Monday, 11 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆగస్టు 18 కాట్రేనికోన శ్రీమతి&శ్రీ పోలిశెట్టి వీరాంజనేయులు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల.. పటవల లో 1999-2000 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కళాత్మకంగా నిర్వహించడం జరిగింది… జ్యోతి ప్రజ్వలన గణపతి ప్రార్ధన వందేమాతరం కూచిపూడి గురువులకు సత్కారం పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ పరిచయ వేదిక ఆటపాటలతో ఎంతో ఆనందంగా జరిగింది చి,, సంస్కృతి చేసిన నాట్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అజయ్ వర్మ సభా వేదికను నడిపిస్తూ గురువులకు స్వాగతం పలుకగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు మందాల వీరభద్రరావు, సత్యనారాయణ, శివ సత్యనారాయణ లను పూర్వ విద్యార్థులందరూ పాద పూజ చేసి సత్కరించుకున్న తీరు గురువులు పట్ల విద్యార్థులకు విద్యార్థుల పట్ల గురువులకు ఉండే బంధాన్ని ఆప్యాయతను పెంపొందిస్తూ మరింత శోభన తీసుకొచ్చింది నాకు ఇది పునర్జన్మ అని శ్రీను చెప్పగా మిత్రులందరూ భావోద్వేగానికి గురయ్యారు… ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడిన మిత్ర బృందం తాను చదువుకున్న పాఠశాలలో 25 వసంతాల తర్వాత కలుసుకోవడంతో అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన్మయత్వానికి గురయ్యారు… స్వర్గస్తులైన గురువులకు, విద్యార్థులకు మౌనం పాటిస్తూ భావోద్వేగానికి గురయ్యారు ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ఆశీస్సులు అందించిన గురువులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ నారాయణ, చైర్మన్ శివప్రసాద్, చి,,సంస్కృతికి, విజయవంతం చేయడానికి కృషి చేసిన మిత్రులందరికీ.. తనపై నమ్మకం కలిగిన మిత్రులకు అజయ్ వర్మ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు

అన్నమయ్య

“హనుమంతు” వారి నూతన గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న బత్యాల

రైల్వేకోడూరు పట్టణం లక్ష్మీనగర్లో సోమవారం నాడు హనుమంతు వెంకటరమణ, శ్రీమతి సావిత్రి గారి నూతన గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు బత్యాల చంగల్ రాయుడు గారు నూతన గృహప్రవేశం చేసిన కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు

భద్రాద్రి కొత్తగూడెం

డైరెక్టర్ ల స్థానంలో ప్రత్యేక అధికారిని నియమించాలి : ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ జన్కో జనరల్ సెక్రటరీ రమేష్

కో-ఆపరేటివ్ సొసైటీలో నెలకొన్న అసంపూర్ణ సమస్యల పరిష్కారానికి జెన్కో యంత్రాంగం శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ జెన్కో జనరల్ సెక్రెటరీ తిప్పారపు రమేష్ పేర్కొన్నారు. క్రెడిట్ సొసైటీ ఎన్నికలు జరుగుతాయని, ఉన్న డైరెక్టర్ల పదవి కాలం ముగిసిందనే ప్రచారంతో రుణాలు నిలిపివేయడం శ్రేయస్కరం కాదన్నారు. డైరెక్టర్ల స్థానంలో ఓ ప్రత్యేక అధికారిని నియమించి, ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. సొసైటీ కార్యాలయానికి ఇంతవరకు ఇంచార్జి ని ప్రకటించక పోవడం శోచనీయమన్నారు. కార్మికులు, ఉద్యోగుల పిల్లల పెళ్లిళ్లు, ఆరోగ్యరీత్యా లోన్స్ పెట్టుకొని ఉన్నారు. కానీ ఇంతవరకు ఆ సొసైటీ లోన్స్ గురించి ఎవరూ మాట్లాడకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గమనించి, సమస్యను పరిష్కరించాలని రమేష్ కోరారు.

ఖమ్మం

మున్నేరు వరద ఉదృతి..

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతి నిధి గత కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాల ప్రభావం తో ఖమ్మం నగర పరిధిలో ని మున్నేరు నది ఉదృతం గా ప్రవహిస్తున్నది. మున్నేరు పరివాహక ప్రాంతల్లో ప్రజలు అప్రమత్తం గా ఉండాలి అని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో 24 గంటలు అధికారులు, సహాయక సిబ్బంది అందుబాటులో ఉంటారని ప్రజలు అత్యవసర సేవలు కోసం టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చెయ్యండి అని సంభంధిత అధికారులు కోరుతున్నారు. అత్యవసరము అయితే నే ప్రజలు బయటకు రావాలి అని లేకపోతే రావద్దు అని అధికారులు హేచ్చరిస్తున్నారు

ఖమ్మం

అరకొర వసతులతో ఇరుకు ఇరుకు గదుల్లో నేల కొండపల్లి తహసీల్దార్ కార్యాలయం

పువ్వాడ నాగేంద్రకుమార్ పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ 👉నేల కొండ పల్లి తహసీల్దార్ కార్యలయం విజిటింగ్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లోని నేల కొండ పల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం. ఇక్కడే సబ్ రిజిస్టర్ కార్యాలయం, ట్రెజరి కార్యలయం. తహసీల్దార్ వారి కార్యలయం ఇన్ని ఉన్న ఈ భవనం చాలీ చాలని గదులు, అరకొర వసతులు, ప్రతి నిత్యం ప్రజలు ఎదో ఒక పని మీద కార్యాలయం కి వస్తుంటారు. కార్యలయం బయట కావాల్సినంత కాళీ స్థలం ఉంది అని ఇలా ఇరుకు భవనం లో కార్యలయాలు ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం లో గల ఈ నేల కొండ పల్లి మండలం లోని ఇలాంటి కార్యలయాలని ఆధునీకరణ చెయ్యాల్సిన అవసరం ఎంత అయినా ఉంది అని ప్రజలు కోరుతున్నారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

కొలువుదీరిన బిజెపి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన కార్యవర్గం

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు N రాంచందర్ రావు గారి ఆదేశానుసారం నూతన కార్యవర్గానికి నియామక పత్రాలు అందించినా బిజేపీ జిల్లా అధ్యక్షులు ధోనీ శ్రీశైలం బిజెపి నూతన జిల్లా ప్రధాన కార్యదర్శులుగా అరిగేలా మల్లికార్జున్, కోవ విజయ్ కుమార్, రాపర్తి ధనుంజయ్ కుమ్రం భీం ఆసిఫాబాద్ బిజెపి జిల్లా నూతన కార్యవర్గం ఈరోజు కొలువుదీరినట్లు బిజెపి జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం గారు పత్రికా ప్రకటనలో తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ N రామచందర్ రావు గారి ఆదేశానుసారం నూతన జిల్లా కమిటీని ప్రకటించినట్లు అలాగే నియామక పత్రాలు అందజేశారు , జిల్లా ప్రధాన కార్యదర్శులు ↩️ 1)అరిగెల మల్లికార్జున్, 2)కొవ విజయకుమార్, 3)రాపర్తి ధనుంజయ్, జిల్లా ఉపాధ్యక్షులు ↩️ 1) బండి రాజేందర్ గౌడ్, 2) పేందర్ మారుతి , 3) పరిపల్లి రాణి , 4) అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్, 5) బానోత్ వెంకట్ నాయక్, జిల్లా కార్యదర్శులు ↩️ 1) S. సోమేశ్వర్, 2) చేవూరి నవీన్ గౌడ్, 3) కేంద్ర సుబోధ్, 4) తాల్లా ఇందిర, 5) చాప్లె రోజా, 6) సమీర్ గుప్తా, జిల్లా కొశధికారి↩️ 1) కొలిపాక కిరణ్ కుమార్ కార్యాలయ కార్యదర్శి ↩️ 1) జాడి సూర్యప్రకాష్ సోషల్ మీడియా ఇన్చార్జి ↩️ 1) పాలే సంతోష్ మీడియా కన్వీనర్ ↩️ 1) V . సత్యనారాయణ ఐటీ ఇన్చార్జి ↩️ 1) అమిత్ భిశ్వాస్ గార్లను భారతీయ జనతా పార్టీ కుమ్రం భీం ఆసిఫాబాద్ నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చెసినట్లు తెలిపారు.

తెలంగాణ

వల్లాల గ్రామాన్ని సందర్శించనున్న : ఎమ్మెల్యే

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేలు గారు మంగళవారం (19 ఆగస్ట్ 2025) నాడు శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో నూతనంగా నిర్మంచిన అమరవీరుల పైలాన్ పరిశీలన కార్యక్రమం లో ఎమ్మెల్సీ, నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి. శంకర్ నాయక్ గారితో కలసి ఉదయం 11:30 గంటలకు వస్తారు. కావున మండల పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొనవలసిందిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమరం రెడ్డి గారు ప్రకటించారు.

హైదరాబాద్

చిన్న జీయర్ స్వామి ని కలిసి న బిజెపి తెలంగాణ చీఫ్

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు శంషాబాద్ లో గల చిన్న జీయర్ స్వామి ఆశ్రమం లో స్వామీ జి ని మార్యాద పూర్వకముగా కలిసి ఆశీస్సులు పొందారు. వీరి వెంట తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులు దేవకీ వాసు దేవా రావు ఉన్నారు

ఎలూరు

అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి మండల కేంద్రమైన ఆగిరిపల్లి లో మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆగిరిపల్లి లో గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు హయంలోరూ.42 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. స్థానిక హరిజనవాడలో రూ.45 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకును, రూ.17 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు మార్గదర్శకులు సహకారంతో పి -4అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ఎలూరు

సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఆదర్శం

సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఆదర్శం ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి బడుగు, బలహీన వర్గాల వారిని వేధించిన వారిపై పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఆదర్శమని వడ్లమాను ఎంపీటీసీ సభ్యులు రాణి మేకల సత్యనారాయణ అన్నారు. మండలంలోని వడ్లమాను లో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యులు సత్యనారాయణ, గౌడ సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కుప్పాల నాగరాజు, జలసూత్రం శ్రీనివాసురావు, పామర్తి సత్యనారాయణ, రాణి మేకల వడ్డీలు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.