Sunday, 10 May 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

చందమామపై 2040లో అడుగుపెట్టనున్న భారత వ్యోమగామి

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : చందమామపై భారతీయ వ్యోమగామి 2040లో అడుగుపెట్టనున్నాడని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించాక సంబంధిత వాణిజ్యం 800 కోట్ల డాలర్లకు చేరిందని 2040లో చంద్రుడిపై భారత వ్యోమగామి పాదం మోపి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారన్నారు.

జాతీయ అంతర్జాతీయ

భారత్ కు ఎరువులు, యంత్రాల సరఫరాకు సిద్దమైన చైనా..!

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, చైనా విదేశాంగ మంత్రి వాంగ్యా ఢిల్లీ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ కు యూరియా, ఎన్పీకే, డీఏపీ, అరుదైన ఖనిజాలు సరఫరా చేయడానికి చైనా అంగీకరించింది. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడం, సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడంపై దృష్టి పెట్టారు.

క్రైమ్

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేవారిపై చర్యలు! రాష్ట్ర హోంశాఖామంత్రి వంగలపూడి అనిత.

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేవారిపై చర్యలకు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టం వాస్తవాలను తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఒక ఫ్యాక్ట్ పైండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తాం అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రజలను అభత్రావాభానికి గురి చేస్తున్నారు ఎపి బ్రాండ్ ను దెబ్బతీసే రీతిలో సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు సూపర్ సిక్స్ పధకాలను సూపర్ హిట్ చేస్తే తట్టుకోలేక లేనిపోని ఆరోపణలు. శ్రీకాంత్ పెరోల్ రద్దు చేసి తిరిగి జైలులో పెట్టాం దానిపై విచారణ జరుగుతోంది. ➖రాష్ట్ర హోంశాఖామంత్రి వంగలపూడి అనిత. ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతా భావానికి గురిచేసే వారిపై ఇకపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురానున్నట్టు రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖామంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలను చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడమే గాక అభధ్రతా భావానికి గురి చేస్తున్నారని ఇకపై అలాంటి దుష్ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని స్పష్టం చేశారు.అంతేగాక ప్రత్యేకంగా ఒక ప్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి వాస్తవాలేమిటో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు.అమరావతి మునిగిపోయిందని విజయవాడ ప్రకాశం బ్యారేజి గేట్లు పనిచేయడం లేదని పలు అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో ఇష్టారీతిన ప్రసారం చేస్తూ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తున్నారని ఇకపై అలాంటి తప్పుడు వార్తల ప్రసారాలను సమర్ధవంతంగా తిప్పకొట్టడం తోపాటు అందుకు కారకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి అనిత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ విజయవంగా అమలు చేయడంతో ప్రతిపక్షపార్టీ తట్టులేక పోతోందని అందుకే సోషల్ మీడియా వేదికగా దుప్ప్ర్రచారాన్ని చేస్తోందని హోం మంత్రి అనిత విమర్శించారు.ఇది ఆపార్టీకి వారసత్వంగా వచ్చిన సమస్యగా ఉందని ఆమె ఎద్దవా చేశారు.ఒక్క ఆగష్టు నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ,నేతన్నలకు,నాయి బ్రాహ్మణులకు 200 వరకూ ఉచిత విద్యుత్,స్త్రీశక్తి పధకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిచండం జరిగిందని అన్నారు. నాలుగు రోజుల్లో సుమారు 20 లక్షల మందికి పైగా మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించి సుమారు 20 కోట్ల రూ.ల వరకూ లబ్ది పొందారని తెలిపారు.అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే ఎపి బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా ప్రతిపక్ష వైసిపి వారి అనుబంధ మీడియా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిత పేర్కొన్నారు.ఎపి బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడాలంటే ముందుగా గుర్తువచ్చేది సియం చంద్రబాబు నాయుడేనని అలాంటి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడమేమిటన్నారు. అమరావతిపై లేనిపోని రాతలు రాసేవారిపై కేసులు పెడతామని ఆనాడు రఘురామ కృష్ణ రాజుపై కాదు ఈనాడు మీరు పెడుతున్న తప్పుడు పోస్టులపై రాజద్రోహం కేసులు పెట్టాలని అన్నారు.ఇకపై ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సియం స్పష్టం చేశారని మంత్రి అనిత పునరుద్ఘాటించారు.అసాంఘిక శక్తులను ఎలా అరికట్టాలో చంద్రబాబుకు బాగా తెలుసని అలాంటి శక్తులపై ఉక్కుపాదం మోపుతామని శాంతిభద్రతల విషయంలో రాజీలేదు హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. శ్రీకాంత్ అనే వ్యక్తి పెరోల్ రద్దు చేశాం-ప్రస్తుతం జీవితఖైదు అనుభవిస్తున్నాడు:మంత్రి అనిత పెరోల్ రావడం వెనుక ఏముంది ఎవరున్నారనే దానిపై పూర్తిగా విచారణ జరుపుతున్నామని ఈసంఘటనలో ఎవరున్నా వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.శ్రీకాంత్ విషయంలో ఎస్కార్ట్ సిబ్బందిపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికి పెరోల్ వచ్చిందని జైలు అధికారి చెప్పారని వెంటనే అతని పెరోల్ రద్దు చేసి తిరిగి జైలుకు పంపామని అన్నారు.ఈఘటనలో పోలీస్ అధికారులు ఎవరున్నా వారిపై కూడా విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అరుణ అనే మహిళ దిశా ఫౌండేషన్ కు సెల్ప్ డిక్లేర్డ్ సెక్రటరీ అని ఆమె నుంచి హోంశాఖ పేషీకి ఫోన్ వచ్చిందని దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నామని ఆమె గురించి ఆమె వెనుకున్న వారి గురించి ఆరా తీస్తున్నాని తెలిపారు. (జారీ చేసినవారు:డైరెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం)

ఆంధ్రప్రదేశ్

APMDSC 2025 పై కీలక నిర్ణయం వెలువడింది

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : APMDSC 2025 పై కీలక నిర్ణయం వెలువడింది నేటి సాయంత్రానికి వెబ్సైట్ లోకి మెరిట్ లిస్ట్ విడుదల. రేపు ఉదయానికి సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేసి రోస్టర్ పాయింట్స్ కి అనుగుణంగా ఎంపికైన అభ్యర్థుల చరవాణిలకు సమాచారం అందవేత. వీలైతే ఈ రాత్రికే అభ్యర్థులకు నేరుగా మొబైల్ ఫోన్ లకు సమాచార పంపిణీ. 21 నుండి సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. సెప్టెంబర్ 5 నాటికి పాఠశాలల్లోకి నూతన ఉపాధ్యాయులు..

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఈ నెల 20 నుంచి డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్లు

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : ఏపీలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అదే రోజున వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. రిజిస్ట్రేషన్లకు ఐదారు రోజులు సమయం ఇవ్వనున్నారు.

జాతీయ అంతర్జాతీయ

ఆసియా కప్‌ 2025కు భారత జట్టు ఎంపిక

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : ఆసియా కప్‌ 2025కు భారత జట్టు ఎంపిక 15 మందితో జట్టును ప్రకటించిన BCCI సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌ , వరుణ్‌ చక్రవర్తి, కుల్‌దీప్‌ యాదవ్‌, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), హర్షిత్‌ రాణా, రింకుసింగ్‌

ఆంధ్రప్రదేశ్

ఏపీ లో మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : మిని అంగన్‌వాడీ కార్యకర్తల అప్‌గ్రేడేషన్. పదో తరగతి ఉత్తీర్ణులైన 4687 మంది మిని అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. వీరి గౌరవ వేతనం నెలకు రూ.11,500 గా నిర్ణయించారు. 340 మిని అంగన్‌వాడీ కేంద్రాల విలీనం. 340 మిని అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలలో విలీనం చేయనున్నారు. ఈ విలీనం రెండు షరతుల ఆధారంగా జరుగుతుంది: ఆ కేంద్రంలో లబ్ధిదారులు 10 కంటే తక్కువగా ఉండాలి. ఆ కేంద్రం సమీపంలోని మెయిన్ అంగన్‌వాడీ కేంద్రానికి 1 కిలోమీటరు లోపు అందుబాటులో ఉండాలి. ఈ ప్రక్రియ రాబోయే 4 సం.ల్లో దశల వారీగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు

డిఎస్పీ నరసింహమూర్తి సూచనల మేరకు శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగుల భద్రత మరియు వైద్య సిబ్బంది యొక్క విజ్ఞప్తి మరియు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని హాస్పిటల్ నందు పోలీస్ అవుట్ పోస్టు రాత్రిపూట ఏర్పాటు చేయడం జరిగిందని టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటన! జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ : జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటించనున్నారు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో భారీ ఎత్తున జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశం ద్వారా ఆయన పార్టీ కార్యకర్తలకు రాబోయే రోజుల పార్టీ కార్యక్రమాల, కూటమి స్ఫూర్తి, కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడం వంటి అంశాల్లో స్పష్టమైన మార్గదర్శకత్వం అందిస్తారు.ఈ వేదికపై పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పాల్గొని కార్యకర్తలకు సందేశం ఇవ్వనున్నారు. సమావేశంలో రాబోయే రోజుల్లో పార్టీ కార్యకలాపాలు, కూటమి స్ఫూర్తి, కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడం వంటి కీలక అంశాలపై వివరణ ఇవ్వనున్నట్లు చెప్పారు.జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖలో ఇచ్చిన ప్రెస్ మీట్‌లో, ఈ సమావేశం పార్టీ కార్యకర్తలకు భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల రూపరేఖను స్ఫష్టంగా చూపిస్తూ, పార్టీ దిశలో సమన్వయాన్ని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్న విషయం వెల్లడించారు.

అన్నమయ్య

వాల్మీకి సేవాదళ్ పరామర్శ

తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం తిమ్మన చెరువు గ్రామానికి చెందిన రాజాకొడుకును ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ వాల్మీకి సేవాదళ్ సంగం పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పుష్ప నారాయణరెడ్డి, రమేష్, రాజా, చిన్నా టౌన్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి సేవాదళ్ ఎల్లప్పుడూ వాల్మీకుల పక్కన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని లింగమయ్య గారు స్పష్టం చేశారు. అలాగే మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అన్న, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.