Sunday, 10 May 2026

Blog

ఖమ్మం

రోడ్డు మరమ్మత్తు చేయాలి అని డిమాండ్ చేస్తూ బిజెపి బి ఆర్ ఎస్ తెలుగు దేశం పార్టీ ల ఆధ్వర్యంలో ధర్నా

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) ఖమ్మం బైపాస్ నుండి కామంచికల్ వెళ్లే ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించాలని బీజేపీ, బిఆర్ఎస్,టీడీపీ, రామన్నపేట, దానవాయిగూడెం ఆటో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఈ రాస్తారోకో ని ఉద్దేశించి బీజేపీ ఖమ్మం జిల్లా యువ నాయకులు వల్లాల రమేష్ యాదవ్ మాట్లాడుతూ ఈ రోడ్డు నుండి సుమారు 15 గ్రామాల ప్రజలు ఖమ్మం నగరానికి రాకపోకలు చేస్తూ ఉంటారు అని అధ్వానంగా గుంటలమయంగా ఉన్న ఈ రోడ్డు వల్ల ఆ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అంతే కాకుండా ఆటో కార్మికులు కూడా పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఖమ్మం జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ఉన్న ఈ చిన్న రోడ్డు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు అని రమేష్ ప్రభుత్వం ని ప్రశ్నించారు.ఈ రోడ్డు సమస్యను పరిష్కరించే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వాళ్ళలా రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో గజ్జల శ్రీనివాస్, కందుల శ్రీ కృష్ణ ఇతర బిజెపి, బి ఆర్ ఎస్, తెలుగు దేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

తెలంగాణ

బ్రహ్మదేవర అనసూయమ్మ గారికి నివాళులు అర్పించిన :పట్టణ అధ్యక్షులు

ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మదేవర బ్రహ్మయ్య, రామ్మోహన్ గారి తల్లి బ్రహ్మదేవర అనసూయమ్మ నిన్న మరణించినది. ఆమె యొక్క కన్నులను లయన్స్ క్లబ్ కు దానం (నేత్రదానం ) చేసినది. నకిరేకల్ పట్టణ బి. జె. పి. అధ్యక్షులు గర్రె మురళి మోహన్, సందుపట్ల వేణుమాధవ్, కారింగుల యాదగిరి రాజయోగి గారు ఆకుటుంబ సభ్యులను పరామర్శించి, అనసూయమ్మ గారికి నివాళులు అర్పించారు.

సక్సెస్ స్టోరీస్

అగ్ని-5 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : అగ్ని-5 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-5 ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగం అగ్ని-5 మిసైల్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించిందని వెల్లడించిన రక్షణ శాఖ వర్గాలు

ఆంధ్రప్రదేశ్

టీమిండియా మేనేజర్ గా తెలుగు వ్యక్తి ప్రశాంత్

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : భారత క్రికెట్ జట్టులో తెలుగు వ్యక్తికి కీలక బాధ్యత లభించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మాజీ ఉపాధ్యక్షుడు, భీమవరానికి చెందిన పీవీఆర్ ప్రశాంత్ ను టీమిండియా మేనేజర్ గా నియమించారు.త్వరలో జరగనున్న ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ కు ఆయన భారత జట్టుకు మేనేజర్ గా వ్యవహరించనున్నారు.. కాగా భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కుమారుడే ప్రశాంత్. అలాగే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు అల్లుడు.

ఖమ్మం

ప్రజా

ఈ రోజున 57 డివిజన్ పర్యటనలో భాగంగా పోలింగ్ బూత్ నెంబర్ 110 ఉన్న స్కూల్ ఆవరణంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది. రుద్రగాని మాధవ్ గౌడ్ భారతీయ జనతా పార్టీ ఖమ్మం రెండో పట్టణ ప్రధాన కార్యదర్శి ముందస్తుగా ప్రజలు రోగాల బారిన పడకుండా మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులతో బూతు స్థాయిలో తిరిగి ప్రజల బాగోగులు తెలుసుకుంటూ సేవలందిస్తున్నారు

ఖమ్మం

*ఆగస్టు 22న తెలంగాణ బంద్*

మార్వాడీల దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22న తెలంగాణ బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఓయూ జేఏసీ ప్రకటించింది. సోమవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ.. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన మార్వాడీలు తెలంగాణ కుల వృత్తులను దెబ్బతీస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలను మార్వాడీలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మార్వాడీ గో బ్యాక్ అంటూ జేఏసీ నేతలు నినాదాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్

ఉచిత ప్రయాణానికి త్వరలో స్మార్ట్ కార్డులు

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు అతి త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు అందిస్తామని మని ఆర్టీసీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరు మలరావు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలోని ఆర్టీసీ డిపోను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఇప్పటికే రోజుకు 18 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, ఈ సంఖ్య రాబోయే రోజుల్లో 26 లక్షలకు పెరుగుతుందని అంచనా వేశారు. ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీ ఆదాయానికి గండి పడకుండా ప్రభుత్వమే భరి స్తుందని ఎండీ తెలిపారు.

క్రైమ్

ప్రభుత్వ లాయర్లపై వేటు: సంచలనం సృష్టిస్తున్న క్రమశిక్షణ చర్యలు

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రభుత్వ న్యాయవాదులపై (పబ్లిక్ ప్రాసిక్యూటర్లు-పీపీలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు-ఏపీపీలు) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏకంగా 17 మంది లాయర్లపై వేటు వేసింది. ఇందులో ఇద్దరు పీపీలు, 15 మంది ఏపీపీలు ఉన్నారు. ఈ కఠిన నిర్ణయం న్యాయ వ్యవస్థలోనూ, న్యాయవాదుల వర్గంలోనూ చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు ప్రభుత్వ న్యాయవాదులు, ప్రభుత్వ నియమాలకు, నిబంధనలకు కట్టుబడి పనిచేయాలి. అయితే, దీనికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ సిఫార్సుల మేరకు ఈ తొలగింపు నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తొలగింపులు: ఎవరెవరిపై వేటు? ఈ చర్యల్లో భాగంగా పలు జిల్లాల్లోని ప్రముఖ న్యాయవాదులు తమ పదవులను కోల్పోయారు. వీరిలో: కర్నూలు సెషన్స్ కోర్టు పీపీ వెంకటరెడ్డి, ఆత్మకూరు కోర్టు ఏపీపీ అసిఫ్ ఆలీ ఖాన్, 4వ అడిషనల్ కోర్టు ఏపీపీ ప్రకాశ్‌రెడ్డి, అడిషనల్ ఏపీపీ కోర్టు ఏపీపీ బాల రంగస్వామి. ఒంగోలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టు పీపీ సుంధర. అనంతపురం జిల్లా గుత్తి 4వ అదనపు జిల్లా కోర్టు ఏపీపీ సుదర్శన్‌రెడ్డి. కడప జిల్లాలో ఏడో అదనపు కోర్టు ఏపీపీ మొఘల్ ఎస్మిన్ బేగం, 6వ అడిషనల్ కోర్టు ఏపీపీ ప్రతాప్ కుమార్‌రెడ్డి. చిత్తూరు జిల్లా మదనపల్లి కోర్టు ఏపీపీ వి.జయ నారాయణరెడ్డి, రాయచోటి 5వ అడిషనల్ కోర్టు ఏపీపీ టి.జగన్మోహన్ రెడ్డి. కృష్ణా జిల్లా మచిలీపట్నం అడిషనల్ జడ్జి కోర్టు ఏపీపీ సియాద్రి చిన్నారావు, గుడివాడ 11వ అదనపు కోర్టు ఏపీపీ షేక్ రెహ్మతుల్లా. గుంటూరు జిల్లాలో అడిషనల్ కోర్టు ఏపీపీ పల్లపు కృష్ణ, 4వ అసిస్టెంట్ జడ్జి కోర్టు ఏపీపీ జోత్స్న, 12వ అడిషనల్ కోర్టు ఏపీపీ బొడ్డు కోటేశ్వరరావు. నెల్లూరు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు ఏపీపీ ప్రసాదరావు. ఈ తొలగింపుల తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా, ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోందని స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఈ తరహా చర్యలు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

నేడు ఏపీ కేబినెట్ సమావేశం.

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : నేడు ఏపీ కేబినెట్ సమావేశం. సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం. జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పుపై చర్చించే అవకాశం. కేబినెట్ తర్వాత మంత్రులతో భేటీకానున్న చంద్రబాబు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్న చంద్రబాబు. ఎమ్మెల్యే లా వ్యవహారశైలి, వివాదాలపై చర్చించే అవకాశం.

ఆంధ్రప్రదేశ్

అప్పనపల్లి లో పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి లో శ్రీబాల బాలాజీ దేవస్థానం స్నానాల ఘాటు పూర్తిగా నీట మునగడంతో శ్రీబాల బాలాజీ దేవస్థానం స్నానాల ఘాటు వైపు స్థానికులను ఎవర్ని వెళ్లకుండదుఆని, ప్రమాదలకు గురికావద్దు అని వీఆర్వో అన్నపూర్ణ రావు, మహిళ పోలీస్ రాధ హెచ్చిరిస్తున్నారు. స్వామి వారి భక్తులను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని ఎక్కువ సమయం వృధా చేయవద్దు అని వీఆర్వో అన్నపూర్ణ రావు, మహిళ పోలీస్ రాధ జాగ్రత్తలు చెప్పుతున్నారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయటం తో భద్రాచలం వద్ద 50.3 అడుగుల నీటిమట్టం పెరగడంతో అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ దేవస్థానం స్నానాల ఘాటు అతి ప్రమాదంగా మారడంతో అక్కడే ఉండి వెళ్లి వచ్చే భక్తులను ఆయా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తక్షణమే వెళ్లాలని అప్పనపల్లి వీఆర్వో అన్నపూర్ణ రావు, మహిళ పోలీస్ రాధ బాధ్యతగా తెలియజేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.