Monday, 11 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

కలిగిరి నేత ఇంగిలే కల్లయ్య మృతి టిడిపికి తీరని లోటు: బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.. ////

కలిగిరి/పున్నమి న్యూస్ ప్రతినిధి, నాగరాజు ఆగష్టు 19 :// కలిగిరి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఇంగిలే కల్లయ్య ఆకస్మిక మృతి పట్ల టిడిపి మండల అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు.కల్లయ్య పార్టీ పట్ల చూపిన అంకితభావం, క్రమశిక్షణ, వినయశీలత ఎల్లప్పుడూ కార్యకర్తలకు ఆదర్శమని కృష్ణారెడ్డి గుర్తుచేశారు. “కల్లయ్య గారు పార్టీ కోసం ఎప్పటికప్పుడు కష్టపడుతూ, కార్యకర్తల సమస్యల పరిష్కారంలో ముందుండేవారు. అటువంటి సౌమ్య స్వభావం కలిగిన నాయకుడి ఆకస్మిక మృతి నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇది మా పార్టీకి మాత్రమే కాదు, కలిగిరి ప్రజలకు కూడా భర్తీ కాని లోటు” అని పేర్కొన్నారు.ఈ కష్టసమయంలో కల్లయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, దేవుడు వారికి ధైర్యం ప్రసాదించాలని, కల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని బిజ్జం కృష్ణారెడ్డి అన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆయన మృతి దేహం పై కప్పి వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలిపినారు. ఈ కార్యక్రమంలో కలిగిరి మండల పార్టీ సీనియర్ నాయకులు ఉస మాల్యాద్రి, పుల్ల కామేశ్వరరావు, చల్ల వెంకీ, బైరిశెట్టి రమేష్,కొప్పోలు కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ అంతర్జాతీయ

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఇక నేరమే.. గేమింగ్‌ బిల్లుకు క్యాబినెట్‌ ఆమోదం!

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఇక నేరమే.. గేమింగ్‌ బిల్లుకు క్యాబినెట్‌ ఆమోదం! ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ను నేరంగా పరిగణిస్తూ ‘ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు’ను తీసుకురాబోతోంది.

తిరుపతి

శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద పోలీస్ ఔట్ పోస్టింగ్ ఏర్పాటు చేయాలి-సిపిఐ

శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి వద్ద ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోలీస్ ఔట్ పోస్టింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులకు, రక్షణ కల్పించాలని,అప్పుడే ఉద్యోగులు ఏ భయమూ లేకుండా తమ విధులు సక్రమంగా నిర్వహిస్తూ రోగులకు సేవలందిస్తారని టూ టౌన్ సీఐ నాగార్జున రెడ్డి కి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు.

ఖమ్మం

పెండింగ్ఆ లో ఉన్న వేతనాలు విడుదల చేయాలి అని శా కార్యకర్తల ధర్నా

ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో ని నేల కొండపల్లి మండలం లో మంగళవారం ఆశా కార్యకర్తలు ధర్నా చేశారు ఈ ధర్నా కార్యక్రమం లో సీపీఎం మండల కార్యదర్శి కే వి రామి రెడ్డి హాజరై మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు పెండింగ్ లో వేతనాలు వెంటనే విడుదల చెయ్యాలి అని కనీస వేతనం 18000 అలాగే ఏడాది కి రెండు జతల యూనిఫామ్ లు ఇవ్వాలని పని ప్రదేశం భద్రత, గౌరవం కలిపించాలి అని డిమాండ్ చేశారు.

తిరుపతి

వినాయక చవితి మండపాలకు అనుమతి తప్పనిసరి

* తడ,ఆగస్టు(పున్నమి ప్రతినిధి): వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు ఏర్పాటుకు ప్రభుత్వం సిం గిల్‌ విండో విధానం అమలులోకి తెచ్చింది.పోలీసులు అనుమతులు పొందిన తరువాత మాత్రమే విగ్రహాలు ఏర్పాటుచేయాలని తడ SI కొండప్ప నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. అయన మాట్లాడుతూ వినాయక మండపాలు ఏర్పాటు కోసం పోలీస్ స్టేషన్లో వివరాలు, ఏప్రాతంలో ఏర్పాటుచేస్తున్నారు అనే చిరునామా, సంబంధించిన వివరాలు అందజేయాలి.నిమజ్జనం ఎక్కడ చేస్తారు,ఎప్పుడు తీసుకెళతారు అనేది కూడా దరఖాస్తులో పూర్తిచేయాలి. వినాయక విగ్రహాలు రహదారులపై ఏర్పాటు చేయరాదని,వాహనాల రాకపోగాలకు అంతరాయం కలిగించరాదన్నారు.అదేవిధంగా వినాయక చవితిలో డీజే లకు టపాకాయలకు అనుమతి లేదన్నారు.పండగ సందర్భంగా ఇతర మతస్థులను కించపరచడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండపాల వద్ద ఆసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తప్పదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్

రాజోలు తాసిల్దార్ కార్యాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరణ

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం లో రాజోలు తాసిల్దార్ కార్యాలయానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దళిత చైతన్య వేదిక భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని బహుకరించింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు తాసిల్దార్ కార్యాలయంలో వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ అధ్యక్షతన తాసిల్దార్ తో సమావేశమైన దళిత చైతన్య వేదిక నాయకులు అంబేడ్కర్ చిత్రపటాన్ని తాసిల్దార్ సిహెచ్ భాస్కర్ కు అందించారు. అంబేడ్కర్ చిత్రపటానికి నాయకుల సమక్షంలో తాసిల్దార్ భాస్కర్ పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు రాజ్యాంగ బద్ధంగా నడుచుకొని నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను వేధించకుండా వారికి అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజోలు వైస్ ఎంపీపీ పొలుమూరి శ్యాంబాబు, శివకోటి సర్పంచ్ నక్కా రామారావు, రాష్ట్ర దళిత నాయకులు గెడ్డం సింహా, సరేళ్ళ విజయ్ ప్రసాద్, వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ చింతా శ్రీను, ఉపాధ్యక్షులు చిలకపాటి శ్రీధర్, జిల్లా అధ్యక్షులు లిఖితపూడి బుజ్జి, మండల అధ్యక్షులు మందపాటి మధు సభ్యులు దీపాటి శివప్రసాద్,మట్టా సురేష్ కుమార్, జిల్లెళ్ళ వినోద్, గొల్లమందల నాగేంద్ర, మెడబల శ్యాం శేఖర్, పొన్నమాటి భాస్కర్, బొడ్డపల్లి ప్రసాద్, గోగి మోహన్, బుంగ శ్రీను, కడలి ప్రసాద్, ఉప్పే జగదీష్, ఆకుల చిన్నమ్మ నాయడు, పాస్టర్ చెల్లిం ప్రసాద్ లతో పాటుగా తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీ గ్రామాల సమస్యలు పరిష్కరించాలని వై.వి.బి రాజేంద్రప్రసాద్ సియం కు విజ్ఞప్తి

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : సర్పంచుల, ఎంపీటీసీల, జడ్పీటీసీ ల సమస్యలు మరియు గ్రామీణ ప్రజల, గ్రామాల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన … వై.వి.బి రాజేంద్రప్రసాద్. అమరావతి లోని సెక్రటేరియట్ నందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన అనంతరం రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 శాతం భూభాగంలో నివసిస్తున్న మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సర్పంచులు, ఎంపీటీసీలు మరియు జడ్పీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు గ్రామీణ ప్రజల మరియు గ్రామాల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని రాజేంద్రప్రసాద్ తెలియజేశారు. . ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డిలు ఉన్నారు. ఇట్లు బిర్రు ప్రతాప్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్

క్రైమ్

మీకు బెయిల్ ఇవ్వ‌లేం! మిథున్ రెడ్డికి కోర్టు షాక్‌

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం వ్య‌వ‌హారంలో ఏ-4గా ఉన్న రాజంపేట ఎంపీ, వైసీపీ కీల‌క నాయ‌కుడు పెద్ది రెడ్డి మిథున్ రెడ్డి ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్నారు. ఆయ‌న‌తోపాటు.. మాజీ ఐఏఎస్ అధికారి ధ‌నుంజ‌య్ రెడ్డి, జ‌గ‌న్ మాజీ ఓఎస్‌డీ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ సంస్థ ఆడిట‌ర్ బాలాజీ గోవింద‌ప్ప‌లు విజ‌య‌వాడ జైల్లో ఉన్నారు. అయితే.. వీరు త‌మ‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ.. విజ‌య‌వాడలోని ఏసీబీ కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై నాలుగు సార్లు విచార‌ణ కూడా జ‌రిగింది. వారికి బెయిల్ ఇవ్వ‌రాద‌ని.. ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్య‌క ద‌ర్యాప్తు బృందం అధికారులు కోర్టుకు విన్న‌వించారు. దీనికి సంబంధించి జ‌రిగిన అన్ని విచార‌ణ‌ల్లోనూ సిట్ అధికారులు బ‌ల‌మైన ఆధారాల‌ను చూపించారు. అంతేకాదు.. మ‌ద్యం స్కాంలో మిథున్ రెడ్డి న‌గ‌దును త‌రలించ‌డంలోనూ.. స్కాంకు రూప‌క‌ల్ప‌న చేయ‌డంలోనూ పాలుపంచుకున్నార‌ని.. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు చెందిన కంపెనీకి రూ.5 కోట్లు వ‌చ్చాయ‌ని.. తెలివిగా వాటిని తిరిగి ఇచ్చేశార‌ని కూడా గ‌త వాద‌న‌ల్లో వినిపించారు. ఇక‌, మాజీ ఐఏఎస్ ధ‌నుంజ‌య‌రెడ్డి కూడా ఈ స్కాంలో కీల‌క రోల్ పోషించార‌ని తెలిపారు. మ‌ద్యం కుంభ‌కోణానికి రూప‌క‌ల్పన చేసిన వారిలో ఆయ‌న కూడా ఉన్నార‌ని చెప్పారు. అలాగే.. మాజీ ఓఎస్‌డీ కృష్ణ‌మోహ‌న్‌.. అనేక సంద‌ర్భాల్లో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో పాలు పంచుకున్నార‌ని తెలిపారు. ఇక‌, ఆడిట‌ర్ గోవింద‌ప్ప‌.. మ‌ద్యం కుంభ‌కోణం ద్వారా వ‌చ్చిన నిధుల‌ను ఎలా మ‌ళ్లించాలి? ఏయే రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టాలి? అనే విష‌యాల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డంతోపాటు.. 150 కోట్ల‌ను దారిమ‌ళ్లించార‌ని సిట్ అధికారులు కోర్టుకు వివ‌రించా రు. ఇక‌, పిటిష‌నర్ల త‌ర‌ఫున న్యాయ‌వాదులు మాత్రం అస‌లు త‌మ వారికి ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని.. ప్ర‌భుత్వం విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంద‌ని వివ‌రించారు. ఎంపీకి అస‌లు రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల్లో జోక్యం చేసుకునే అవ‌కాశం లేద‌ని కూడా పేర్కొన్నారు. మొత్తంగా ఇరు ప‌క్షాల వాద‌న‌లు న‌మోదు చేసుకున్న కోర్టు.. తాజాగా తీర్పు వెలువ‌రించింది. సిట్ అధికారులు(ప్రాసిక్యూష‌న్‌) ఇచ్చిన వివ‌రాలు.. దాఖ‌లుచేసిన రెండు చార్జిషీట్ల‌లో నిందితులు త‌ప్పు చేశార‌న్న విష‌యం స్ప‌ష్టంగా ఉంద‌ని.. బ‌ల‌మైన ఆధారాలు కూడా ఉన్నాయ‌ని ఏసీబీ కోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. బెయిల్ పొందేందుకు.. ఈ న‌లుగురిలో ఎవ‌రూ అర్హులు కార‌ని పేర్కొంది. ఎంపి అయినా.. రాష్ట్రానికి చెందిన వారేన‌ని.. గ‌తంలో అనేక కేసులు కూడా ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డిన కోర్టు.. బెయిల్ ఇవ్వ‌లేమ‌ని పేర్కొంటూ.. పిటిష‌న్ల‌పై విచార‌ణ‌ను ముగించింది. దీంతో పై న‌లుగురు హైకోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంద‌ని వారి త‌ర‌ఫు న్యాయ‌వాదులు పేర్కొన్నారు.

క్రైమ్

రేపటి నుండి కొత్త వాట్సాప్! కాల్ రికార్డులు సేవ్ చేయబడతాయి.

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : రేపటి నుండి కొత్త వాట్సాప్ మరియు ఫోన్ కాల్ నియమాలు అమలు చేయబడుతున్నాయి 1. అన్ని కాల్స్ రికార్డ్ చేయబడతాయి. 2. అన్ని కాల్ రికార్డులు సేవ్ చేయబడతాయి. 3. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు అన్ని సోషల్ మీడియాలు పర్యవేక్షించబడతాయి. 4. ఈ సమాచారం లేని వారికి తెలియజేయండి. 5. మీ పరికరం మంత్రిత్వ శాఖ వ్యవస్థకు కనెక్ట్ చేయబడుతుంది. 6. ఎవరికీ తప్పుడు సందేశం పంపకుండా జాగ్రత్త వహించండి. 7. మీ పిల్లలు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు మరియు పరిచయస్తులు జాగ్రత్తగా ఉండాలని మరియు సోషల్ మీడియాను కనిష్టంగా ఉపయోగించాలని తెలియజేయండి. 8. ప్రభుత్వానికి లేదా ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఎలాంటి సందేశం, వీడియో మొదలైనవి పంపవద్దు. 9. ప్రస్తుతం ఏదైనా రాజకీయ లేదా మతపరమైన అంశంపై సందేశాలు రాయడం లేదా పంపడం నేరం… అలా చేయడం వల్ల వారెంట్ లేకుండా అరెస్టు కావచ్చు. 10. పోలీసులు నోటీసు జారీ చేస్తారు… ఆ తర్వాత సైబర్ క్రైమ్ చర్య తీసుకుంటారు, ఇది చాలా తీవ్రమైనది. 11. దయచేసి మీరందరూ, గ్రూప్ సభ్యులు మరియు నిర్వాహకులు, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోండి. 12. తప్పుడు సందేశాలు పంపకుండా ఉండండి, ఇతరులకు తెలియజేయండి మరియు జాగ్రత్త

తిరుపతి

వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి.ఏర్పేడు సిఐ

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు పరిసర గ్రామ ప్రజలకు వినాయక చవితి సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. వినాయక చవితి సంధర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు పెట్టె ప్రతి గ్రామస్థులు పోలీసుల అనుమతి తీసుకోవాలని ఏర్పేడు సిఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.అదేవిధంగా వినాయక మండపాల దగ్గర డి.జె లకు అనుమతిలేదని ఇతర డాన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేయకూడదన్నారు.విద్యుత్ వైర్లలకు దగ్గరగా లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు.వినాయక చవితి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతల విఘాతం కలిగించకుండా నిమర్జన సమయంలో పోలీస్ సిబ్బందికి సహకరించి పండుగ సంబరాలు జరుపుకోవాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.