Monday, 11 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన 21 నుంచి

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : మెగా డీఎస్సీలో ప్రతిభచూపిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల 21 లేదా 22 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. డీఎస్సీ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పిం చింది. అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి, అనంతరం స్కోర్ కార్డులనువిడుదల చేసింది. గతంలో ఇచ్చినట్లు డీఎస్సీలో టాపర్లు కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి, సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు. పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు. సెప్టెంబరు నెల మొదటి వారంలోపు జాబితాలను సిద్ధం చేయనున్నారు. రెండో వారంలో పోస్టింగ్లు ఇవ్వాలని భావిస్తున్నారు.

హైదరాబాద్

తెలంగాణ బంద్..

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్రము మార్వాడి లు చేస్తున్న దాడులకి నిరసనగ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఈ నెల 22 న తెలంగాణ బంద్ కి పిలుపు నిచ్చింది. గుజరాత్, రాజస్థాన్ ల నుండి తెలంగాణ కి వలసలు వచ్చి ఇక్కడి చేతి వృత్తుల వారిని దెబ్బ తీస్తున్నారని, తెలంగాణ ప్రజలని మార్వాడి లు దోచుకుంటున్నారు అని ఆరోపించారు. గో బ్యాక్ మార్వడి నినాదం ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకోని పోవాలి అని విజ్ఞప్తి చేశారు

హైదరాబాద్

తెలంగాణ బంద్..

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్రము మార్వాడి లు చేస్తున్న దాడులకి నిరసనగ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఈ నెల 22 న తెలంగాణ బంద్ కి పిలుపు నిచ్చింది. గుజరాత్, రాజస్థాన్ ల నుండి తెలంగాణ కి వలసలు వచ్చి ఇక్కడి చేతి వృత్తుల వారిని దెబ్బ తీస్తున్నారని, తెలంగాణ ప్రజలని మార్వాడి లు దోచుకుంటున్నారు అని ఆరోపించారు. గో బ్యాక్ మార్వడి నినాదం ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకోని పోవాలి అని విజ్ఞప్తి చేశారు

ఖమ్మం

ఖమ్మం లో భారీ వర్షం

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతి నిధి ) తెలంగాణ లో భారీ వర్షా సూచనతో ఖమ్మం నగరం తో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంగళవారం తెల్లవారు జాము నుండే భారి వర్షం పడుతుంది. అత్యవసర మైతే తప్ప ప్రజలు బయట కి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యా సంస్థ లకి సెలవులు ఇవ్వాలని తల్లి దండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్

ఆగస్టు 22 వరకు వాతావరణం చల్లగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి!

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : ఈరోజు నుండి ఆగస్టు 22 వరకు వాతావరణం గత సంవత్సరం కంటే చల్లగా ఉంటుంది. దీన్ని అప్హెలియన్ (Aphelion) ఫినామినాన్ అని అంటారు. ఇది ఈరోజు ఉదయం 5:00 గంటల నుండి 7:00 గంటల మధ్య ప్రారంభమవుతుంది. మనం ఈ అప్హెలియన్ ఫినామినాన్‌ను కేవలం గమనించడమే కాకుండా అనుభవిస్తాము కూడా. ఇది ఆగస్టు 22, 2025 న ముగుస్తుంది. ఈ సమయంలో మునుపెన్నడూ అనుభవించని విధంగా చల్లని ఉష్ణోగ్రతలు ఉండవచ్చు. దీని కారణంగా శరీర నొప్పులు, గొంతు రాపిడి, జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు. కాబట్టి విటమిన్లు మరియు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం మంచిది. సాధారణంగా సూర్యుడు మరియు భూమి మధ్య దూరం 90,000,000 కి.మీ. ఉంటుంది. కానీ ఈ అప్హెలియన్ ఫినామినాన్ సమయంలో ఆ దూరం 152,000,000 కి.మీ.కి పెరుగుతుంది, ఇది 66% పెరుగుదల. దయచేసి ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సన్నిహితులతో పంచుకోండి. ఇది భయం కలిగించడానికి కాదు, మనం అనుభవించబోయే భౌగోళిక పరిస్థితులను తెలియజేయడానికే. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌ శాఖ వారీ హెచ్చరిక ! 1912 నంబర్‌కి సమాచారం ఇవ్వండి.

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : విద్యుత్‌ శాఖ వారీ హెచ్చరిక వర్షాలకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు వర్షపు వేళ విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఎలక్ట్రిక్‌ తీగలు, ఇతర పరికరాల దగ్గర గుమికూడకండి. తడి చేతులతో ఎలక్ట్రిక్‌ స్విచ్‌ ఆన్‌/ఆఫ్‌ చేయకండి. ఇళ్లలో తడి నేలపై ఎలక్ట్రిక్‌ తీగలు, పరికరాలు పడకుండా జాగ్రత్తపడండి. వర్షాకాలంలో ఇంటి వద్ద ఇనుప రాడ్లు, సిమెంట్‌ రాడ్లు, టిన్‌ షీట్లు వంటివి బహిరంగ ప్రదేశాల్లో ఉంచకండి. ఎక్కడైనా విద్యుత్‌ తీగలు తెగి పడివుంటే, వాటిని తాకవద్దు. వెంటనే 1912 నంబర్‌కి సమాచారం ఇవ్వండి. వర్షంలో తెగి పడిన తీగలు, చెట్లపై పడివున్నా, వాహనాలపై పడివున్నా దగ్గరగా వెళ్లవద్దు. తెగి పడిన తీగలు, పరికరాలు కనిపిస్తే 1912 నంబర్‌కి సమాచారం ఇవ్వండి. ఇళ్లలో ఎలక్ట్రిక్‌ పరికరాలు వాడిన తర్వాత స్విచ్‌ ఆఫ్‌ చేయడం అలవాటు చేసుకోండి. వర్షపు నీటితో నిండిన ప్రదేశాల్లో, పొలాల్లో, రోడ్లలో ఉన్న ఎలక్ట్రిక్‌ లైన్ల దగ్గర తిరగవద్దు. విద్యుత్‌ తీగలు, స్తంభాల దగ్గర గుడారాలు, షెడ్‌లు, టెంట్లు వేశాకూడదు. పిల్లలు ఎలక్ట్రిక్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర ఆడకూడదు. వర్షాకాలంలో ఇంటి లోపలికి వచ్చే కరెంట్‌ షాక్‌లను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంటిలో ఫ్యూజ్‌ లైన్లు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోండి. తడి బట్టలు, తడి చేతులతో విద్యుత్‌ తీగలు, స్విచ్‌లను తాకవద్దు. వర్షాకాలంలో మోటార్‌ వాడకం తగ్గించాలి. విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం టోల్‌ ఫ్రీ 1912 నంబర్‌కి కాల్‌ చేయండి. శ్రీ పి. పుల్లా రెడ్డి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ

జాతీయ అంతర్జాతీయ

ఒడిశా రాష్ట్రంలో భారీగా బంగారు నిక్షేపాలు.!

ఆగస్టు 19పున్నమి ప్రతినిధి : ఒడిశా రాష్ట్రంలో భారీగా బంగారు నిక్షేపాలు.! 20 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక.. బంగారం మైనింగ్ కు సంబంధించి ఒడిశా ప్రభుత్వం శరవేగంగా పనులను నిర్వహించినట్లుగా సమాచారం. ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో బంగారం దిగుమతి చేసుకునే భారతదేశంకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. త్వరలోనే వేలం నిర్వహించి.. తవ్వకాలకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

హెల్త్ టిప్స్

భారీ వర్షాల నేపథ్యంలో అంటు వ్యాధులపై దృష్టి పెట్టాలి…మంత్రి సత్యకుమార్ అదేశాలు.

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : అంటు వ్యాధుల నియంత్రణ చర్యల్లో వేగాన్ని పెంచాలి ! సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మంత్రి సత్యకుమార్ అదేశాలు భారీ వర్షాల నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలను త్వరితగతిన తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా గుర్తించిన ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాల్లోని తాజా పరిస్థితులపై అధికారులు మంత్రికి సోమవారం వివరించారు. వెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు ప్రజలకుండా ఉండేందుకు ఇతర శాఖలతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వచ్చేనెల వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నందున అంటు రోగాల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో అలసత్వానికి తావివ్వొద్దన్నారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మండలాల వారీగా కేసుల నమోదు తీరుపై సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా తాగునీరు కలుషితం కాకుండా చూసినట్లయితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయన్నారు. గ్రామాల్లో పనిచేసే సీహెచ్ ఓలు జిల్లా అదికారులు నిర్దేశించిన సమయాల్లో తాగునీటి నమూనాలు, సేకరించి పరీక్షలు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నీటి ఫలితాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మున్సిపల్, పంచాయతీ, గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వైద్యుల సూచించిన మేరకు ప్రసవ తేదీలాధారంగా గర్భిణుల వివరాలు సేకరించి, వారికి వైద్య సేవలు సకాలంలో అందడంలో ఎటువంటి అవరోధం రాకుండా చూడాలని మంత్రి సర్యకుమార్ సూచించారు. ఇందుకు ఆశా, ఎ.ఎన్.ఎం.ల సహకారం తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గతానుభవాల్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు పటిష్టంగా తీసుకుంటున్నామన్నారు. అవసరాలకనుగుణంగా వాడుకునేందుకు కూడా అంబులెన్సులను మ్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు

జాతీయ అంతర్జాతీయ

మాజీ సీఎం వైఎస్ జగన్‍కు కేంద్ర మంత్రి రాజ్‍నాథ్ సింగ్ ఫోన్

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : మాజీ సీఎం వైఎస్ జగన్‍కు కేంద్ర మంత్రి రాజ్‍నాథ్ సింగ్ ఫోన్. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని రాజ్‍నాథ్ సింగ్ ఫోన్.. బీజేపీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్న జగన్.. బీజేపీ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించే అవకాశం.. ఇటీవలే రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేసిన జగన్.

ఆంధ్రప్రదేశ్

ఈరోజు నుంచే ఏపీలో పీ4 పథకం ప్రారంభం.

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : పీ4 స్కీమ్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 స్కీమ్. తొలిదశలో 15 లక్షల బంగారు కుటుంబాల ఎంపికపై ప్రభుత్వం ఫోకస్. మార్గదర్శిల ఎంపికపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి. పీ4 సంబంధిత మార్గదర్శిలతో ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీలు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.