడూరు మండలంలో శ్రీ శక్తి ఫ్రీ బస్ పథకం ప్రారంభం

పెనగలూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) కోడూరు నియోజకవర్గం ప్రజలకు ఉపయోగపడే విధంగా ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ శక్తి ఫ్రీ బస్ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు మదన్ మాట్లాడుతూ – “ప్రజలకు మేలు చేసే ఈ పథకం ప్రారంభించడం ఆనందదాయకం. రవాణా సౌకర్యం లేని ప్రాంత ప్రజలకు ఇది ఎంతో ఉపయుక్తం కానుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని నా ఆకాంక్ష” అని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.