Sunday, 10 May 2026

Blog

E-పేపర్

సి.పి.ఆర్ నేర్చుకుందాం నిండు ప్రాణాన్ని కాపాడుదాం డాక్టర్ సునీత ఆధ్వర్యంలో బాల అకాడమీలో విద్యార్థులకు సి.పి.ఆర్ పై అవగాహన సదస్సు

నేటి ఆధునిక జీవన విధానంలో జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతున్నది. ఒక వ్యక్తి యొక్క గుండె ఆగిపోయినప్పుడు లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోయినప్పుడు వారి ప్రాణాలను కాపాడడానికి చేసే ఒక అత్యవసర చికిత్స సి.పి. ఆర్ మణిదీప్ మువ్వల మరియు ధ్రువన్ జి రెడ్డి అనే విద్యార్థులు అతి చిన్న వయసులోనే ఆదర్శ సేవా దృక్పథంతో అమెరికా నుండి భారత్ కు వచ్చి ఆంధ్రప్రదేశ్ లోఎన్నో పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సి.పి.ఆర్ పై అవగాహన కలిగిస్తూ విద్యార్థులందరికీ స్ఫూర్తిని అందిస్తున్నారు. ఈ సందర్భంగా బాల అకాడమీ కి విచ్చేసి సి.పి.ఆర్ ను ఎలా చేయాలి, దాని వలన కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు అర్థమయ్యేలా తెలిపారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ సునీత సమాధానాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు రజనీ ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా బాలకాడమీ ప్రిన్సిపల్ మాధవి లత మాట్లాడుతూ సిపిఆర్ పై అవగాహన కలిగించి, విద్యార్థులను ప్రోత్సహించినందుకు మెడ్ ఇంపాక్ట్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు విద్యార్థులు మణిదీప్ మువ్వల మరియు ధ్రువన్ జి రెడ్డి ని సత్కరించి సన్మానించారు. ప్రాణాలను రక్షించడానికి యువతను శక్తివంతం చేయడం- సి.పి.ఆర్ ప్రధాన లక్ష్యం.

E-పేపర్

ఉద్యోగుల సమస్యల పై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి అని ప్రభుత్వానికి విన్నవిస్తూ విన్నూత్న రీతిలో రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రప్ప

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ గారు నూతనంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమం ఈనెల 5వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైనది అని, ఈరోజు స్థానిక వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయ ఆవరణలో రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత పాలకులు ఉద్యోగుల బకాయిలు పరిష్కరించాలని సమస్యల తోరణం తో ధర్నాలకు వెళితే ఉద్యోగులను దేశ ద్రోహుల భావించి మన రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్ సూర్యనారాయణ గారిని అరెస్టు చేసే ప్రయత్నం చేశారన్నారు. అయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయని ప్రభుత్వాలు మనకెందుకని మనం నూతనంగా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైబడిన ఇంకా ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తున్నది అన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు సుమారు 35 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉందని ఈ మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో అర్థం కావడం లేదన్నారు. అందుకని జిల్లా కేంద్రాలు, పరిసర మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాల రూపంలో ఉద్యోగులకు ఇచ్చి వారికి ఇవ్వాల్సిన బకాయిలను జమ చేసుకోవడం వలన ఇటు ఇల్లు నిర్మించుకోవాలన్న ఉద్యోగుల కల అటు ప్రభుత్వ బకాయిలు రెండు నెరవేరుతుందని రాష్ట్ర అధ్యక్షులు అభిప్రాయమని నాగేంద్రప్ప పేర్కొన్నారు. దీంతోపాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక సంఘం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమే అన్నారు. రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమంలో కూడా ఏదైనా ఉద్యోగ సమస్యలు ఉంటే తమ సంఘం దృష్టికి తీసుకువస్తే సత్వరం జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కారం కి కృషి చేస్తానని జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకంతో తాము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశంతోనే సానుకూలంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమం ద్వారా ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నామని ఆయన అన్నారు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని వారు వారి పిల్లలకు వివాహాధి కార్యక్రమాలు చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాలను ప్రభుత్వం గుర్తించి సత్వరం ఉద్యోగుల బకాయిల చెల్లింపుకు మార్గాన్ని ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు ఉపాధ్యక్షులు రిజ్వానా పర్వీన్, సంఘం సిటీ అధ్యక్షులు సత్యం, కోశాధికారి వెంకట చక్రదర్, ఆంధ్ర ప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.యం. రమేష్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దశరథ రఘురామి రెడ్డి ఇతర ఉద్యోగులు మరియు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

E-పేపర్

సామాజిక సంఘసంస్కర్త నారాయణ గురు169వ జయంతి

బహుజనులకు విద్య అందుబాటులో లేని సమయంలో విద్య కోసం పోరాడిన మహనీయులు కారు చీకట్లో కాంతి కిరణం నారాయణగురు అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మరియు రాష్ట్ర అధ్యక్షురాలు నంది.విజయలక్ష్మి కర్నూలు జిల్లా లోని స్థానిక బి క్యాంపు నందలి ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో సామాజిక సంఘసంష్కర్త నారాయణగురు చిత్రపటానికి పూలమాల వేసి 169వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా నంది.విజయలక్ష్మి మాట్లాడుతూ సామాజిక సమానత్వం కోసం , అంటరానితనానికి వ్యతిరేకంగా నారాయణగురు పోరాటం చేశారని , దేవాలయాలనే పాఠశాలలగా మార్చి చదువు నేర్పించిన గొప్ప వ్యక్తి నారాయణగురు అని ఆమె అన్నారు. నారాయణగురు ఆలోచనా విధానాన్ని కొనసాగిస్తూ యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక పనిచేస్తుంది ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధ ,దేవి బాయి పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ నెల 7వ తేదీన చంద్రగ్రహణం: గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక సూచనలు

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : సెప్టెంబర్ నెల 7వ తేదీన చంద్రగ్రహణం: గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక సూచనలు వచ్చే నెలలో, సెప్టెంబర్ 7న, చంద్రగ్రహణం సంభవించనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:58 గంటలకు మొదలై, తెల్లవారుజామున 1:26 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం మొత్తం వ్యవధి 3 గంటల 28 నిమిషాలు ఉంటుంది. ఈ సమయంలో సూతక కాలం పాటించాలని, గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని సూచించారు. పూజలు, ఆహారం తీసుకోవడం వంటివి నిషేధించారు.

తెలంగాణ

గుంతలతో, కంకర తేలి ఉన్న రోడ్డు :

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) కోర్లపహాడ్ గ్రామం వద్ద ఉన్న టోల్ గేట్ కి కొంచెం ముందుగా మూసి కాలువ ఉన్నది. అక్కడి నుండి సుమారుగా 4 కిలోమీటర్లు వెళ్ళి, కుడి వైపు తిరిగితే ఇనుపాముల గ్రామం, ఎడమ వైపు వెళ్ళితే చెరుకుపల్లి గ్రామం వస్తుంది. ఈ రహదారి నుండి అనేక గ్రామాలకు వెళ్ళవచ్చును. ఈ రోడ్డు దాదాపుగా సగానికి పైగా గుంతలు పడి మరియు కంకర తేలి ఉన్నది. వర్షాకాలంలో ఈ రోడ్డు వెంట వెళ్ళడానికి ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బిజెపి కార్యాలయం ప్రారంభోత్సవం

పున్నమి Daily ఖమ్మం ప్రితినిధి:T.రవీందర్ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా చింతకాని మండల అధ్యక్షులు కొండా గోపి ఆధ్వర్యంలో చింతకాని మండలంలో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ముఖ్యఅతిథిగా విచ్చేసి చింతకాని మండలం కార్యకర్తలు పదాధికారుల సీనియర్ నాయకులు సమక్షంలో అందరితో కలిసి కార్యాలయం ప్రారంభించి అందరికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

ఖమ్మం

బిజెపి కార్యలయం ప్రారంభం

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి ) ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలం లో బిజెపి మండల పార్టీ కార్యాలయం ప్రారంభం బుధవారం జరిగింది.మండల అధ్యక్షులు కొండా గోపి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ముఖ్య అతిధి గా హాజరై కార్యాలయం ప్రారంభం చేసి కమలం పువ్వు జెండా ని ఆవిష్కరించారు. ఈ సందర్భముగా నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతు రాబోవు స్థానిక సంస్థ ల ఎన్నికల్లో చింత కానీ మండల ము బిజెపి విజయ డంఖ మ్రో గించాలి అని కార్యకర్తలకి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు మండదపు సుబ్బారావు, సుదర్శన్ మిశ్రా, నాగేశ్వరావ్, లతో పాటు గా మధిర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు

ఖమ్మం

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) భారత మాజీ ప్రధాని రాజీ గాంధీ యొక్క జయంతి వేడుకలు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేల కొండపల్లి మండలం లో గాంధీ పదం మండల కన్వీనర్ రెడ్డిమళ్ళబాబు రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నందు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో వంగవీటి నాగేష్ శ్వారావు, బొడ్డు బొందయ్యా, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు భీమా, మామిడి వెంకన్నా రాయపూడి నవీన్, జెర్రి పోతుల అంజనీ, గుడి బోయిన వెంకటేశ్వర్లు, జెర్రి పోతుల సత్య నారాయణ, కొండా ఉపేందర్, గుండా బ్రహ్మం, నాగి రెడ్డి, గోపి, ఉపేందర్, లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో శాంతి ర్యాలీ

రైల్వే కోడూరు, ఆగస్టు 20 (పున్నమి ప్రతినిధి): ప్రపంచ శాంతి కోసం మానవతా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రైల్వే కోడూరులో ఘనంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ఉదయం స్టేట్ బ్యాంకు వద్ద ప్రారంభమైన ర్యాలీ, కడప-మద్రాస్ రోడ్‌లోని ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ కె. ప్రసాద్ వర్మ, కో-చైర్మన్ టి. వెంకటరమణ యాదవ్, కార్యదర్శి ఆర్. చెంగల్ రెడ్డి, కన్వీనర్ సి. నాగేంద్ర, కోశాధికారి పి. నిరంజన్తో పాటు డైరెక్టర్స్ కె. బాలకృష్ణం రాజు, ఏ. శ్రీనివాసరాజు, యస్. మస్తాన్ సాహెబ్, నరసరామిరెడ్డి, ఎం. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏపీజీపీ మేనేజర్ వాసు, నాగరాజు, మునికృష్ణ, ఉంగరాల కృష్ణ, కె. మోహన్ రాజు, రవి, శ్రీను, రవి వర్మ, మధుసూదన్ రెడ్డి, కె. సుబ్రహ్మణ్యం రాజు, జయచంద్ర రాజు, పి. కృష్ణయ్య, రాఘవ రాజు, తులసి వెంకటేష్, చెంగలరాజు, కోటి, సుబ్రహ్మణ్యం రెడ్డి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ ర్యాలీ ద్వారా సమాజంలో శాంతి, సౌహార్దం, మానవత్వం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

అన్నమయ్య

రైల్వేకోడూరులో తాసిల్దార్‌తో బొప్పాయి రైతు సంఘం నాయకుల సమావేశం

రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో బొప్పాయి రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతు సంఘ నాయకులు, సిఐటియు ప్రతినిధులు బుధవారం ఉదయం రైల్వే కోడూరు తాసిల్దార్ అమరేందర్‌ను కలిసి చర్చించారు. సోమవారం సబ్ కలెక్టర్‌ను కలిసి బొప్పాయి ధరను కలెక్టర్ నిర్ణయించిన రూ.10 కంటే తక్కువకు కొనుగోలు చేయరాదని విజ్ఞప్తి చేసిన విషయం గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాసిల్దార్ మాట్లాడుతూ—”కనీస ధర రూ.9 కంటే తగ్గకూడదు. 10 రూపాయల ధర రైతులకు రావాలి. దళారులు తక్కువ ధర చెల్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. ఎమ్మార్వో సమావేశం అనంతరం కొంతమంది వ్యాపారులతో ఫోన్‌లో మాట్లాడగా, కొందరు రూ.9 ఇస్తామని అంగీకరించగా, మరికొందరు రూ.7–8 మాత్రమే ఇస్తామని తెలిపారు. దీనిపై ఎమ్మార్వో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులకు న్యాయం చేయకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్. చంద్రశేఖర్, మండల ఉపాధ్యక్షుడు లింగాల యానాదయ్య, రైతు సంఘ నాయకులు ఏదోటి ఆదినారాయణ, శివకృష్ణ చౌదరి, కొత్తపల్లి ఈశ్వరయ్య, జగదీష్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.