Sunday, 10 May 2026

Blog

తూర్పు గోదావరి

మార్యాడీలు నగర అభివృద్ధిలో ఒక భాగం : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, “మార్యాడీలు ఈ నగర అభివృద్ధిలో ఒక భాగం. వారి సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల్లో వారి చురుకైన పాత్రను నిర్లక్ష్యం చేయరాదు. వారిని వ్యతిరేకించే ఉద్దేశం మాకు లేదు” అని స్పష్టం చేశారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, “మార్యాడీలపై కొన్ని వర్గాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారిని వ్యతిరేకించడం సరికాదు. మార్యాడీలు వ్యాపారాలతో పాటు సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇది ప్రశంసనీయమైన విషయం” అని అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ మరింతగా మాట్లాడుతూ, “ప్రతి వర్గం రాజమండ్రి అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తోంది. మార్యాడీలు కూడా ఈ నగరంలో వందలాది కుటుంబాలు ఆధారపడే వ్యాపారాలు చేస్తున్నారు. వారికి వ్యతిరేకంగా నిలబడడం అనేది నగర సమగ్రాభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడటమే అవుతుంది. కాబట్టి వారిని గౌరవించాలి, వారి సహకారాన్ని స్వాగతించాలి” అని అన్నారు. అలాగే, ఆయన హితవు పలుకుతూ, “సామాజిక సమగ్రత కోసం ప్రతి వర్గం మధ్య పరస్పర గౌరవం, సహకారం అవసరం. అభివృద్ధి రాజకీయాలు, ప్రాంతీయ ప్రయోజనాలు పక్కన పెట్టి, అన్ని వర్గాలు కలిసి పనిచేస్తేనే రాజమండ్రి నిజమైన స్మార్ట్ సిటీ అవుతుంది” అని పేర్కొన్నారు. ముగింపు గా, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు: “మార్యాడీలపై అనవసర ఆరోపణలు, విభేదాలు సృష్టించడం మానుకోవాలి. వారిని వ్యతిరేకించే ప్రయత్నాలు చేస్తే, వాటిని తీవ్రంగా ఖండిస్తాం. మార్యాడీలు కూడా తమ సేవా కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ సమాజానికి ఆదర్శంగా నిలవాలి” అని అన్నారు.

హెల్త్ టిప్స్

మన ఆరోగ్యం…! పిక్క మన రెండో గుండె..!

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : మన ఆరోగ్యం…! పిక్క మన రెండో గుండె..! ఇప్పటివరకూ మనలో చాలామందికి తెలియని సంగతి ఒకటి తెల్సుకుందాం రండి… మనిషికి ఒకటే గుండె ఉంటుందన్నది అందరి అభిప్రాయం కదా. కానీ మన కాళ్లలో మరో రెండు గుండెలు ఉంటాయి. అవే… మన పిక్కలు. గుండె ఎలాగైతే రక్తాన్ని అన్ని అవయవాలకూ పంప్ చేస్తుందో… పిక్క కూడా అలాగే రక్తాన్ని పైకి పంప్ చేస్తుంది. పైగా గుండె నుంచి పంప్ చేసే రక్తం భూమ్యాకర్షణ శక్తి వల్ల మన కాళ్లకు చేరడం ఒకింత సులభం. కానీ… కాళ్ల నుంచి గుండెకు రక్తం ప్రవహించాలంటే పైవైపునకు అంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ప్రవహించాలి. అందుకు మరింత శక్తి కావాలి. ఆ శక్తిని సమకూర్చేదే పిక్క. అందుకే ‘పిక్క’ను మన శరీరపు రెండో గుండెకాయగా అభివర్ణిస్తారు. ఇక భాషాశాస్త్రానికి వద్దాం. గుండెబలం అంటే ఇప్పటివరకూ అర్థం మనోబలం. కానీ పిక్కబలం అంటే అధైర్యం చూపించి పరుగెత్తడం అని అర్థం. కానీ పిక్క గురించీ, గుండెలా అది నెరవేర్చే విధుల గురించీ వాస్తవం తెలిశాక పిక్కబలమూ ఇంచుమించూ గుండెబలంతో సమానమని మీకు వేరే చెప్పాలా? పిక్కకు ఎందుకీ గుండె డ్యూటీలు…? మన పిక్కను చూడండి. కాస్త గమనించి చూస్తే అటు ఇటుగా చూడ్డానికి గుండెలా అనిపించదూ? అనిపించడం ఏమిటి, అది నిజంగానే గుండె నిర్వహించే విధులు నిర్వహిస్తుంది. కారణం… గుండె తన పంపింగ్ ప్రక్రియ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ రక్తాన్ని సరఫరా చేస్తుంది. దానికో పంపింగ్ ప్రక్రియ ఉంది, పైగా అది శరీరంలో ఎగువన అనువైన ప్రదేశంలో ఉంది. కాబట్టి అన్నివైపులకూ రక్తాన్ని పంప్ చేయడం సులభం. అయితే కాళ్లూ, పాదాలకు చేరిన రక్తం మళ్లీ గుండెకు చేరాలంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా బలంగా పైకి రావాలి. అలా రావడంతో పాటు ఆ రక్తం అదనపు బరువును అంటే ఆక్సిజన్‌నూ, పోషకాలనూ తనతో మోసుకుపోవాలి. అలా చేసేందుకు పిక్క ఉపయోగ పడుతుంది. అందుకే దాన్ని ‘కాఫ్ మజిల్ పంప్’ (సీఎమ్‌పీ) అంటారు. అంతేకాదు… శరీరానికి రెండో గుండె అనీ, ‘పెరిఫెరల్ హార్ట్’ అని కూడా అంటారు. పిక్క గుండె డ్యూటీలెలా చేస్తుందంటే. పిక్కలోని అన్ని కండరాలూ కలిసి ఇలా గుండె విధులు నిర్వహిస్తుంటాయి. అయితే మరీ ముఖ్యంగా ఈ కండరాల్లోని రెండు ప్రధాన కండరాలైన గ్యాస్ట్రోనెమియస్, సోలెయస్ కండరాలు ఈ విధిని నిర్వహించడంలో కీలకంగా తోడ్పడతాయి. ఈ కండరాలు క్రమంగా ముడుచుకోవడం, తెరచుకోవడం (రిలాక్స్‌కావడం) అనే పనిని క్రమబద్ధంగా చేస్తూ రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి వెళ్లేలా చేస్తుంటాయి. భూమ్యాకర్షణ కారణంగా రక్తం కిందికి రాకుండా వాల్వ్ (కవాటాల) సహాయంతో మూసుకుపోతూ పైవైపునకే రక్తం ప్రవహించేలా చేస్తుంటాయి. ఈ రెండో గుండె సరిగా పనిచేయకపోతే… మన శరీరపు రెండో గుండె అయిన పిక్క సరిగా పనిచేయకపోతే అప్పటికే వినియోగితమైన రక్తం కాళ్లలో ఉండిపోతుంది. ఈ రక్తంలో ఆక్సిజన్ అప్పటికే కండరాల వల్ల వినియోగం అయిపోయి ఉండటం వల్ల మళ్లీ కండరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందదు. దాంతో కండరాలు తీవ్రమైన అలసటకు గురవుతాయి. ఈ సమస్య ఎవరెవరిలో ఎక్కువ? చాలా ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని పనిచేసేవారికి (ఆఫీసుల్లో పనిచేసేవారికి లేదా కదలకుండా ఇంటిపట్టునే ఉండేవారికి)ఎక్కువసేపు అదేపనిగా నిల్చొని పనిచేసే వృత్తుల్లో ఉండేవారికి (లెక్చరర్లు, టీచర్లు మొదలైనవారికి) స్థూలకాయంతో బాధపడేవారికి గర్భవతులుగా ఉన్న సమయంలో కొందరు మహిళలకు ఈ సమస్య రావచ్చు. సమస్యను అధిగమించడానికి చేయాల్సిందేమిటి?క్రమం తప్పకుండా నడవడం (రోజుకు 30 నుంచి 45 నిమిషాల చొప్పున వాకింగ్ చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదురోజులైనా నడవడం వల్ల పిక్కతో పాటు శరీరంలోని అన్ని కండరాలకూ వ్యాయామం ఏర్పడి పూర్తి ఆరోగ్యం బాగుంటుంది). మీ శరీరపు బరువును అదుపులో ఉంచుకోండి. (స్థూలకాయాన్ని తగ్గించుకోండి). మీ కాళ్లపై రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటే… వాటిని అదిమి వేసేలా వీనస్ స్టాకింగ్స్ అనే తరహా సాక్స్ వంటి తొడుగులను ధరించండి. ఇలా కనిపించినప్పుడు వీలైనంత త్వరగా డాక్టర్ సలహా తీసుకోండి. పిక్క గుండెలా పనిచేయనందున ఎదురయ్యే సమస్యలివే…! కాళ్ల చివరలకు రక్తసరఫరా చాలా తక్కువగా జరగడం మనకు వ్యాధి నిరోధకత ఏర్పరిచే లింఫ్ ప్రవాహం నిర్వీర్యం కావడం చెడు రక్తాన్ని తీసుకుపోయే సిరల కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం తగ్గడం వంటివి జరుగుతాయి. దీనివల్ల ఏర్పడే పరిణామాలివే…కాళ్లు ఎప్పుడూ అలసటతో ఉండటం కాళ్లూ, పాదాలలో వాపు వేరికోస్ వెయిన్స్ (అంటే కాళ్లపై ఉండే చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు (సిరలు) ఉబ్బినట్లుగా చర్మం నుంచి బయటకు కనిపించడం)కాలిపై ఏర్పడే పుండ్లు చాలాకాలం పాటు తగ్గకుండా అలాగే ఉండటంకాళ్లు రెండూ అదేపనిగా చకచకా కదిలిస్తూ ఉండే రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అనే కండిషన్‌తో బాధపడటంకాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం(డీప్ వీన్ థ్రాంబోసిస్) -డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి. చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్.

అన్నమయ్య

ఊటుకూరు వారి వివాహ రిసెప్షన్‌లో బత్యాల చంగల్‌రాయుడు పాల్గొనడం

రాజంపేట పట్టణం తిరుపతి రోడ్డులోని S.R కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం ఘనంగా వివాహ రిసెప్షన్ జరిగింది. రాజంపేట పట్టణం ఉస్మాన్‌నగర్‌ వాసులు, టీడీపీ నేత, తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి నరసింహ (రాంనగర్ నరసింహ) సోదరీమణి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ బత్యాల చంగల్‌రాయుడు హాజరై నూతన వధూవరులు అనిత-హరీష్ దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.

విద్య విజ్ఞానం

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషికి కేంద్రం మద్దతు

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా వేగంగా అడుగులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషికి కేంద్రం మద్దతు సమగ్రశిక్షకు గతంలో కంటే అదనంగా రూ.432.19 కోట్లు నిధులు మంజూరు మంత్రి లోకేష్ చొరవతో ఏపీకి అధిక ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం అమరావతిః విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో దేశంలోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ఉత్తమంగా తీర్చిదిద్ది ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి అందరూ మాట్లాడుకునే విధంగా చేస్తామనే విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంకల్పానికి కేంద్రం కూడా మద్దతుగా నిలుస్తోంది. సమగ్రశిక్షకు గతంలో కంటే అదనంగా రూ.432.19 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది. దేశానికే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ దిక్సూచిగా మారాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష వినూత్నమైన కార్యక్రమాలతో, విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచే విధంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ సమగ్రశిక్షకు కేంద్రం నుంచి నిధులు మంజూరు అయ్యాయి. మంత్రి లోకేష్ చొరవతో నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్రానికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మంత్రి లోకేష్ కృషి

తిరుపతి

డ్రోన్ కెమెరాలతో పేకాట శిబిరాలపై దాడి.

తిరుపతి జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో గత కొద్దిరోజులుగా డ్రోన్ కెమెరాలతో బీట్ నిర్వహించడం జరుగుతున్నది.అందులో భాగంగా ఈరోజు ఏర్పేడు పోలీస్ వారు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో ముసిలిపేడు,బండారు పల్లి,మేర్లపాక,రామలింగాపురం,కందాడ గ్రామాలలో బీట్ నిర్వహించారు.ముసిలిపేడు నందు పొలాల్లో 11 మంది పేకాట ఆడుతూ ఉన్నవారిని పట్టుకొని వారి నుండి రూ.2,36,740 నగదు,12 సెల్ ఫోన్లు,4 బైక్ లు సీజ్ చేయడం జరిగింది.ఇటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీస్ వారు హెచ్చరించారు.

అన్నమయ్య

రైల్వే కోడూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

చిట్వేల్, ఓబులవారిపల్లి మండలాల్లో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి మొత్తం రూ.2,73,196 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు అందజేశారు. లబ్ధిదారుల్లో సింగన రుక్మిణమ్మకు రూ.1,40,000, గడ్డం చలపతికి రూ.25,166, సింగయ్యగారి రాజమ్మకు రూ.1,08,030 మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

క్రైమ్

నిడిగుంట అరుణకు 14 రోజుల రిమాండ్ విధించిన నెల్లూరు కోర్టు

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : నిడిగుంట అరుణకు 14 రోజుల రిమాండ్ విధించిన నెల్లూరు కోర్టు అపార్ట్మెంట్ ఓనర్ ని మోసం చేసిన కేసులో రిమాండ్ రూ.28 లక్షల బేరం కుదుర్చుకుని రూ.3 లక్షలు మాత్రమే చెల్లించిన అరుణ మిగతా డబ్బులు చెల్లించకుండా యజమానిని ఇబ్బంది పెట్టిన అరుణ దింతో కోర్టును ఆశ్రయించిన బాధితుడు 2024లో కొంతమంది వ్యక్తులతో కలిసి ఓనర్ ని బెదిరించిన అరుణ మెడపై కత్తి పెట్టి తనపేరు మీదకి ఫ్లాట్ మార్చిలని బెదిరింపులు

ఎలూరు

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చిన్నా ఆగిరిపల్లి లో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్ ఐ శుభ శేఖర్ తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని చిన్నఆగిరిపల్లి కి చెందిన చెందిన రాముకు కృష్ణాజిల్లా కూచిపూడి కి చెందిన వెంకట సోనియాకు( 28) ఆరు సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ఇరువురు పిల్లలు. కొద్ది రోజులుగా రాముకు, సోనియాకు మధ్య మనస్పర్ధలతో గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లి వెంటనే తిరిగి రాలేదని భర్త ఆమెతో మాట్లాడటం లేదు. దీంతో మనస్తాపం చెందిన సోనియా మంగళవారం అర్ధరాత్రి తన ఇంట్లోనే ఉరి వేసుకుంది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. సోనియా తండ్రి వీరస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

⁠మంత్రి ఫరూక్ తో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ భేటీ.

నెల్లూరు పున్నమి న్యూస్ ప్రతినిధి నాగరాజు ఆగష్టు 20 ://// రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రివర్యులు నశ్యం మొహమ్మద్ ఫరూక్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తాడేపల్లి లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిరువురూ వక్ఫ్ బోర్డ్ అభివృద్ధి, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ముస్లిం లకు సంక్షేమ కార్యక్రమాలపై సవివరంగా చర్చించారు. వక్ఫ్ ఆస్తులు ముస్లిం ల సమాజ భవిష్యత్తుకు మూలస్తంభాలని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజ ప్రయోజనానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముస్లిం మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ల ఏర్పాటు ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు. మహిళలకు వృత్తి ఆధారిత శిక్షణ ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అబ్దుల్ అజీజ్ తెలిపారు. ముస్లిం విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా, నూతన విద్య పథకాన్ని తీసుకువచ్చి వారిలో సమర్థత ను పెంచాలని సూచించారు. అన్నిటికి సానుకూలంగా స్పందించిన మంత్రి ఫరూక్ వక్ఫ్ బోర్డ్ అభివృద్ధి కోసం, ముస్లిం ల సంక్షేమం కోసం అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. వక్ఫ్ బోర్డ్ భవిష్యత్తు, మైనారిటీల కు విద్యా ఉపాధి రంగాల్లో అవకాశాలు సృష్టించే దిశగా ముందుకు సాగుదామని భరోసా కల్పించారు.

హైదరాబాద్

గో బ్యాక్ మార్వాడి అనడం తప్పు : బిజెపి తెలంగాణ అధ్యక్షులు రామ చంద్రరావు

గో బ్యాక్ మార్వాడీ నినాదాలు చేయడం తప్పు. అని మార్వాడీలకు తెలంగాణ బీజేపీ మద్దత్తు గా ఉంటుంది అని బిజెపి తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు అన్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయులు ఎక్కడైనా జీవించొచ్చు అని చాలా మంది తెలంగాణ వాళ్లు కూడా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు అని గుర్తు చేశారు తప్పు చేస్తే శిక్షించాలి కానీ మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు అని నారప రాజు రాంచందర్ రావు అన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.