Sunday, 10 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

హౌసింగ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : సమీక్షలో పాల్గొన్న మంత్రులు పార్థసారథి, నారాయణ. 2029 నాటికి ఏపీలో ఇల్లు లేని వాళ్లు ఉండకూడదు. ఇప్పటి వరకు 2.81 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. సెప్టెంబర్ నాటికి మరో 3 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం. వచ్చే 2 ఏళ్లలో 9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తాం. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం నిలిపివేసింది. 163 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. త్వరలో టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం : మంత్రి నారాయణ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

SPBVD డిగ్రీ కాలేజీ విద్యార్థుల విజయబేరి

*VSU 4th సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో SPBVD డిగ్రీ కాలేజీ విద్యార్థుల విజయభేరి…* పొదలకూరు:20 ఆగస్టు పున్నమి ప్రతినిధి విక్రమ సింహపురి యూనివర్శిటీ విడుదల చేసిన డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో పొదలకూరు పట్టణం బాలాజీ నగర్ లో *సాయి విధ్యానికేతన్* ఆధ్వర్యంలో నడాపబడుతున్న SPBVD డిగ్రీ కాలేజీ విద్యార్ధిని టి. ప్రశాంతి B.COM గ్రూపు నందు 9.19 గ్రేడ్ పాయింట్లుతో పొదలకూరు మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు, BCA గ్రూపు నందు CH. వినయ్ 9.23పాయింట్లతో మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు, అదేవిధంగా BCA నందు ఎం. అపర్ణ 9.08, ఎం. అనిత 9.2 పాయింట్లతో కాలేజీ ద్వితీయ తృతీయ స్థానాలను సాధించారు. ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు SVN విద్యాసంస్థల చైర్మన్ బి. వెంకటేశ్వర్లు, మేనేజింగ్ డైరెక్టర్ టి. నరేంద్ర రెడ్డి, అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పిల్లల ఆహారం.. ఆమెకు ఫలహారం

పిల్లల ఆహారం… ఆమెకు ఫలహారం పొదలకూరు ఆగష్టు పున్నమి ప్రతినిధి: అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందాల్సిన పౌష్టిక ఆహారం అంగన్ వాడి టీచర్ కు ఫలహారంగా మారిన సంఘటన పొదలకూరు పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి… వెంకటేశ్వర నగర్ కాలనీలో అంగనవాడి కార్యకర్తగా పనిచేస్తున్న సునీత చిన్నారులు గర్భవతులు బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తోంది. అంగన్వాడి కేంద్రంలోని కోడిగుడ్లు పాలు బాలామృతం చిక్కీలు రాగి పిండి తదితర పౌష్టికాహారాన్ని మొత్తం ఆటోలో బజారుకి తరలిస్తుండగా గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు ఐసిడిఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐసిడిఎస్ సిడిపిఓ విజయలక్ష్మి అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని రిజిస్టర్లు నిల్వలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో గర్భవతులు, బాలింతలను విచారించారు. అక్కడ పనిచేసే అంగన్వాడీ కార్యకర్త సునీత తమకు గత కొంతకాలంగా సరుకులు ఇవ్వడం లేదని అడిగితే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి రాలేదని తమను బెదిరిస్తోందన్నారు. అంగన్వాడి కేంద్రాలపై ఐసిడిఎస్ సూపర్వైజర్ సిడిపిఓ లా పర్యవేక్షణ లేకపోవడంతో కార్యకర్తల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని బిజెపి టిడిపి టిడిపి నాయకులు ఆరోపించారు. చిన్నారుల పౌష్టికాహారాన్ని తస్కరించిన అంగన్వాడి కార్యకర్తపై గట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్త సునీత దాటవేస్తూ పట్టుబడిన సరుకులను పరిశీలించ్చానని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి కఠిన చర్యలు తీసుకొంటామని చెప్పారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పిల్లల ఆహారం.. ఆమెకు ఫలహారం

పిల్లల ఆహారం… ఆమెకు ఫలహారం పొదలకూరు ఆగష్టు పున్నమి ప్రతినిధి: అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందాల్సిన పౌష్టిక ఆహారం అంగన్ వాడి టీచర్ కు ఫలహారంగా మారిన సంఘటన పొదలకూరు పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి… వెంకటేశ్వర నగర్ కాలనీలో అంగనవాడి కార్యకర్తగా పనిచేస్తున్న సునీత చిన్నారులు గర్భవతులు బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తోంది. అంగన్వాడి కేంద్రంలోని కోడిగుడ్లు పాలు బాలామృతం చిక్కీలు రాగి పిండి తదితర పౌష్టికాహారాన్ని మొత్తం ఆటోలో బజారుకి తరలిస్తుండగా గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు ఐసిడిఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐసిడిఎస్ సిడిపిఓ విజయలక్ష్మి అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని రిజిస్టర్లు నిల్వలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో గర్భవతులు, బాలింతలను విచారించారు. అక్కడ పనిచేసే అంగన్వాడీ కార్యకర్త సునీత తమకు గత కొంతకాలంగా సరుకులు ఇవ్వడం లేదని అడిగితే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి రాలేదని తమను బెదిరిస్తోందన్నారు. అంగన్వాడి కేంద్రాలపై ఐసిడిఎస్ సూపర్వైజర్ సిడిపిఓ లా పర్యవేక్షణ లేకపోవడంతో కార్యకర్తల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని బిజెపి టిడిపి టిడిపి నాయకులు ఆరోపించారు. చిన్నారుల పౌష్టికాహారాన్ని తస్కరించిన అంగన్వాడి కార్యకర్తపై గట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్త సునీత దాటవేస్తూ పట్టుబడిన సరుకులను పరిశీలించ్చానని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి కఠిన చర్యలు తీసుకొంటామని చెప్పారు.

తెలంగాణ

గొర్రెలకు, మేకలకు వేసే నట్టల మందుల కొరత :చెరుకుపల్లి

కేతేపల్లి : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) కేతేపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ఉన్న పశువైద్యశాలలో గొర్రెలకు, మేకలకు వేసే నట్టల మందులు గత 2 సంవత్సరాల నుండి మందులు రావడంలేదని, ఎన్నిసార్లు అధికారులకు తెలిపిన పంపడం లేదని, అదే విధంగా గ్రామంలోని గోర్లు, మేకలు పెంచే ప్రతి ఒక్కరు గోర్లు, మేకలకి వాక్సిన్ తప్పకుండ వేయించుకొని, వాటిని కాపాడుకోవాలని లైఫ్ స్టాక్ అసిస్టెంట్ సుంకబోయిన సైదమ్మ గారు తెలిపారు. ఆగస్ట్ నెలలో కురిసిన వర్షాలకు పశువైద్యశాలలో నీరు నిలువడం మరియు భవనం చుట్టూ ఉన్న గోడలు కూలె స్థితిలో ఉన్నవి కావున వాటిని కట్టించాలని ప్రజలు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

కావలి ఎమ్మెల్యే పై హత్యాయత్నానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే ను అరెస్ట్ చేయాలి…/////

పున్నమి న్యూస్, కావలి, ఆగస్టు 20: – సూత్రధారులు, పాత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలని కూటమి నేతలు డిమాండ్- కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పై హత్యాయత్నానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు డిమాండ్ చేశారు. కావలి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. టిడిపి నేతల నిరసన కార్యక్రమంతో గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అన్నవరం క్వారీ వద్దకు వస్తున్నారన్న సమాచారం అందుకొని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు హత్యాయత్నానికి రెక్కీ నిర్వహించారని తెలిపారు. మారణాయుధాలతో దాడి చేయాలని, డ్రోన్ల సహాయంతో ఎమ్మెల్యే ని కనిపెట్టాలని కుట్ర పన్నడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే కార్యక్రమం మారిపోవడం, క్వారీకి వెళ్లక పోయేసరికి ప్రమాదం తప్పిందని, అక్కడ ఉన్న సిబ్బందిపై దాడికి దిగడం జరిగిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మాజీ ఎమ్మెల్యే అనుచర్ల చేతిలోని మారణాయుధాలను, వారి అనుచరులు కొంతమందిని అదుపులో తీసుకోవటం జరిగిందని తెలిపారు. నిందితులు కొంతమంది మాత్రమే దొరకటం జరిగిందని, మరి కొంతమంది పారిపోవటం జరిగిందని తెలిపారు. ఈ ఘటన వెనుక ఉన్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ని, అలాగే ఈ ఘటతో ప్రమేయం ఉన్న వారి అనుచరుల మొత్తాన్ని అరెస్ట్ చేయాలన్నారు. ప్రశాంతమైన కావలిని హత్యా రాజకీయాలకు నిలయం చేస్తారా? అంటూ రెక్కీ ఘటనపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి హింసాత్మక, విధ్వంసక ఆలోచనలు ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరమంటు ఆయన ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టిడిపి అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య, కండ్లగుంట మధుబాబు నాయుడు, కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవులb రామకృష్ణ, మహాజన సైన్యం సురేంద్ర, పెద్ద ఎత్తున తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

పెంచలకోన రోడ్డుకు మోక్షం ఎప్పుడో?

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతోన్న పెంచలకోనకు వెళ్ళేందుకు సరైన రహదారి లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేజర్ల మండలం ఆదూరుపల్లి నుండి రాపూరు మండలం గోనుపల్లి వరకు దాదాపు 20 కిలో మీటర్ల దూరం రోడ్డుపై అడుగుకు ఒక గుంత చొప్పున ప్రయాణం నరకయాతనగా ఉన్నదని వాహనదారులు వాపోతున్నారు.ఈ మార్గంలో ప్రతి రోజూ వందలాది వాహనాలలో భక్తులు ప్రయాణిస్తుంటారు. గత ఎన్నికల ముందు నేటి సిఎం చంద్రబాబు నాయుడు కూడా స్వామి వారిని దర్శించుకొని ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. గత బ్రహ్మోత్సవాల్లో నామమాత్రంగా గుంతలు పూడ్చారు. ఆ పనులలో కాంట్రాక్టర్లు నాసిరకం కంకర మరియు తారు వేయడం వలన చిన్నపాటి వర్షానికే తారు కంకర లేచిపోయి మరలా గుంతల మయం అయిపోయాయి. ఈ మార్గం గుండా నిత్యం ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రయాణిస్తున్న ఎవరు కూడా దీని బాగు కొరకు పట్టించుకున్న వారు లేరు.ఎవరూ కూడా ఈ రోడ్డు బాగు చేయించుకోలేక పోతున్నారు. నిత్యం ఈ రోడ్డు నుండి సుమారు వందల వాహనాలు శుక్ర, శని వారాలలో పోతూ, వస్తూ ఉంటాయి. ఈ రోడ్డు వెంబడి గ్రామాలకు నిత్యం ఆర్టీసీ బస్సులు కూడా నడుస్తుంటాయి. ఆయా గ్రామాల నుండి ప్రతిరోజు బస్సులు కూడా ఇదే రోడ్డు గుండా ప్రయాణిస్తుంటాయి .కానీ ఎవ్వరు ఈ రోడ్డు గురించి మాత్రం పట్టించుకోరు. చిన్నపాటి వర్షం కురిసిన ఇక్కడ రోడ్లు చెరువును తలపిస్తుంటాయి. ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.అనేకమార్లు అధికారులకు ,నాయకులకు, ఫిర్యాదులు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక నెల క్రితం ఆర్ అండ్ బి అధికారులు తూతూ మంత్రంగా గుంటలు చదును చేయించారు కానీ, తరువాత వర్షాలకి మళ్లీ పూర్వస్థితికి వచ్చేసాయి. కానీ మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకి రోడ్డంతా జలమయం అయింది, ఆ నీరు అలాగే ఉండటం గుంతలు పెద్దగా మారి రోడ్డు రూపురేఖలు మారిపోతున్నాయి. కావున ఈ రోడ్డు గురించి అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపించగలరని, మావూరి రోడ్ కి మోక్షం ఎప్పుడో ? అని ఆయా గ్రామాల ప్రజలు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలుపు నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలంలోని చిత్తలూరు గ్రామంలో పొలం పిలుస్తుంది. కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఈఓ ఎస్. సుజాత మాట్లాడుతూ ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ చర్యలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా కౌలు రైతులు సాగు చేస్తున్న పంట లు కు తప్పనిసరిగా సీసీ ఆర్సీ కార్డులు పొందాలని సూచించారు. సీసీ ఆర్సీ కార్డుకు ఒక ఫోటో, ఆధార్ కార్డు, తీసుకొని విఆర్ఓ ని సంప్రదించి కార్డులు పొందవలసినదిగా చెప్పారు. ఈ కార్యక్రమంలో విఎఎ జాన్సీ మరియు రైతులు పాల్గొన్నారు.

తిరుపతి

మాట తప్పిన కూటమి ప్రభుత్వం

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తీసివేసిన వికలాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హులైన వారి పెన్షన్ లను తీసేసి మాటతప్పిందని.వాటిని పునరుద్ధరించి మాటనిలబెట్టుకోవాలని సూచించారు.

తెలంగాణ

ఇనుపాముల అండర్ పాస్ బ్రిడ్జి క్రింద వరద ప్రవాహం

నకిరేకల్ :ఆగస్ట్ ( పున్నమి ప్రతినిధి ) నకిరేకల్ మండలంలోని ఇనుపాముల గ్రామం వద్ద ఉన్న అండర్ పాస్ లో వరద అధికంగా ఉండడంతో గత వారం రోజుల నుండి గ్రామ ప్రజలు ప్రయాణించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో వరదలో పడి గాయాలపాలైన వారు చాలా మంది ఉన్నారు. ఈ సమస్య గురించి అధికారులకు ఎన్నిసార్లు తెలిపిన పట్టించుకున్నవారు ఎవరు లేరు. గ్రామం నుండి ప్రతి రోజు అనేక మంది ఇదే దారినుండి నకిరేకల్ కు ఉద్యోగరీత్యా మరియు ఇతర అనేక పనుల కోసం వస్తుంటారు. కావున ఆవరద నీరు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.