Sunday, 10 May 2026

Blog

అన్నమయ్య

అన్నమయ్య జిల్లా యువకుడికి రూ.2.5 కోట్లు జీతం

రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలానికి చెందిన ఒక యువకుడు ప్రతిభతో దేశానికి గర్వకారణంగా నిలిచాడు. IITలో బీటెక్ పూర్తి చేసిన ఆయన, ప్లేస్‌మెంట్ ద్వారా ప్రముఖ కంపెనీలో ఉద్యోగం పొందాడు. అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి మరో అంతర్జాతీయ సంస్థలో అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో పనిచేస్తూ, ఏకంగా రూ.2.5 కోట్లు వార్షిక ప్యాకేజీతో సేవలు అందిస్తున్నాడు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ యువకుడు కృషి, పట్టుదలతో అగ్రశ్రేణి సంస్థల్లో ఎదుగుతూ ఉన్నత స్థానానికి చేరుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆయన, విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపించాడు.

తూర్పు గోదావరి

Ratan Tata Innovation Hub (RTIH) ప్రారంభం

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్ మండలం, ధవళేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) బుధవారం ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనం కళాక్షేత్రంలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, యువతలో సృజనాత్మకతను, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఇటువంటి హబ్ లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఈ హబ్ ద్వారా అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, ఇది స్థానిక యువతకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ హబ్ లోని అత్యాధునిక సౌకర్యాలు, శిక్షణా కార్యక్రమాలు యువ పారిశ్రామికవేత్తలను, స్టార్టప్ లను ప్రోత్సహించి, ప్రాంతాభివృద్ధికి దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్

వోట్ చోర్ – గద్ది చోడ్ నినాదాలతో హోరెత్తించిన డాక్టర్ రౌతు ఈశ్వరరావు

అంబేద్కర్ కోనసీమ, ఆగస్ట్ 20,పున్నమి ప్రతినిధి: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా రావులపాలెంలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో భాగంగా బిజెపి ఎలక్షన్ కమిషన్ కి వ్యతిరేకంగా కొత్తపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రౌతు ఈశ్వరరావు కాశి డాక్టర్ ఆధ్వర్యంలో వోట్ చోర్ – గద్ది చోడ్ నినాదాలతో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ రౌత్ ఈశ్వరరావు మాట్లాడుతూ దొంగ ఓట్లు నమోదులో ప్రధానమంత్రి మోడీ పాత్ర కీలకపాత్ర వహించి ఉన్నారు కాబట్టే నోరు మెదపడంలేదన్నారు.అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ కూడా సహాయం చేయటం చాలా దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో బిజెపి పరిపాలన సాగించడం దాని వెనక ఉన్న కుట్రలను రాహుల్ గాంధీ ఆధారాలతో సహా ప్రజలా ముందే పెట్టీ నిజానిజాలు తెలుపుతున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ గ్రంధి శేషగిరిరావు,రావులపాలెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుప్పాల రాంబాబు మరియు పలువురు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

పిల్లలకు

స్కూళ్లకు దసరా సెలవులపై తాజా నిర్ణయం – అమలు ఇలా..!!

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : దసరా సెలవుల పైన ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. దసరా సెలవుల పైన ముందుగానే ప్రకటన చేసినా.. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో సెలవులు ఇస్తున్నారు. దీంతో, ఈ సెలవుల కారణం గా సిలబస్ కు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో దసరా సెలవుల పైన కొంత సందిగ్ధత నెలకొంది. కాగా..ముందుగా ప్రకటించిన విధంగానే దసరా సెలవుల కొనసాగింపుకు అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత ఆగస్టు నెలలో స్కూళ్లకు సాధారణ సెలవులతో పాటుగా వర్షాల కారణంగా మరిన్ని సెలవులు వచ్చాయి. ఇక, అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ మూడోవారం నుంచి తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు. క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు హాలీడేస్ ప్రకటించనున్నారు. ప్రత్యేక పండుగలు, ఆదివారాలు ,రెండో శనివారాలు అన్ని కలిపితే విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి.

క్రైమ్

నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసనే!

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరసగా 30 రోజులపాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రినైనా, కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

గూడూరు

*నకిలీ పింఛన్లకు చెక్…జిల్లాలో 4 వేల మంది దివ్యాంగులకు నోటీసులు జారీ*

*నెలరోజుల్లోగా వైకల్యం నిరూపణకు అవకాశం…* *1400 మందికి వృద్ధాప్య పింఛనుగా మార్పు…* *నోటీసులు అందుకున్న వారిలో చెవుడు ఉన్నట్టు సదరం సర్టిఫికెట్లు తెచ్చుకున్నవారే అధికం..* *పొరపాటున పింఛను ఆపితే….తర్వాత బకాయిలతో సహా చెల్లింపు* *జిల్లా వ్యాప్తంగా పింఛనుదారుల సంఖ్య 2,36,400* వైకల్యం లేకునన్న ఉన్న ట్లుగా చూపి, సదరం క్యాంపుల్లో నకిలీ సర్టిఫికెట్లు తెచ్చుకుని దివ్యాంగుల పింఛను పొందుతున్న అక్రమారులకు ప్రభుత్వం చెక్ పెడుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బడిముబ్బడిగా వైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికెట్లు తీసుకుని పింఛను పొందుతున్న వారి వివరాలను మాటమి ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేయించింది. ఈ ప్రత్యేక బృందాల సర్వేలో జిల్లాలో నాలుగు వేల మందికి పైగా వైకల్యల లేకున్నా దివ్యాంగుల పింఛను పొందుతున్నట్లుగా రుజువైంది. దీంతో ఆయా పింఛను దారులకు ప్రభుత్వం ఇటీవల నోటీసులు జారీ చేసింది. నెలరోజుల్లోగా మీకున్న వైకల్యాన్ని నిరూపించుకోవాలని, అందుకు తగిన సర్టిఫికెట్లను సమర్పించేలా వెసులుబాటును కల్పించింది. నోటీసులు అందుకున్న వారిలో రెండు శాతం మంది వాస్తవంగా వైకల్యంతో ఇబ్బందులు పడేవారు ఉన్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా 2,36,166 మంది. వివిధ రకాల పింఛన్లు పొందుతున్నాను ఇందులో దివ్యాంగుల కోటాలో పించను పొందేవారు 36 వేల మంది వరకు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల కోటాలో పింఛన్ ను నెలకు రూ.6 వేలకు పెంచింది. దీంతో గతంలో సదరం క్యాంపుల్లో చ/దళారుల ప్రమేయంతో వైకల్యం ఉన్నట్లుగా నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న వారు దివ్యాంగుల కోటాలో పించను తీసుంటున్నారు. ఈ అంశంపై పలు పిర్యాదులు అందడంతో కూటమి ప్రభుత్వం గత ఆరేడు నెలలుగా ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి, దివ్యాంగుల పింఛను పొందుతున్న వారి వివరాలు, వారు నిజంగా వైకల్యంతో ఇబ్బందులు పడుతున్నారా లేదా అనే అంశంపై నిజనిర్ధారణ చేయించింది. ప్రత్యేక వైద్య బృందాల పరి శీలనలో జిల్లాలో నాలుగు వేల మందికి పైగా వైకల్యం లేకున్నా ఉన్న ట్లుగా సర్టిఫికెట్లు తీసుకుని దివ్యాంగుల పింఛను పొందుతున్నట్లుగా రుజువైంది. దీంతో వీరందరికీ మీకున్న వైకల్యానికి సంబంధించిన అన్ని పత్రాలను మళ్లీ చూపాలని నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో చెవుడు ఉన్నట్లుగా చూపి దివ్యాంగుల పింఛను తీసుకుంటున్న వారే అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు *పొరపాటున పింఛను ఆపితే….తర్వాత బకాయిలతో సహా చెల్లింపు* వాస్తవంగా వైకల్యంతో బాధపడుతూ ప్రత్యేక వైద్య బృందాలు ఇచ్చిన నివేదికలో పొరపాట్లు దొర్లి పింఛన్ ఆసివేస్తే, పూర్తిస్థాయిలో సర్టిపికెట్లు సమర్పించిన అనంతరం పాతబకాయిలతో సహా పింఛను ఇచ్చేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందని అధికారులు పేర్కొంటున్నారు. దివ్యాంగుల పింఛను పొందేందుకు అర్హత లేనివారి వయసు60 సంవత్సరాలు దాటితే వారికి వృద్ధాప్య పింఛను ఇచ్చేలా వెసులుబాటును కల్పించారు. అలా జిల్లాలో 1400 మందికి దివ్యాంగుల పింఛను బదులుగా, వృద్ధాప్య సించను ఇస్తామని కూడా నోటీసులో పేర్కొన్నారు. ఉదాహరణకు మోపిదేవి మండలంలో నుంచి 980 మంది దివ్యాంగుల పింఛన్ పొందుతున్నారు. ప్రత్యేక వైద్య బృందాల పరిశీలనలో 529 మంది దివ్యాంగుల పింఛన్ పొందిందుకు అర్హులని తేల్చారు. మిగిలి వారిలో 118 మందికి 60 సంవత్సరాలు నిండడంతో వారికి దివ్యాంగుల పింఛనుకు బదులుగా వృద్ధాప్య పించను పొంచేందుకు అర్హులని నివేదికను ఇచ్చారు. మరో 335 మందికి ఎటువంటి అర్హతలు లేవని నిర్ధారించారు. అయితే తమ పించను నిలిపివేస్తామని నోటీసులు ఇచ్చారని తాము ఏమి చేయాలని నోటీసులు అందుకున్న వారు సచివాలయాలకు, ఎంపీడీవో కార్యాలయకు ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. వీరులో చెవుడు అని చూపి పింఛను పొందుతున్నవారి అధికంగా ఉన్నారని, ఫోన్లో తమతో మాట్లాడేటపుడు వారికి అన్ని మాటలు సక్రమంగానే వినపడుతున్నాయని అధికారులు, సచివాలయ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. *దళారుల వద్దకు పరుగులు…* దివ్యాంగుల పింఛన్లు ఇప్పిస్తామని, ఆధార్ కార్డులలో వయసును పెంచి వృద్ధాప్య పింఛన్లు వచ్చేలా చేస్తామని గతంలో దళారులు పలువురి నుంచి నగదు వసూళ్లకు పాల్పడ్డారు. సదరం క్యాంపులలో వైకల్యం శాతం అధికంగా ఉన్నట్లుగా సర్టిఫికెట్లు జారీ చేయిస్తామని చెప్పి, సదరం క్యాంపులలో పనిచేసే వైద్యులతో కుమ్మక్కై వైకల్యం లేకున్నా, అధికశాతం ఉన్నట్లుగా చూపి సదరం సర్టిఫికెట్లను మంజూరు చేయించారు. చెవుడు ఉన్నట్లుగా అధికశాతం సర్టిఫికెట్లను జారీ చేశారు. ఇందుకోసం దళారులు ఒక్కొక్కరి నుంచి రూ.25వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. గతంలో సదరం క్యాంపులు నిర్వహించిన సమయంలో దళారుల ద్వారా సర్టిఫికెట్లు పొందిన వారు ఇప్పుడు తమ పింఛను కొనసాగేలా చూడాలని వారి చుట్టూ తిరుగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

జైలు నుంచి విడుదలైన అఘోరీ

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరీ చీటింగ్ కేసులలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారు. అఘోరీపై నాలుగు చీటింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో 3 నెలలుగా జైలులో ఉన్నారు. ఇటీవల బెయిల్ లభించినా, సంబంధిత పత్రాలు అందడంతో జైలు నుంచి విడుదల ఆలస్యమైంది. ఇక బెయిల్‌పై బయటకు వచ్చాక తాను కాశీకి వెళ్తున్నట్లు అఘోరీ వెల్లడించారు. మరోవైపు వర్షిణి గురించి ఏం మాట్లాడతారో ఆసక్తి నెలకొంది.

హెల్త్ టిప్స్

ఈ కాలం లో…పిల్లలు, వృద్ధులకు డెంగ్యూ ప్రమాదం

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : అసలే వర్షాకాలం…ఇక వ్యాధులు తప్పనిసరి….ఈ కాలం లో ..పిల్లలు, వృద్ధులకు డెంగ్యూ ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..! వర్షాకాలం చల్లటి వాతావరణం మనకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ వర్షంతో పాటు కొన్ని ప్రమాదకరమైన రోగాలు కూడా వస్తాయి. ముఖ్యంగా నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు బాగా పెరుగుతాయి. వీటి ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ జ్వరం ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. అందుకే దీని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా తెలుసుకోవాలి డెంగ్యూ జ్వరం అంటే ఏంటి..? డెంగ్యూ అనేది Aedes aegypti అనే దోమ కాటు వల్ల వచ్చే వైరల్ ఫీవర్. ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి నేరుగా వ్యాపించదు. కేవలం దోమ కాటు ద్వారా మాత్రమే వస్తుంది. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే చోట దోమలు ఎక్కువ కాబట్టి డెంగ్యూ వ్యాప్తికి ఇది ప్రధాన కారణం. డెంగ్యూ ప్రధాన లక్షణాలు డెంగ్యూ లక్షణాలు సాధారణ జ్వరాల లాగే ఉంటాయి. కానీ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను బట్టి దాన్ని గుర్తించవచ్చు హై ఫీవర్.. ఉన్నట్టుండి జ్వరం వస్తుంది. ఇది 2 నుంచి 7 రోజులు ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి.. ముఖ్యంగా కళ్ల వెనుక భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. బాడీ పెయిన్స్.. కీళ్లు, కండరాల నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే డెంగ్యూని బ్రేక్‌ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. వాంతులు.. తల తిరగడం, వాంతులు అవుతాయి. వీటి వల్ల డీహైడ్రేషన్ రావచ్చు. శరీర బలహీనత.. బాడీ వీక్‌ నెస్, అలసట ఉంటుంది. కొన్ని సార్లు చర్మంపై ఎర్రని దద్దుర్లు కూడా వస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే సొంతంగా మందులు వాడటం చాలా ప్రమాదకరం. వెంటనే డాక్టర్‌ ను కలిసి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. అలాగే ఈ జాగ్రత్తలు పాటిస్తే డెంగ్యూను నివారించవచ్చు. ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోండి. పాత టైర్లు, కుండీలు, బకెట్లు, కూలర్‌ లలో నీరు లేకుండా చూసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు మోస్కిటో నెట్ వాడటం, దోమల రిపెల్లెంట్లు ఉపయోగించడం మంచిది. ఈ కాలంలో ఇమ్యూనిటీ పెంచుకునే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఉండే ఆహారం తినాలి. మరిగించిన నీళ్లు, హెర్బల్ కషాయాలు, పండ్ల రసాలు తాగాలి. ఇవి డీహైడ్రేషన్‌ను నివారిస్తాయి. పిల్లలు, వృద్ధులు, షుగర్, బీపీ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ గురించి అపోహలు చాలా మంది డెంగ్యూ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని అనుకుంటారు. అది తప్పు. ఇది కేవలం దోమ కాటు ద్వారానే వస్తుంది. అలాగే యాంటీబయోటిక్స్‌తో డెంగ్యూ నయమవుతుందని భావించడం కూడా పొరపాటే. డెంగ్యూకు ప్రత్యేక యాంటీబయోటిక్ ట్రీట్‌మెంట్ ఉండదు. డాక్టర్ సలహా ప్రకారం విశ్రాంతి తీసుకుని సరైన చికిత్స చేయించుకుంటేనే ఉపశమనం లభిస్తుంది. వర్షాకాలం ఎంత అందంగా ఉన్నా.. మనం అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ ని కలవడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ జాగ్రత్తలు పాటిస్తే డెంగ్యూ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

భక్తి

వాడపల్లి వెంకన్న “కోనేరు”కు మహర్దశ

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి లో వాడపల్లి వెంకన్న “కోనేరు”కు మహర్దశ రూ. 2.5 కోట్ల తో అభివృద్ధి తిరుమల తరహాలో నిర్మాణం భక్తులకు ఆహ్లాదకరమైన ప్రదేశం వాడపల్లి విశిష్టత -10 కోనసీమ తిరుమల గా ప్రసిద్ధికెక్కిన వాడపల్లి దేవస్థానం కోనేరుకు మహర్దశ వస్తుంది. ఎన్నో దశాబ్దాలుగా ఎలాంటి ఆదరణకు నోచుకోని ఈ కోనేరును సుమారు రూ. 2.5 కోట్ల నిధులతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.వెంకటేశ్వర స్వామి ఆలయంకు తూర్పు వైపున గోదావరి ఏటి గట్టును ఆనుకుని సువిశాలమైన ప్రదేశంలో ఈ కోనేరు అన్ని ఆధునిక హంగులతో ముస్తాబవుతుంది.నూతనంగా నిర్మించే ఈ కోనేరు వాడపల్లి దేవస్థానానికి నూతన శోభను తీసుకురాబోతుంది. ఆలయ రాజగోపురం ముందు నుంచి ఏటిగట్టు వరకు జరిగే ఈ సుందరీకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చే భక్తులకు ఇప్పటివరకు కనీసం సేద తీరడానికి ఒక ప్రదేశమంటూ లేదు. ఇప్పుడు ఈ కోనేరు ఆధునీకరణ ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులు సేదతీరడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కోనేరుకు నాలుగు వైపులా అందమైన మొక్కలతో పార్కును తీర్చిదిద్దరున్నారు. అందువల్ల వాడపల్లి వచ్చే భక్తులకు ఈ కోనేరు ఆధ్యాత్మిక, ఆహ్లాదకర ప్రదేశంగా మారనుంది. తిరుమల కోనేరు తరహాలో… విశ్వవ్యాప్త ప్రసిద్ధికెక్కిన తిరుమలేసుని ఆలయం వద్ద ఉండే కోనేరు తరహాలోనే వాడపల్లిలో కూడా కోనేరు రూపుదిద్దుకోబోతుంది. కళ్ళు చెదిరే అందాలతో ఇది ముస్తాబు కాబోతుంది. ఇప్పటికే ఈ కోనేరు చుట్టూ సీసీ బండ్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. అనంతరం గ్రానైట్ రాయిని ఏర్పాటు చేస్తారు. అలాగే నాలుగు వైపులా మెట్ల నిర్మాణం చేపడతారు. సుమారు ఆరు అంగుళాల ఎత్తులో పది మెట్లు వస్తాయి. అలాగే అందమైన పచ్చదనం భక్తులను కనువిందు చేయనుంది. దీంతోపాటు విద్యుత్ అలంకరణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ కోనేరు నిర్మాణం పూర్తవుతే వాడపల్లి ఆధ్యాత్మిక కేంద్రానికి మరో మైలురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు స్వామివారి దర్శనం అనంతరం ఈ కోనేరు వద్ద ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేందుకు వీలుంటుంది. ఈ కోనేరు మొత్తం ఎకరా 26 సెంట్లులో రూపుదిద్దుకుంటుంది. నాలుగు వైపులా సుమారు 171 అడుగుల వెడల్పున పాలరాతి ట్రాక్ వస్తుంది. అలాగే ఏటిగట్టు నుండి ఆలయ మాడవీధుల వరకు విశాలమైన సిమెంట్ రోడ్డును నిర్మిస్తున్నారు.వాడపల్లి దేవస్థానం వద్ద భక్తులకు కాటేజీ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావుల ఆధ్వర్యంలో ముమ్మర కసరత్తులు జరుగుతున్నాయి. కాటేజిలలో ఉండే భక్తులకు ఈ కోనేరు అందాలు కనువిందు చేయనున్నాయి.ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అమరవీరుల స్థూపం కూడా ప్రత్యేక ఆకర్షణ ప్రస్తుతం దేవస్థాన రాజగోపురం ముందు ఉన్న అమరవీరుల స్థూపం కూడా ఈ కోనేరు సమీపంలో ఆకర్షణీయంగా సెల్ఫీ పాయింటుగా నిర్మించడానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అనుమతులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇచ్చి ఉన్నారు. ఈ కోనేరు సుందరీకరణతో పాటు ఈ అమరవీరుల స్థూపాన్ని కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. వాడపల్లి స్వామివారి ఉత్సవాల్లో రధానిపై జాతీయ జెండా ఎగరవేసినందుకుగాను బ్రిటిష్ వారు కాల్పులు జరపగా నలుగురు మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆనాడు బ్రిటిష్ వారిని ఎదిరించి వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి భక్తి తోపాటు దేశభక్తిని చాటిచెప్పిన అమరవీరులు చరిత్ర పది కాలాలపాటు అందరికీ ఆదర్శంగా నిలిచేందుకు ఈ స్థూపాన్ని చారిత్రాత్మక కట్టడం గా రూపొందిస్తున్నారు.అమర వీరుల పోరాట పటిమ,ఈ గడ్డ స్వతంత్ర ఉద్యమకారుల అడ్డా అని భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే లక్ష్యంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ స్తూపానికి మహర్దశ తీసుకొస్తున్నారు.కొండ్రెడ్డి లక్ష్మీ శ్రీనివాస్ వాడపల్లి వెంకన్న భక్తులు.

ఆంధ్రప్రదేశ్

ఐటీ సోదాల్లో మరోక కీలక మలుపు

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో సోదాలు చేస్తున్న ఐటీ బృందాలు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ కంపెనీపై ఆరోపణలు. DSR కంపనీలో పార్ట్‌నర్‌గా ఉన్న వెంకట కృష్ణా రెడ్డి. భారీగా ప్రాజెక్ట్ నిర్మాణ పత్రాలను, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్న ఐటీ. మరో రెండు రోజులపాటు కొనసాగునున్న ఐటీ సోదాలు. ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధాలు ఉండడంతో ఐటీ శాఖ సోదాలు నిఘా పెట్టినట్లు సమాచారం. రాజ్ కేసి రెడ్డికి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌కి మధ్య లావాదేవీలు ఉన్నట్లు అనుమానం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.