Sunday, 10 May 2026

Blog

E-పేపర్

పట్టించుకోని నేషనల్ హైవే అధికారులు :

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నకిరేకల్ నుండి సూర్యాపేట కి వెళ్లే నేషనల్ హైవే 65(NH–65) రహదారిలో ఇనుపాముల గుట్ట వద్ద బైపాస్ రోడ్డును సగం పూర్తి చేసి, మిగతా సగం పూర్తి చేయకుండా పనులను అర్ధాంతరంగా ఆపివేశారు. ఈ రహదారిని పూర్తి చేయుటకు అధికారులు తగు చర్యలు తీసుకొని పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ ప్రదేశంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. కావున ప్రజలు జాగ్రత్తగా ప్రయాణించాలి.

E-పేపర్

పోలూరు గ్రామంలో చెత్తాచెదారులతో నిండిన మురికి కాలువలు సంవత్సరాల్లో కానరాని పరిశుభ్రత…

నంద్యాల జిల్లా నంద్యాల మండల పరిధిలోని పోలూరు గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి ఏమాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని అలాగే గ్రామంలో ఎక్కడ చూసినా మురికి కాలువల దగ్గర పిచ్చి మొక్కలతో, చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వస్తుందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా గత రెండేళ్ల నుండి మురికి కాలువలను పరిశుభ్రం చేయకపోవడంతో కాల్వల్లో మురికి నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తుందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. బుధవారం పోలూరు గ్రామంలో విలేకరుల బృందం పర్యటించినప్పుడు ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేలాది రూపాయల ఖర్చు చేస్తూ ప్రతి మాసం మూడవ శనివారం స్వచ్ఛభారత్ స్వచ్ఛంద్ర నినాదంతో పరిశుభ్రం చేయాలని మరియు గ్రామాల అభివృద్ధి కొరకు పాటుపడాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ పోలూరు గ్రామంలో ఎక్కడ చూసినా మురికి కాలువల వెంట పిచ్చి మొక్కలు ప్లాస్టిక్ బాటిల్ అలాగే చెత్త చెదారంతో దర్శనమిస్తూ అంటురోగాలు ప్రబలడానికి ఆస్కారం ఉందని దీంతో అధికారులు స్పందించకపోవడం కడు శోచనీయంమని బహిరంగంగా ప్రజలు విమర్శిస్తున్నారు. నంద్యాల మండలంలోని పోలూరు గ్రామంలో సుమారుగా ఐదువేల జనాభా నివాసముంటున్నారు. జనాభాను దృష్టిలో పెట్టుకొని గ్రామని అభివృద్ధి చేయాలని గ్రామ సర్పంచ్, పంచాయతీరాజ్ వ్యవస్థ అలాగే పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంది. అయినా గత మూడు సంవత్సరాల నుండి మురికి కాలువలను శుభ్రం చేయకపోవడం వల్ల చెత్తాచెదారాలతో కాలువలు మూసుకుని పోయాయని ప్రజలు బహిరంగంగా చర్చించుకోవడం విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా గ్రామ సచివాలయం దగ్గర అంగన్వాడి కేంద్రం నిర్వహణలో ఉంది. అక్కడ చదువు కొనసాగిస్తున్న విద్యార్థిని విద్యార్థులు బయటికి వస్తే పిచ్చి మొక్కలు విపరీతంగా పెరగడంతో విషపూరితమైన పురుగులు సంచరిస్తున్నడం తో ప్రమాదవశాత్తు పిల్లలకి ఏమైనా ప్రమాదం వస్తుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు సర్పంచు అందుబాటులో ఉండడు శాశ్వత ప్రాతి పాదికన పంచాయతీ కార్యదర్శి లేడు దీంతో గ్రామ సర్పంచ్ అందుబాటు లేకపోవడం గ్రామానికి శాశ్వత ప్రాతిపదికన పంచాయతీ కార్యదర్శి లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు పున్నమి కు తెలియజేశారు.కాగా గ్రామ సర్పంచ్ గ్రామంలో లేకపోవడం వల్ల అలాగే పంచాయతీ కార్యదర్శి రెగ్యులర్ గా లేకపోవడం వారానికి ఒకసారి సర్పంచ్ గ్రామాల్లో ఉండడంవల్ల పరిస్థితులు ఏర్పడ్డాయని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. సచివాలయం దగ్గర వెనుక భాగాన అలాగే అంగన్వాడి సమీపంలో పిచ్చి మొక్కలు పెరిగి పంట పొలాలను తలపిస్తున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. అందువల్ల జిల్లా ఉన్నత అధికారులు ఇప్పటికైనా గ్రామాన్ని సందర్శించి గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని గ్రామ ప్రజలు పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు.

భక్తి

నేటి పంచాంగం

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 జయ జయ శంకర హర హర శంకర గాయత్రీ రక్షా సర్వ జగద్రక్ష గురువారం,21,8,2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం – వర్ష ఋతువు శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి:త్రయోదశి మ12.54 వరకు వారం:గురువారం(బృహస్పతివాసరే) నక్షత్రం:పుష్యమి రా1.19 వరకు యోగం:వ్యతీపాతం సా6.22 వరకు కరణం:వణిజ మ12.54 వరకు తదుపరి భద్ర రా12.24 వరకు వర్జ్యం:ఉ9.38 – 11.12 దుర్ముహూర్తము:ఉ9.57 – 10.48 మరల మ2.59 – 3.49 అమృతకాలం:రా7.02 – 8.36 రాహుకాలం:మ1.30 – 3.00 యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30 సూర్యరాశి:సింహం చంద్రరాశి:కర్కాటకం సూర్యోదయం:5.47 సూర్యాస్తమయం:6.20 మాసశివరాత్రి సర్వేజనా సుఖినోభవంతు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి 🙏🏻 శుభమస్తు🙏🏻

సినిమా

వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్.

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 6 కోట్లు తన బంధువు వద్ద అప్పు గా తీసుకున్న దాసరి కిరణ్ ఆ డబ్బు ను వ్యూహం సినిమా కు మళ్లించిన దాసరి కిరణ్ అప్పటినుండి డబ్బు వెనక్కు ఇవ్వాలని అనేకసార్లు దాసరి కిరణ్ ను అడిగిన బాధితుడు 18 ఆగస్టు నాడు డబ్బు ఇవ్వాలని అడగగా హత్యాప్రయత్నం చేశారని ఫిర్యాదు చేసిన బాధితుడు. బాధితుని ఫిర్యాదు మేరకు దాసరి కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేసిన విజయవాడ పటమట పోలీసులు

బిజినెస్

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రసంగం

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : రతన్ టాటా భరత జాతి ముద్దుబిడ్డ – దేశానికి ఏదైనా చేయాలని రతన్ టాటా తపించేవారు – హైదరాబాద్ ఐటీ అభివృద్ధికి రతన్ టాటా తన సూచనలను నాతో పంచుకున్నారు – సమాజసేవకు రతన్ టాటా జీవితాంతం కృషి చేశారు – ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనే చూస్తారు – రతన్ టాటా మాత్రం సంపాదించిన డబ్బును సమాజానికి తిరిగిచ్చేవారు – రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నాం – ప్రతి కుటుంబం నుంచి ఎంట్రప్రెన్యూర్ రావాలనేదే నా నినాదం – గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని కృషి చేశాను – సరైన ప్రభుత్వ విధానాలు అవలంభిస్తే ఆదాయం, సందప వస్తుంది – భవిష్యత్ అంతా ఐటీ రంగానిదే అని గుర్తించాను – దేశంలో ఎవరూ చేయలేనంతగా ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశాం – గత 10 ఏళ్లలో 11వ ఆర్థికవ్యవస్థ నుంచి నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించాం – త్వరలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించబోతున్నాం – సంపద సృష్టిస్తే.. ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది.. సంక్షేమం చేయవచ్చు – కమ్యూనిజం, కేపటలిజం ఏమీ ఉండదు.. టూరిజమే ఉంటుంది – ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేయడమే లక్ష్యం – ఒక వైపు సందప సృష్టిస్తూనే.. పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నాం – ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త ఉండాలనేదే లక్ష్యం – పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు పనిచేస్తాయి – గతంలో ప్రతి ఇంట్లో ఒక ఐటీ నిపుణుడు ఉండాలనే లక్ష్యంతో పనిచేశాం – రతన్ టాటా నిరాడంబరత, దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శం – ఇన్నోవేషన్ హబ్ లను రతన్ టాటా పేరుతో ప్రారంభించాలని నిర్ణయించాం – నేను, లోకేష్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాం – మా ఇంటి నుంచి భువనేశ్వరి, బ్రహ్మణి వ్యాపారాన్ని సమర్థంగా నిర్వర్తిస్తున్నారు – అమరావతి నగరం క్వాంటం కంప్యూటింగ్ హబ్ గా అభివృద్ధి చెందుతుంది – పారిశ్రామికవేత్తలుగా రికార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ శుభాకాంక్షలు సీఎం చంద్రబాబు

సినిమా

సినీ నటి శ్రీమతి సుహాసిని

• జన్మ నామం సుహాసిని • జననం 1961 ఆగస్టు 15 (వయస్సు 59) • భర్త మణిరత్నం • ప్రముఖ పాత్రలు సిరివెన్నెల,సంసారం ఒక చదరంగం, స్వాతి (సినిమా) సుహాసిని ( 1961 ఆగస్టు 15) దక్షిణ భారత నటి. దర్శకుడు మణిరత్నంను వివాహమాడింది. తమిళనాడులో గల చెన్నై పట్టణంలో జన్మించింది. నటనలోనే కాకుండా కథకురాలిగా, నిర్మాతగా అనుభవముంది. ఈవిడ తొలిసారి 1980లో నెంజతై కిల్లతే అనే తమిళ చిత్రంలో నటించింది. సుహాసిని, భారతీయ నటుడు కమల హాసన్ అన్న, నటుడు చారు హాసన్ కూతురు. 1988లో ఈమె ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నంను పెళ్ళిచేసుకున్నది. వీరికి 15 యేళ్ళ వయసున్న కొడుకు ఉన్నాడు. 1996లో, దర్శకత్వములో అడుగుపెట్టి, జి.వి.ఫిల్మ్స్ నిర్మించిన ఇందిర సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా సుహాసినినే సమకూర్చింది. ఈమె, ఈమె భర్త, తమ సొంత చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ టాకీస్ యొక్క నిర్వహణ పనులు చూసుకుంటూ ఉంటారు. మద్రాస్ టాకీస్ లో మణిరత్నం సోదరుడు కీ.శే. జి.శ్రీనివాసన్ కూడా ఉండేవారు. సుహాసిని 1985లో కె.బాలచందర్ దర్శకత్వము వహించిన తమిళ సినిమా సింధుభైరవిలో తన నటనకు గాను 1986లో ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారము (ఉత్తమనటి) అవార్డు అందుకున్నది. ఈమె తమిళ, తెలుగు, కన్నడతో పాటు మళయాళము భాషా చిత్రాలలో కూడా నటించింది. 1999లో ఎ.ఎఫ్.ఐ చిత్రోత్సవముకు ఎన్నికైన వానప్రస్థమ్ సినిమాలో సుహాసిని తన నటనకుగాను ప్రశంసలందుకున్నది. చిత్రసమాహారం నటిగా తెలుగు • ఎంత మంచివాడవురా! (2020) • సూర్యకాంతం (2019) • సంగమం (నిర్మాణంలో ఉంది) • శ్రీ మహాలక్ష్మి (2007) • రాఖీ (2006) • అమ్మ చెప్పింది (2006) • షాక్ (2004) • దొంగరాముడు అండ్ పార్టీ (2003) • గెలుపు (2002) • నువ్వు నాకు నచ్చావ్ (2001) • సకుటుంబ సపరివార సమేతం (2000) • రాజకుమారుడు (1999) • ఊయల (1998) • పెళ్లి పందిరి (1997) • ఎగిరే పావురమా (1997) • హలో గురూ (1996) • శుభలగ్నం (1994) • అక్క మొగుడు (1991) • మరణ మృదంగం (1988) • మంచి దొంగ (1988) • ఆఖరి పోరాటం (1988) • పున్నమి చంద్రుడు (1987) • పుణ్యదంపతులు (1987) • బావామరదళ్లు (1987) • వారసుడొచ్చాడు (1987) • ఆరాధన (1987) • సంసారం ఒక చదరంగం (1987) • తేనె మనసులు (1987) • గౌతమి (1987) • శ్రావణ సంధ్య (1986) • రాక్షషుడు (1986) • చంటబ్బాయ్ (1986) • కిరాతకుడు (1986) • మిస్టర్ భరత్ (1986) • ముద్దుల మనవరాలు (1986) • శాంతినివాసం (1986) • సిరివెన్నెల (1986) • స్రవంతి (1986) • అర్జున్ 3D (1985) • మహారాజు (1985) • బుల్లెట్ (1985) • జాకీ (1985) • స్వాతి (1985) • ఇంటిగుట్టు (1984) • సర్దార్ (1984) • ఛాలెంజ్ (1984) • జస్టిస్ చక్రవర్తి (1984) • మంగమ్మ గారి మనవడు (1984) • ముక్కు పుడక (1984) • మనిషికో చరిత్ర (1984) • మగ మహారాజు (1983) • మంచుపల్లకి (1982) • కొత్త జీవితాలు (1981) నిర్మాతగా • ఇద్దరు (1997) సేకరణ .

ఆంధ్రప్రదేశ్

24 ప్రధాన డిమాండ్లు 68 డిపార్ట్మెంట్ సమస్యలు సమావేశం దృష్టికి తీసుకువెళ్లినట్లు రాష్ట్ర అధ్యక్షులు

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : ఏపీ సచివాలయం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధ్యక్షతన బుధవారం జరిగిన సివిల్ సర్వీస్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ లో ఏపీ ఎన్జీ జీఓ సంఘం 24 ప్రధాన డిమాండ్లు 68 డిపార్ట్మెంట్ సమస్యలు సమావేశం దృష్టికి తీసుకువెళ్లినట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ తెలిపారు. ఇందు లో భాగంగా పి.ఆర్.సి కమిషనర్ నియామకం గురించి గత ప్రభుత్వ కాలంలో డా. మన్మోహన్ సింగ్, ఐ.ఏ.ఎస్ (రిటైర్డ్) గారిని 12వ వేతన సవరణ సంఘం కమిషనర్‌గా నియమించడం జరిగిందని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన పదవికి రాజీనామా చేశారని జూలై 23 నుండి వేతన సవరణలు అమలుకావలసి ఉన్నప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు గడిచిందని ఉద్యోగులు పెన్షనర్లకు న్యాయం జరిగేలా తక్షణమే కొత్త కమిషనర్‌ననియమించవలసిందిగా విజ్ఞప్తిచేశామని తెలిపారు.బకాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డి.ఏ/డి.ఆర్‌ను తక్షణమే మంజూరు చేసి విడుదల చేయవలసిందిగా కోరడం జరిగింది తెలిపారు. సంపాదించిన సెలవు డబ్బులు, డి.ఏ. & పి.ఆర్.సి బకాయిలు గత 3–4 సంవత్సరాలుగా సంపాదించిన సెలవు మొత్తాలు, డి.ఏ. బకాయిలు, పి.ఆర్.సి బకాయిలు విడుదల కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని త్వరితగతిన ఆర్థిక ఆమోదం తెలపాలని కోరారు. తాత్కాలిక ఉపశమన భత్యం (Interim Relief) మంజూరు పి.ఆర్.సి కమిషనర్ పునర్నియామకంలో ఆలస్యం, పి.ఆర్.సి నివేదిక తుదీకరణలో జాప్యం దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తాత్కాలిక ఉపశమన భత్యం మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నామన్నారు. పెన్షన్ ప్రయోజనాల చెల్లింపు రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్ మొత్తాలు మొదలైనవి తక్షణమే విడుదల చేసి, వారికీ రిటైర్మెంట్ అనంతరం అవసరాలు తీర్చుకునేలా ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా కోరారు. అదనపు పెన్షన్ పునరుద్ధరణ 70 నుండి 75 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్లకు బేసిక్ పెన్షన్‌పై 10%, 75 నుండి 80 సంవత్సరాల మధ్య వయస్సు వారికి 15% అదనపు పెన్షన్ ఇవ్వబడేది. 11వ పి.ఆర్.సి అమలు తర్వాత రద్దు అయిన ఈ సదుపాయాన్ని తిరిగి పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నామన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ 2023లో ప్రభుత్వం జూన్ 2014 లోపు నియమించబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకుని దాదాపు 3000 మందిని రెగ్యులరైజ్ చేసింది. మిగిలిన సుమారు 7000 మంది (కాంట్రాక్ట్ లెక్చరర్స్, హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్ మొదలైన శాఖలలో పనిచేస్తున్న వారు) సేవలను కూడా రెగ్యులరైజ్ చేయవలసిందిగా కోరడంజరిగిందని తెలిపారు రిటైర్మెంట్ వయస్సు పెంపు (పబ్లిక్ సెక్టార్ & గురుకుల ఉద్యోగులకు) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచారు. అదే విధంగా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ మరియు గురుకుల సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకూ ఈ సౌకర్యాన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాము. OPS అమలు (01.09.2004 లోపు నియమితులైన వారికి) 01.09.2004 లోపు నియమించబడిన ఉద్యోగులకు CPS స్థానంలో పాత OPS విధానం అమలు చేయవలసిందిగా మనవి చేయడం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సారి ఆప్షన్ ఇచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా OPS పునరుద్ధరించవలసిందిగా మనవి. CPS ఉద్యోగుల DA బకాయిలు, ఇప్పటికే ఆదాయపన్ను మినహాయింపు జరిపిన కాలానికి నగదుగా చెల్లించవలసిందిగా మనవి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉద్యోగులకు హౌస్ సైట్లు అమరావతి క్యాపిటల్ రీజియన్‌లో HoD ఉద్యోగులకు హౌస్ సైట్లు కేటాయించేందుకు జి.ఓ (No.66, Dt:13-02-2019) జారీ అయినా ఇప్పటివరకు అమలు కాలేదు. దీన్ని తక్షణమే అమలు చేయవలసిందిగా మనవి. బోనస్ ప్రకటన (2014–2017, 2017–2020, 2020–2023) APGLI పాలసీలకు సంబంధించిన బోనస్‌లు ఇప్పటికీ ప్రకటించబడలేదు. దీంతో రిటైర్ అవుతున్నవారు, లోన్లు తీసుకున్నవారు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఫైలు (No.2489454) ఫైనాన్స్ శాఖలో పెండింగ్‌లో ఉన్నది. కావున ఈ ట్రైనియమ్స్‌కు సంబంధించిన బోనస్‌ను తక్షణమే ప్రకటించవలసిందిగా కోరుతున్నామ EHS స్టీరింగ్ కమిటీ సమావేశంగౌరవ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించవలసిన EHS స్టీరింగ్ కమిటీ సమావేశం తక్షణమే నిర్వహించవలసిందిగా మనవి చేశామని తెలిపారు . ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఇన్షూరెన్స్ స్కీమ్‌గా మార్చడం ప్రస్తుతం అమలులో ఉన్న EHS‌ను, ప్రైవేట్ హెల్త్ ఇన్షూరెన్స్ కంపెనీల ద్వారా ఇన్షూరెన్స్ పథకంగా మార్చి, ఉద్యోగులు, పెన్షనర్లకు అధిక పరిమితి రీయింబర్స్‌మెంట్ మరియు మెరుగైన చికిత్సా సదుపాయాలు అందేలా చేయవలసిందిగా మనవి EHS సబ్‌స్క్రిప్షన్ నిధుల నేరుగా జమ ఉద్యోగుల నుండి వసూలు చేసిన EHS సబ్‌స్క్రిప్షన్ రుసుములు మరియు ప్రభుత్వ వాటాను నేరుగా NTR ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కి జమ చేయాలని సర్క్యులర్ మెమో (26.05.2023) ద్వారా ఇప్పటికే నిర్ణయించారు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి, ఆసుపత్రులకు చెల్లింపులు వేగంగా జరిగేలా చూడవలసిందిగా మనవి. వైద్య రీయింబర్స్‌మెంట్ విధానంలో మార్పులు రీయింబర్స్‌మెంట్ గరిష్ట పరిమితిని రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచాలి. ప్యాకేజీ రేట్లు సవరించాలి. ప్రస్తుతం బిల్లులు 8–9 నెలలు ఆలస్యమవుతున్నాయి, వీలైనంత త్వరగా పరిష్కరించాలి. జిల్లా ఆసుపత్రుల గరిష్ట పరిమితిని రూ.50,000 నుండి రూ.1,00,000కి పెంచవలసిందిగా మనవి. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు APCOS ద్వారా పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తక్కువ జీతాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల హామీగా ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు విస్తరించనుంది అని తెలిపింది. అయితే ఇప్పటివరకు అమలు కాలేదు. కాబట్టి తక్షణమే ఈ పథకాలను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు విస్తరించవలసిందిగా మనవిగ్రామ/వార్డు కార్యదర్శుల డిమాండ్లు రెండు సంవత్సరాల సేవ పూర్తి చేసి ప్రొబేషన్ ప్రకటించబడిన తర్వాత వారికి నోటిషనల్ ఇన్‌క్రిమెంట్స్ మంజూరు చేయవలసిందిగా మనవి. II. గ్రామ/వార్డు కార్యదర్శుల పోస్టులను జూనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేసి ప్రమోషన్ల అవకాశాలు కల్పించాలి. దీనివల్ల అదనపు ఆర్థిక భారం ప్రభుత్వంపై ఉండదు. జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ ఆడిటర్లు, జూనియర్ అకౌంటెంట్ల రెగ్యులరైజేషన్ కంపాషనేట్ గ్రౌండ్స్‌పై నియమించబడి, కావలసిన విద్యార్హత కలిగిన అభ్యర్థులు CPT (Computer Proficiency Test) ఉత్తీర్ణత పొందిన వెంటనే, రెండు సంవత్సరాల గ్రేస్ పీరియడ్‌లోనే రెగ్యులరైజ్ చేయాలని మనవి. పదోన్నతులపై స్పష్టీకరణ (GO Ms.No.92 ప్రకారం) ప్యానెల్ ఇయర్‌లో ప్రమోషన్ రద్దు చేసుకున్న ఉద్యోగులు, అదే సంవత్సరం తర్వాత ఖాళీ వస్తే పరిగణించాలా? లేక ఒక సంవత్సరం తర్వాత మాత్రమే పరిగణించాలా? అనే విషయంపై స్పష్టత ఇవ్వవలసిందిగా మనవి. 28.08.2023కి ముందు ప్రమోషన్ రద్దు చేసుకున్నవారికి GO 92/2023 రిట్రోస్పెక్టివ్‌గా వర్తిస్తుందా లేదా అనే విషయంపై కూడా స్పష్టీకరణ ఇవ్వవలసిందిగా మనవి. 01.04.2020 నుండి 31.12.2021 మధ్య రిటైర్ అయిన వారికి తేడా మొత్తాల చెల్లింపు CFMSలో సదరు కాలంలో రిటైర్ అయిన వారికి సంపాదించిన సెలవు ఎన్‌కాష్‌మెంట్ డిఫరెన్షియల్ అమౌంట్ చెల్లించే సదుపాయం కల్పించవలసిందిగా కోరామన్నారుAPPTD ఉద్యోగుల ప్రమోషన్లు గత 4 సంవత్సరాలుగా APPTD ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వలేదు. దీంతో చాలామంది ఆర్థిక నష్టంతోనే రిటైర్ అయ్యారు. సంబంధిత ఫైల్ (No.2379231) ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. దీన్ని తక్షణమే పరిష్కరించవలసిందిగా మనవిAPPTD నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్‌ను APCS జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చడం APPTD నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్‌ను శాశ్వత సభ్యులుగా APCS జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చవలసిందిగా మరియు వారి ప్రమోషన్ ఫైల్ క్లియర్ చేయవలసినదిగా మనవి…NGO అసోసియేషన్ భవనాలకు, కాంప్లెక్సెస్ కు ఇదివరకటి వలె ప్రాపర్టీ పన్ను నుంచి మినహాయించడం వంటివి సమావేశం దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగిందని విద్యాసాగర్ వివరించారు.

ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ స్కోరు కార్డులలో టెట్ మార్కుల అభ్యంతరాలకు ఆఖరి అవకాశం.

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : డీఎస్సీ స్కోరు కార్డులలో టెట్ మార్కుల అభ్యంతరాలకు ఆఖరి అవకాశం. మెగా డీఎస్సీ 2025 స్కోరు కార్డులు ఇదివరకే విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యంతరాల స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఇప్పటికే ఉంచినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. కావున అభ్యర్థులు టెట్ మార్కుల్లో ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని, ఆఖరి అవకాశంగా భావించి 21.08.2025వ తేదీ మధ్యాహ్నం 12.00 లోపు సరిచేసుకోవాలని కోరారు. ఇట్లు, ఎం.వి. కృష్ణారెడ్డి, కన్వీనర్ మెగా డీఎస్సీ, ఆంధ్రప్రదేశ్.

క్రైమ్

అటవీ ఉద్యోగులతో ఘర్షణ..శ్రీశైలం ఎమ్మెల్యే తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.

తిరుపతి

ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

తిరుపతి విమానాశ్రయం రోడ్డులోని ఐఐటీడీ భవసనంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశారు.సీఎం వర్చువల్ గా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.విద్యార్థులకు, స్టార్టప్స్ వ్యాపారవేత్తలకు నూతన అవకాశాలు ఈ హబ్ ద్వార కలుగుతాయని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.