Monday, 11 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

గ్రామాలలో ఏరులై పారుతున్న మద్యం..?రైడ్ చేయేడానికి జంకుతున్న ఎక్ససెంజ్ శాఖ…బెల్ట్ షాపులపై ప్రేమ ఎందుకో…/// గ్రామాలలో 3 పెగ్గులు 6 గ్లాసులుగా బెల్ట్ షాప్ లు ..///

ఉదయగిరి పున్నమి న్యూస్ ఆగస్టు :/// ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు,మండలం, భైరవరం, వరికుంటపాడు మండలం, జి కొండారెడ్డిపల్లి, గువ్వాడి ,ఉదయగిరి మండలం అప్పసముద్రం,గ్రామాల,పల్లెల్లో బెల్ట్‌షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, మారుమూల గ్రామాలు మత్తులో జోగుతున్నాయి. గ్రామాలు, తండాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్‌ దుకాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అనేక మంది బెల్ట్‌ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కాపురాలు వీధిపాలవుతున్నాయి.ఎనీ టైం మద్యం…? అక్రమ బెల్టు దుకాణాలతో, పలు గ్రామాల్లో పల్లెల్లో మద్యం మందు బాబులకు చేరువైంది. కొన్ని గ్రామాలలో మద్యం డోర్ డెలివరీ కూడా అమలు చేస్తున్నారని సమాచారం. బెల్ట్ షాపుల్లో 24 గంటలు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మందుబాబులు తెల్లవారుజాము నుంచే, ఆయా గ్రామాల షాపుల వద్ద బహిరంగనే మద్యం సేవిస్తున్న, అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. బెల్ట్ షాపు ద్వారా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అమ్మేవారు కూడా, తాము అధికారులను, ప్రసన్నం చేసుకునే విక్రయాలను జరుపుకుందామని చెబుతుండడం విశేషం..! బెల్ట్ దుకాణాల బెడదపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని, ఆయా ప్రాంతాల ప్రజలు, మండిపడుతున్నారు. బెల్ట్ షాపులు యదేచ్చగా నడుస్తున్న మొక్కుబడి కేసులతో ఎక్స్చేంజ్ అధికారులు సరిపెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దాడుల్లో పట్టుబడ్డ మద్యం ఏ షాపుల్లో నుంచి వచ్చిందో, మూలాలను కనుక్కొని వాటిపై చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందిస్తారు లేదో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది..?పేరుకే కిరాణం.. అమ్మేది మద్యమే..!అనేకమంది పేరుకు కిరాణా దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. సొంత ఇళ్లలో పెద్ద ఫ్రిడ్జులు పెట్టుకొని మరీ విక్రయిస్తున్నారు. వైన్‌షాపుల యజమానులు కారుల ద్వారా మద్యాన్ని ఊరూరా సరఫరా చేస్తున్నారు. తమకు కేటాయించిన గ్రామాలకు నిత్యం కారుల ద్వారా పంపించి అమ్ముతున్నారు. మద్యం మత్తులో ఇళ్ల మధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో బెల్ట్‌ షాపుల కారణంగా మద్యం ఏరులై పారుతోంది.పచ్చని సంసారాల్లో చిచ్చు…!మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. ఊరూరా బెట్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీంతో పొద్దంతా పనిచేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు నిర్వహిస్తుండటంతో యువత పెడదారి పడుతోన్నారు. ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు విపిస్తున్నాయి.పనికి వెళ్లకుండా పగలే తాగుతున్నారుఊళ్లో బెల్ట్‌షాపులు ఏర్పాటు కావడంతో చాలా మంది పనికి వెళ్లకుండా పగలే తాగుతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. పట్టించు కోవాల్సిన ఎక్స్చేంజ్ శాఖ అధికారులు పత్తా లేకుండా పోయారు. దీంతో పరిస్థితి దారుణంగా మారింది..బెల్ట్‌షాపులపై చర్యలు తీసుకోవాలి…/ మా ఊళ్లో బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేశారు. కిరాణ షాపుల్లో మద్యం అమ్ముతున్నారు. దీంతో గ్రామంలో గొడవలు జరుగుతున్నాయి. పచ్చని సంసారాలు నాశనం అవుతున్నాయి. అధికారులు స్పందించాలి. బెల్ట్‌షాపులు గ్రామంలో లేకుండా చర్యలు తీసుకోవాలి. సీఎం ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న అధికారులు..అక్రమ బెల్ట్ షాపులను నిర్వహించేవరకు కఠిన చర్యలు తీసుకోవాలని, కచ్చితంగా కేసులు బుక్ చేయాలని, సీఎం చంద్రబాబు నాయుడు సూచించిన, అక్రమ బెల్ట్ షాప్ లో ఉపేక్షించేది లేదని ఎన్నో సమావేశంలో తెలిపారు. కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ అధికారులు తీరుపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్

పెన్షన్ రద్దు /మార్పు అప్పీల్ గురించి సమాచారం

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పుతో నోటీసు పొందిన వారు ఏదైనా అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే ఎంపీడీఓ కార్యాలయంలో దిగువ డాక్యుమెంట్స్ అందించి అప్పీల్ చేసుకోవచ్చు. 1.అప్పీల్ కోరుతూ అర్జీ(ఎంపీడీఓ గారికి రాయాలి) 2.ఆధార్ కార్డు జిరాక్స్. 3.పెన్షన్ రద్దు /పెన్షన్ మార్పు నోటీసు 4.సదరం సర్టిఫికేటు (పాతది) 5.సదరం సర్టిఫికేట్ (కొత్తది) అలాగే పెన్షన్ దారునికి సంబంధించిన ఏవైనా హాస్పిటల్ చికిత్స పొందిన/పొందుతున్న డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అవి. అప్పీల్ చేసుకున్న వారికి ఎంపీడీఓ గారి లాగిన్ నుండి మరొకసారి Reassement (పునఃమూల్యాంకనం)కు నోటీసు జారీ చేస్తారు. పింఛను దారులు మరొకసారి Reasssement(పునఃమూల్యాంకనం) కొరకు హాజరు కావాల్సి ఉంటుంది. ముఖ్య గమనిక అప్పీల్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు.ఎంపీడీఓ గారి ద్వారా Reassesment (పునఃమూల్యాంకనం)కు వెళ్ళమని నోటీసు ఇచ్చిన తర్వాత నిర్దేశించిన హాస్పిటల్ కు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.

తిరుపతి

హాస్పిటల్ దగ్గర వికలాంగుల బాధలు

సూళ్లూరుపేట నియోజకవర్గం పున్నమి ప్రతినిధి బోగస్ పెన్షన్ ఎత్తివేసే క్రమంలో అర్హులైన వారిని కూడా తీసివేసారు, ఈ క్రమంలో పెన్షన్ దారులు అందరు మండల అధికారులు చుట్టూ మరియు గవర్నమెంట్ హస్పిటల్స్ దగ్గర జన సందోహంగా మారారు, కొందరికి అయితే 2006 నుంచే పెన్షన్ వస్తుంది మాకు అప్పుడు ఇచ్చిన సర్టిఫికెట్ మరియు గుర్తింపు కార్డు కూడా ఉంది కానీ మాకు పెన్షన్ తొలగించారు అని పెన్షన్ దారులు వాపోయారు ఈ విషయం ప్రభుత్వం గమనించి మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నారు.

తిరుపతి

అర్హత ఉన్నా పెన్షన్ రద్దు

శ్రీ కాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం,కొత్త కండ్రిగ గ్రామంలోని ఓ నిరుపేద మహిళకు 90 శాతం పైగా అంగవైకల్యం ఉన్నా పెన్షన్ నిలిపివేశామంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.అటు నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో పెన్షన్ దారులలో ఆందోళన మొదలైంది.కింది స్థాయి అధికారులు పై స్థాయి అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే ఈ పరిస్థితి ఉందంటూ విమర్శలు వస్తున్నాయి.అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం! చివరి తేదీ ఆగస్టు 25

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : కౌశలం( వర్క్ ఫ్రమ్ హోమ్) నమోదుకు చివరి తేదీ ఆగస్టు 25 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా నుంచి పి. జి., వరకు ఏ విద్యా అర్హత కలిగి ఉన్న సరే వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయంను మీ విద్య అర్హత సర్టిఫికెట్ మరియు ఆధార్ లింక్ మొబైల్ నెంబర్* *తో పాటు సంప్రదించి మీ పేరు నమోదు చేసుకుంటే ప్రభుత్వం నుంచి మీకు నైపుణ్య అభివృధి మరియు ఉపాధి అవకాశాలు కల్పించబడును. ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం కార్యక్రమం ప్రజలు త్వరపడి మీ పేర్లు నమోదు చేసుకోండి.

జాతీయ అంతర్జాతీయ

హైదరాబాద్ – విజయవాడ రెండు గంటల ప్రయాణమే..!

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు జీవనాడి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి. అది ఎంత ఆధునిక రూపం సంతరించుకుంటే రెండు రాష్ట్రాల మధ్య అంత దూరం తగ్గుతుంది. సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణానికి వీలవుతుంది. ఇరు రాష్ట్రాల ప్రజలు మరింత వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. హైదరాబాద్ – అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు డీపీఆర్ సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

అన్నమయ్య

నేడు రాజంపేటకు మాజీ CM రాక..!

అన్నమయ్య: మాజీ CM జగన్‌మోహన్ రెడ్డి నేడు రాజంపేటకు రానున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసు, రోడ్డు భవనాల శాఖ అధికారులు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి తనయుడి వివాహ రిసెప్షన్‌కు ఆయన వస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. బెంగళూరు నుంచి ఆకేపాడుకు హెలికాప్టర్‌లో వస్తున్నట్లు పేర్కొన్నారు.

హెల్త్ టిప్స్

కీమోతో జుట్టు రాలకుండా..

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : క్యాన్సర్ చికిత్సల్లో కీమోథెరపీతో జుట్టు రాలుతుంటుంది. చికిత్స అనంతరం వెంట్రుకలు తిరిగి మొలిచినప్పటికీ కీమోథెరపీ తీసుకునేవారికి జుట్టు రాలటం చాలా ఆందోళన కలిగిస్తుంది. కొన్నిసార్లు ఆత్మ విశ్వాసాన్నీ దెబ్బతీస్తుంది. అందుకే వెంట్రుకలు రాలకుండా చూడటానికి చల్లటి టోపీ (కోల్డ్ క్యాప్) చికిత్స వాడుతుంటారు. దీన్ని స్కాల్ప్ కూలింగ్ అనీ పిలుస్తుంటారు. ఇది చల్లదనం ద్వారా మాడులోని రక్తనాళాలను సంకోచించేలా చేస్తుంది. ఇలా వెంట్రుకల కుదుళ్లకు కీమో మందు అంత ఎక్కువగా చేరకుండా అడ్డుకుంటుంది. అలాగని అసలే వెంట్రుకలు రాలవని కాదు గానీ కొంతవరకు తగ్గుతుంది. రెండు రకాలు ఆటోమేటెడ్ టోపీలు: చికిత్స తీసుకుంటున్నప్పుడు వీటిల్లో గొట్టం ద్వారా చల్లటి నీరు ప్రసారమవుతుంది. ఫ్రొజెన్ జెల్ టోపీలు: వీటిల్లో గొట్టానికి బదులు డ్రై ఐస్ ఉంటుంది. ఇది చికిత్స చేస్తున్నప్పుడు తిరుగుతూ చల్లగా ఉండేలా చేస్తుంది. ఏది వాడుకోవాలనేది వ్యక్తిగత నిర్ణయమే. ధర, సౌకర్యం బట్టి ఎవరికి వారే ఎంచుకోవచ్చు. ఎంత చల్లన? చల్లటి టోపీల్లో ప్రసరించే ద్రవం సుమారు 2 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఇది మాడును 18 నుంచి 22 డిగ్రీల సెల్షియస్ మధ్యలో చల్లగా ఉండేలా చూస్తుంది. ఎప్పుడు మొదలెట్టాలి? కీమోథెరపీ తీసుకోవటానికి 30-60 నిమిషాల ముందే చల్లటి టోపీ ధరించాలి. చికిత్స అనంతరమూ 30-60 నిమిషాల సేపు అలాగే ఉంచాలి. తొలిసారి రేడియేషన్ తీసుకుంటున్నప్పటి నుంచే వీటిని వాడుకోవాలి. కీమోతో జుట్టు రాలటమనేది తొలిసారి చికిత్స తర్వాతే మొదలవుతుంది. ఎవరికి సరిపోతాయి? చల్లటి టోపీలు అందరికీ సరిపడవు. కొన్ని కీమో మందులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇవి స్వల్పంగా చేరినా వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటాయి. రక్త, మెదడు క్యాన్సర్లు.. పార్శ్వనొప్పి, కాలేయ జబ్బు గలవారు.. ఎముకమజ్జ మార్పిడికి సిద్ధమయ్యేవారు, 18 ఏళ్లలోపు వారికి ఈ టోపీలు వద్దు.

ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ప హైకోర్డులో పిటిషన్

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : ఏపీ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణపై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధులు వాడుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

ఖమ్మం

21 న భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కి ముఖ్య మంత్రి రేవంత్ రాక

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఈ నెల 21 న అనగా గురు వారం బాద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఆశ్వరావు పేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం కి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేసారూ. చంద్రుగొండ మండలం బెండలా పాడు గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు పంపిణి కార్యక్రమం లో పాల్గొంటారని శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు శ్రీనివాస్ రెడ్డి అక్కడ హెలిపాడ్, సభ వేదిక, పంపిణీ కి సిద్ధం గా ఉన్న ఇందిరమ్మ ఇల్ల ని పరీసీలించి అధికారులకి సూచనలు చేశారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.